పాలకొండలో అమ్మ శతజయంతి సంవత్సర శుభారంభ సందర్భంగా శ్రీకాకుళంజిల్లా పాలకొండలో ఏప్రిల్ 24వ తేదీ ఆదివారం ఉదయం 10గం.కు జిల్లెళ్ళమూడి అమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చీరల పంపిణీ కార్యక్రమం జరిగినది. అమ్మ తత్త్వచింతన సదస్సు సన్నాహక సమావేశం ఈ సందర్భంగా నిర్వహించడమైనది.
శ్రీ మజ్జి సత్యం అధ్యక్షతలో ముఖ్యఅతిథిగా శ్రీ పి. మధుసూదనరావు పాల్గొని అమ్మ సందేశాన్ని అద్భుతంగా వివరించారు. పది మందికి భోజనం పెట్టడమే మోక్షమనే అమ్మ ప్రబోధం అని తెలియజేశారు. అనంతరం కోటదుర్గమ్మ ప్రాంగణములో రామలింగేశ్వర ప్రాంగణములో అన్నప్రసాద వితరణ మరియు చీరల పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో సర్వశ్రీ అరటి కట్ల కామేశ్వరరావు, కొత్తూరు హరనాథ్, పి. చైతన్య కుమార్, వేగిరెడ్డి సుబ్బారావు, గంట సత్యంనాయుడు ప్రభృతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగా శ్రీ బౌరోతు శంకర్రావు వ్యవహరించారు. ప్రతినెల మూడవ ఆదివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలియజేసారు
కొవ్వూరులో అమ్మ శతజయంతి
బాపట్ల తాలూకా జిల్లెళ్ళమూడి అమ్మవారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా కొవ్వూరు పట్టణంలో బాటసారులకు మంగళవారం మజ్జిగను పంపిణీ చేశారు. అమ్మవారి సేవా సమితి సభ్యుడు గుడివాక శ్రీనివాస్ మాట్లాడుతూ ఏడాది పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. కేవీఆర్ కుమార్, ఎల్.ఎస్.ఎస్.శర్మ, ఎం. రామ్ ప్రసాద్ చలివేంద్ర నిర్వహణకు సహకరించారు.