1. Home
  2. Articles
  3. Mother of All
  4. శ్రీమాత్రేనమః

శ్రీమాత్రేనమః

Pannala Radhakrishna Sarma
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 7
Month : October
Issue Number : 4
Year : 2008

(జూన్, 22, 2008వ తేదీన హైదరాబాదులో నిర్వహించబడిన పుస్తకావిష్కరణ సందర్భంగా సభాసదులకు చదివి, వినిపించమని కోరుతూ రమణాశ్రమమునుంచి డా. పన్నాల రాధాకృష్ణశర్మగారు వ్రాసి పంపిన శ్లోకాలను వారు వ్రాసిన తాత్పర్యంతో ఇప్పుడు పాఠకులకు అందిస్తున్నాం- సంపాదకులు)

సర్వేన్టియవ్యవహృతిం పరికల్పయన్తీం 

ఆధారతాముపగతాం చ దశాత్రయస్య |

నిత్యామతీత్య విదితా మపి దేశకాలౌ

 చిచ్ఛక్తి మాత్మవసతిం పరమాం ప్రపద్యే ॥ 

సమస్తమయిన ఇంద్రియ వ్యవహారములను నడిపించునదియు, జాగ్రత్ : 1:

– స్వప్న – సుషుప్తి రూపమగు అవస్థాత్రయమునకు ఆధారమయినదియు, దేశ కాలములను గూడ అతిక్రమించి ‘నిత్య’గా అనగా, అంతట అన్ని – సమయములలో ఉండునది అని – జ్ఞానులచే తెలియబడినదియు, సర్వజీవుల ఆత్మ నివాసముగా గలదియు, సర్వోత్తమురాలును అగు చిచ్చక్తిని శరణుపొందుచున్నాను. 

సంచోదితా పరచితా కరుణార్ద్రయా యా

జ్ఞానోపదేశ మిషతః స్వయమేవ విద్యామ్ |

హృద్యామవాప్య తమసః శమనీం పరాం సా

రాజామ్బికా వలసదుచ్ఛిత భక్తిపూర్ణా ॥ : 2:

దయామయి అయిన పరమ ‘చిత్’ స్వరూపిణియగు పరదేవతచేత ‘జ్ఞానోపదేశము’ అను నెపముతో ప్రేరేపింపబడిన ‘రాజమ్మ’ అను వ్యక్తి తానే స్వయముగా తన అజ్ఞానాంధకారమును నివారించునదియు, అత్యుత్తమ మయినదియు, మనోహరమయినదియునగు ఆత్మజ్ఞానమును ఆ పరదేవతవలన పొంది పరమభక్తిభరిత అయి భాసించినది.

స్వైరం గృహీతవనితావపుషాZప్రమేయా

 భూమాకృతిః పరచితిర్ధరణీతలే Zస్మిన్, 

మాయావిలాసమభినీయ చ యా స్వథామ్ని

 లీనా సదా భవతు సా జగతోహితాయ ॥ : 3:

“ఇంత’ అని పరిమితిని నిర్ణయించుటకు వీలు కానిదియు, పరబ్రహ్మ స్వరూపిణియునగు పరమ చిచ్ఛక్తి స్వేచ్ఛగా ఈ భూతలమున స్త్రీరూపమును ధరించి తన మాయావిలాసమును అభినయించి తన జ్యోతిస్స్వరూపము నందు విలీను రాలయినది, ఆ పరదేవత సర్వదా విశ్వమునకు హితకారిణి అగుగాక !

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!