శ్రీశైల మహా క్షేత్రానికి నాలుగు ప్రధానద్వారాలున్నాయి. వాటిలో మొదటిదైన తూర్పు ద్వారంగా ప్రఖ్యాతమగు క్షేత్రము త్రిపురాంతక క్షేత్రానికి అతి సమీపంలో ఉన్న గ్రామము అన్నసముద్రం. ఈ గ్రామమున శుద్ధ శ్రోత్రియులుగా వేద, స్మార్త I శాస్త్ర పండితులుగా సుప్రసిద్ధులు శ్రీ శ్రిష్టి రామయ్య గారు, వీరి ధర్మపత్ని భ్రమరాంబగారు. ఈ పుణ్యదంపతులకు అష్టదిగ్గజముల వంటి ఎనిమిది పుత్రరత్నములు కలిగిరి. వారిలో మూడవ సంతానముగా ది. 17-11-1957న శ్రీయుతులైన డా. శ్రిష్టి లక్ష్మీనరసింహం గారు జన్మించారు.
వీరి ప్రాధమిక విద్యాభ్యాసం తండ్రి గారి సమీపంలోనూ, గ్రామమందలి ప్రాధమిక పాఠశాలలోనూ జరిగింది. అటు పిమ్మట ఉన్నత పాఠశాల విద్య అంతా వీరి పెదనాన్న గారి కుమారులైన సరస వినోదినీ ప్రియులైన బ్రహ్మశ్రీ శ్రీనివాసశర్మ గారి వద్ద జరిగింది. ఆ తరువాత విద్యాభ్యాసమంతయూ పితృసమానులైన జ్యేష్టసోదరులగు సుప్రసిద్ధ వ్యాకరణ పండితులైన బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రిష్టి లక్ష్మీ ప్రసన్నాంజనేయ శర్మ గారి పర్యవేక్షణలో మాతృశ్రీ ప్రాచ్య కళాశాలలో జరిగింది. మాతృశ్రీ ప్రాచ్య కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్ధిగా వీరు 1971 నుండి 1974 వరకు సాహిత్య విద్యా ప్రవీణులుగా విద్యా సముపార్జన చేయుట జరిగినది. ఆ తరువాత ఎమ్.ఎ. పూర్తి చేసి, వ్యాకరణ శాస్త్రములో పి.హెచ్.డి. కూడా పూర్తి చేసియున్నారు.
విశ్వజనని జిల్లెళ్ళమూడి అమ్మ ఆశీస్సులతో 1982వ సంవత్సరంలో సంస్కృత పాఠశాల ప్రధానోపాధ్యాయ పదవిని స్వీకరించారు. ఆ తరువాత తాను చదువుకున్న మాతృశ్రీ ప్రాచ్య కళాశాలలోనే ఆచార్య పదవిని అలంకరించి 1989 వరకు పనిచేసియున్నారు.
ఈ సమయంలో వీరు చేసిన ఉద్యోగధర్మం అనన్య సామాన్యమైనది. ఒక తరగతి విద్యార్థులకు దిశానిర్దేశకునిగా మార్గదర్శనంచేస్తూ, వారి వృద్ధికి, విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందించారు. ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ విశ్వజననీ పరిషత్లోని పెద్దల సూచనలను అనుసరిస్తూ అమ్మ ఆవరణలోని అందరి ఆదరణకు పాత్రులయ్యారు. విద్యార్థులకు సామాజిక సేవ పట్ల అభిరుచి కలిగించుటకై ఎస్.ఎస్.ఎస్.డైరెక్టర్ గా యూనివర్సిటీ వారి గుర్తింపుతో పని చేసి సమాజసేవ కూడా ముఖ్యమైనదేనన్న విషయంలో ఆసక్తిని కలిగించారు. కళాశాల హాస్టలు వార్డెన్ గా బాధ్యతాయుతమైన సేవాధర్మాన్ని ఆదర్శప్రాయంగా నిర్వహించారు.
ఆ తరువాత 1989లో పాండిచ్చేరిలో సంస్కృత పరిశోధకునిగా పదవిని చేపట్టి పనిచేశారు. పుదుచ్చేరి, కంచి, శస్త్ర మొదలగు అనేక విశ్వ విద్యాలయములలో అతిథి ఉపన్యాకునిగా తమ అమూల్య సందేశాన్ని అందించి విద్యాలయ అభివృద్ధికి అనేక సలహాలను సూచనలను అందించారు. వీరు చేసిన సంస్కృత భాషా సేవకు గాను భారత ప్రభుత్వము వారు అత్యున్నత స్థాయిగల రాష్ట్రపతి పురస్కారాన్ని 2017వ సంవత్సరానికి గాను అందించింది. ఇటీవల కాలం వరకు వీరు అనేక మంది విద్యార్థులకు సలహాలను సూచనలను చేస్తూ దిశా నిర్దేశం చేస్తూ డాక్టరేట్ సంపాదించుకొనుటకు తమ సహకారం అందించిన మహనీయుడు.
ఉన్నత విద్యావంతులైన వీరికి 1989 ఆగస్టు 25వ తేదీన తెనాలి పట్టణానికి సమీపంలో గల ఈమని గ్రామ వాస్తవ్యులైన బ్రహ్మశ్రీ వంగర లక్ష్మీనారాయణ గారి కనిష్ఠ పుత్రికయగు పద్మ సావిత్రి గారితో వివాహం వైభవంగా జరిగింది. శ్రీమతి పద్మసావిత్రిగారు సంస్కృత విద్యా ప్రవీణులే కాక దేశభాషయైన హిందీ భాషా బోధకురాలిగా ప్రస్తుతం పాండిచ్చేరి ప్రభుత్వము నందు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఆదర్శదంపతులకు ఇరువురు కుమారులు, ఒక కుమార్తె కలిగారు. పెద్ద కుమారుడు పతంజలి మద్రాస్ ఐ.ఐ.టి.లో ఉత్తమస్థాయిలో విద్యాభ్యాసము చేసి, అమెరికా సంయుక్త రాష్ట్రములయందు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. రెండవ అబ్బాయి శ్రావణ్ సింగపూర్ నందు ఉన్నత ఉద్యోగము చేయుచున్నారు. ఇక వీరి గారాలపట్టి లక్ష్మి ప్రసిద్ధి చెందిన జిప్మర్ నందు వైద్య విద్యాభ్యాసము చేసి, ప్రస్తుతము వారి శ్రీవారితో హైదరాబాద్ నందు సుఖజీవనము చేయుచూ, వైద్యురాలిగా సేవలను అందచేయుచున్నారు.
అత్యుత్తమ భక్తి విశ్వాసములుగల వీరు అనేక దేవాలయములకు గుప్తదానములు చేసియున్నారు. అంతే కాక ఎంతో మంది విద్యార్థులకు ఉచితముగా విద్యాదానాన్ని అందించారు. తమ మాతృ సంస్థయైన జిల్లెళ్ళమూడి కళాశాల విద్యార్థులకు నిరతాన్నదాన సేవలో భాగస్వామ్యం అందించారు. నిత్యము సుందరకాండ పారాయణము చేసే వీరు తన షష్టిపూర్తి మహోత్సవంలో సుందరకాండ పుస్తకాలను అనేక మందికి ఉచితంగా అందించారు. అగ్నిలింగక్షేత్రమైన అరుణగిరి ప్రదక్షిణను శతాధికముగా చేసి అరుణాచలేశ్వరుని కృపకు పాత్రులయ్యారు. ఇటీవల మన జిల్లెళ్ళమూడి క్షేత్రంలో కూడా గోపూజ చేసి దానాదికములను శాస్త్రబద్ధంగా నిర్వహించి గోమాత అనుగ్రహాన్ని, అనసూయమాత అనుగ్రహాన్ని పొందారు. తుదిశ్వాస విడిచే సమయంలో కూడా శ్రీరామ అంటూ రామసాయుజ్యాన్ని పొందిన అపర రామదాసుగా కీర్తింపదగిన మహా మానవతా మూర్తి, అత్యంత సౌజన్యమూర్తి శ్రీనరసింహంగారు. ఉత్తమ అధ్యాపకునిగా, ఆచార్యునిగా, పరిశోధకునిగా వీరు చూపిన మార్గం ఆదర్శనీయమూ, ఆచరణయోగ్యము. ఉత్తమ సోదరునిగా శిష్యవత్సలునిగా అందరికీ ప్రీతి పాత్రులైనారు. మా గురువర్యులు డాక్టర్ శ్రిష్టి లక్ష్మీనరసింహం గారు 11-5-2023 తేదీన అమ్మలో ఐక్యమయ్యారు. వారి యశశ్శరీరం అజరామరం. ఆ మహనీయమూర్తికి నివాళులర్పిస్తూ
శ్రిష్టి వంశసముద్భూతం ఛాత్రానుగ్రహ తత్పరమ్
లక్ష్మీసరసింహశర్మాణం తం వందేహం నిత్య సూరిణమ్.