అమ్మ శతజయంతి ఉత్సవాలలో భాగంగా రెండవ శోభాయాత్ర రేటూరు గ్రామం నుండి 8/5/2022 ఆదివారం నాడు సాయంత్రం 4గం.కు ప్రారంభమై, జిల్లెళ్ళమూడి అమ్మ ఆలయం వరకు జరిగింది.
రేటూరులో నాన్నగారు శ్రీబ్రహ్మాండం నాగేశ్వరరావుగారు నివసించిన స్థలం దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద, శోభాయాత్రకు ఏర్పాట్లు చేసి శ్రీ కొండముది ప్రేమకుమార్ గారు రేటూరు శోభాయాత్ర ఆంతర్యం వివరించారు. సర్వశ్రీ M.దినకర్, కొండముది సుబ్బారావు- రేటూరుకు జిల్లెళ్ళమూడికి గల అనుబంధాన్ని తెలియజేశారు. అనంతరం కొండముది ప్రేమకుమార్ దంపతులు అమ్మకు పూజ నిర్వహించారు.
అలంకరించిన ఎడ్ల బండిపై అమ్మ,
జెండాలు చేత ధరించి అమ్మనామం చేస్తూ సోదరులు ముందుకు కదిలారు. రేటూరువాసులు సుఖవాసి కుమారి, ప్రత్తిపాటి లక్ష్మమ్మ, ఇనగంటి శ్రీలక్ష్మి, కుర్రా తులసి, ఇనగంటి ఉదయ లక్ష్మి, నన్నపనేని అనూరాధ, బ్రహ్మాండం అనురాధ, బోడపాటి శ్రీదేవి, నక్కా పార్వతి, బోడపాటి ఉదయలక్ష్మి, పమిడిపాటి శివకుమారి తదితరులు, జిల్లెళ్ళమూడి నుండి గిరిధర్కుమార్ అన్నయ్య, డా॥ సిద్ధార్థ కుటుంబసభ్యులు, విద్యాధర మొ. అక్కయ్యలు అన్నయ్యలతో శోభాయమానంగా రేటూరు గ్రామ వీధుల్లో శోభాయాత్ర సాగింది. అమ్మకాలెండర్, కుంకుమ, పులిహోర పంచటం జరిగింది.
ఈ యాత్ర ద్వారా కొత్త వారికి జిల్లెళ్ళమూడిని పరిచయం చేయటం జరిగింది.
యాత్ర సాగుతుండగా బాటసారులు, వాహనదారులు, ఆసక్తిగా తిలకించి అమ్మను గూర్చి అడిగి తెలుసుకున్నారు.
నన్నపనేని విజయలక్ష్మి, రోహిణి, సువర్ణ, దొప్పలపూడి సరిత, సుభద్ర, B. మల్లీశ్వరి, D. పున్నమ్మ, ప్రత్తిపాటి శ్రీనివాసరావు దంపతులు, బ్రహ్మాండం సత్యనారాయణ భజన బృందం ఉత్సాహంతో ఉల్లాసంగా ఆద్యంతం శోభాయాత్రలో పాల్గొన్నారు. అమ్మ నామశాలువాలను వారికి ప్రసాదంగా అందించటం జరిగింది.
ఈ శోభాయాత్రలో చిన్నా, పెద్దా అందరూ పాల్గొనడమే కాక ఒక శునకం రేటూరు మొదలు జిల్లెళ్ళమూడి వరకూ ఉత్సాహంతో అనుసరించటం విశేషం.
యాత్రకు సహకరించిన శ్రీ YVS రమణ గారికి, చి. భరద్వాజ్, చి, కొండముది రామకృష్ణ కాశ్యప్, శ్రీకాంత్, త్రయంబకం, తదితరులకు శోభాయాత్రలో పాల్గొన్న అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
సాయంసంధ్యలో ఆహ్లాదకర వాతావరణంలో చల్లగాలులు, ఒక సెకను చినుకులు, చందమామ అందరినీ అలరిస్తూ పలకరిస్తుండగా ఈ రెండవ శోభాయాత్ర పదిలంగా హృదయంలో నిలచి, ఆనంద పరవశులను చేసింది.
అందరికీ ధన్యవాదాలతో… అమ్మకు ప్రణామాలతో….