(గత సంచిక తరువాయి)
‘హా! యౌవనం శిథిలయామి వృధా విమూఢః
కృత్వాన కించిదపి యత్కరణీయమస్తి ।
కర్తవ్యబోధ విముఖస్య శివే. నసూయే
మాతర్భవాని! మమదేహి కరావలంబమ్ ||’ (24)
దీని అర్థం : ‘అమ్మా! పరమేశ్వరీ! యౌవనం వృథాగా గడుపుతున్నాను. కర్తవ్యాన్ని ఆచరించటం లేదు. కర్తవ్యాన్ని తెలుసుకోవాలనే బుద్ధి కూడా లేదు. అట్టి నాకు దయతో నీ చేయూత నిమ్మా!’ అని.
బాల్యంలో విద్యాభ్యాసమూ, యౌవనంలో విషయోపభోగమూ, వార్ధక్యంలో మునివృత్తి, కడపటి దశలో యోగమార్గంలో శరీరత్యాగమూ అంటూ కాళిదాసు మహాకవి
‘శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణా |
వార్ధక్యే మునివృత్తీనాం యోగేనానే తనుత్యజాం ॥’
అని మనిషి జీవితంలోని నాలుగు దశలు అందు ఆయా కర్తవ్యాలను నిర్దేశించారు. చివరిదశలో యోగసిద్ధి కలగటానికి బీజం వృద్ధి, అభ్యాసము బాల్యం, యౌవనం, వార్థక్య దశలలో ఉండాలి. రిటైర్ అయిన తర్వాత నెలరోజులు శిక్షణ పొందితే రాదు. అందు నాయౌవనం అతి ముఖ్యమైన కాలం. పూనికతో నియమబద్ధమైన దీక్షతో తపస్సును ఆచరించటానికి ఆ సమయం ఎంతో విలువైనది. దానిని వృథా చేసి 60, 70 ఏళ్ళు గడిచిన తర్వాత కరచరణాద్యవయవాలు పట్టు దప్పే స్థితిలో సాధించేదేముంటుంది? అది గత జలసేతు బంధన సదృశం. ‘జిహ్వే కీర్తయ కేశవం…. మూర్ఖం సమాధోక్షజం’ అనేది శ్వాసించినంత కాలం ఆచరించాల్సిందే.
‘కదా వారగ్రామే రుచిరరచనా రాజితతలే
మహోత్తుంగే పీఠే వికచకుసుమాభ్యర్చితపదాం।
త్రిశూలాదీన్ ధృత్వా లసదభయముద్రాం స్థితవతీం
శుభాంగీం త్వాం పశ్యన్ నిమిషమిన నేష్యామి దివసాన్ I’
అంటూ అమ్మ దివ్య దర్శన, పావన సాన్నిధ్య వైభవాన్ని నిత్యం మననం చేసుకోవాల్సిందే. ఆ మధురక్షణాల కోసం ఎదురు తెన్నులు చూడాల్సిందే.
అనుగ్రహైక రూపిణి అమ్మ శ్రీచరణ సన్నిధిలో మన కర్తవ్యం ఏమిటి? ఒకటే. అమ్మను దర్శించటం: అమ్మ సంకల్ప సాధనకి యథాశక్తి మనవంతు కృషి చేయటం; మనందరం అమ్మ అవయవాలు కదా!
‘భక్తి ప్రపత్తి రహితో హమ శిక్షితాత్మా
కుర్వే తవస్తవ మహెూ! పరతంత్ర ఏవ |
ధూర్తస్య కేవల జడస్య శివే నసూయే మాతర్భవాని!
మమదేహికరావలంబమ్ ||’ (26)
దీని అర్థం : ‘అమ్మా! భవానీ! నేను పరాధీనుడను. ఏ విధమైన శిక్షణ పొందియుండలేదు. నీ ఎడల నా మనస్సులో భక్తి, శరణాగతి లేదు. అయినా నీ స్తోత్రాన్ని చేస్తున్నాను. అది బుద్ధిపూర్వకంగా కాదు కనుక వంచన అని తెలుసుకొనలేకున్నాను. అట్టి నాకు దయతో, నీ చేయూతనిమ్మా!’ – అని.
‘మామేకం శరణం వ్రజ’ అని గీతాచార్యులు;
‘నిన్ను నమ్ముకో, నన్ను నమ్ముకో, ఏదైనా ఒకటే.
విశ్వాసమే భగవంతుడు’. అని అమ్మ ప్రబోధించారు.
ఆ విధంగా సర్వసమర్పణ చేసుకోవటమూ ఈశ్వరానుగ్రహమే.
పూజ అంటే పూలు చల్లటం; నమస్కారం అంటే చేతులు కలపటం మాత్రమే కాదు. అందుకు ఆధారం, ఆస్కారం సంస్కారం. అరుణంలో ‘అగ్నే నయ సుపధారాయే అస్మాన్! విశ్వాని దేవవయునాని విద్వాన్। యుయోధ్యస్మజ్జు హురాణ మేనః భూయిష్టాం తే నమ ఉక్తిం విధేమ!’ అనేది ఒక మంత్రం. అంటే ‘ఓ’ అగ్నిదేవా! మా పాపాల్ని నశింపజేసి మమ్మల్ని మంచిబాటలో నడిపించు. ‘నీకు నమస్కారము’ – అని కేవలము మాటలలో చెపుతున్నాను’ అని అర్థం. ఓం అనాద్యంత స్వయం భూత దివ్య మూర్త్యై నమః’ అంటూ పూలో అక్షతలో వేసి నమస్కరిస్తాం. భావన ప్రధానం క్రియతోపాటు. ఆద్యంత రహితమైన మూలతత్వాన్ని సంభావన చేసి, మన అల్పత్వాన్ని గుర్తెరిగి –
‘అవగతముకావు తల్లీ నీ లీల లద్భుతంబులు చూడగా
వివరింపలేక నిన్నూ వేదములె వెనుకాడె కరుణామయీ!’
అంటూ నిజాన్ని త్రికరణ శుద్ధిగా అంగీకరించటమే అంజలి ఘటించడం. మనశుద్దే మనస్సిద్ధి. సకలైశ్వర్య సమస్త జ్ఞాన ప్రాప్తికి హేతువు పరమేశ్వరి అమ్మ అవ్యాజ అనుగ్రహమే.
‘మత్రాణయాన సమయే పరమాద్భుతం తే
దివ్యం స్వరూపం అతిమానుషం అత్యుదారమ్ |
శ్రిత్వా ౬.2 శ్రితావన పరం కృపయానసూయే మాతర్భవాని!
మమదేహి కరావలంబమ్ ||’ – (27)
దీని అర్థం : ‘అమ్మా! జగదానందదాయినీ! ఊహాతీత మహాశక్తీ! ఆశ్చర్యకర వాత్సల్య స్వరూపిణీ! మోక్షసామ్రాజ్య దాయినీ! మనుష్యజనతా భాగ్యరూపిణీ! పరదేవతా! తల్లీ! నా ప్రాణోత్రమణ సమయంలో నీ నిజరూప దివ్యదర్శన భాగ్యాన్ని దయతో ప్రసాదించి నన్ను ఉద్ధరించు’ – అనే విజ్ఞాపన. ఇది ఒక భాగవతోత్తముడు హృదయాంతరాళాల్లో సవినయంగా సభక్తికంగా త్రికరణశుద్ధిగా చేసే అసలైన సిసలైన అంతిమ ప్రార్థన.
కనుకనే ఈ శ్లోకం ఈ స్తోత్రరాజమునకు కట్టకడపటి శ్లోకం అనవచ్చు. 28వ శ్లోకము చివరిది అయినా అది కేవలం ఫలశృతి.
‘మత్ప్రణయాన సమయే’ అనగానే శ్రీరామదాసుగారి
‘ముప్పును కాలకింకరులు ముంగిట నిల్చినవేళ, రోగముల్
కొప్పరమైనచో కఫము కుత్తుక నిండినవేళ – బాంధవుల్
కప్పినవేళ, నీ స్మరణ కల్గునొ కల్గదొ! నాటికిప్పుడే
తప్పక చేతు నీ భజన దాశరథీ! కరుణా పయోనిధీ!’ పద్యం గుర్తుకు వస్తుంది.
సమవర్తి యమపాశాన్ని విసిరినపుడు అది కంఠానికి ఉరిత్రాడై బిగిసిన సమయంలో ‘అంబికాం శరణం భజామిహి కిం విధాస్యతిమే యమః’ అ ప్రార్థించడం, అనన్యశరణాగతి పొందడం అరుదైన విషయం – పురాకృత్ పుణ్యఫలం. ఆ భాగ్యం హైమక్కయ్యకు మాత్రమే దక్కింది. ‘అమ్మా! నువ్వు మాత్రమే కన్పిస్తున్నావు. నీ దగ్గరకే వస్తున్నాను’ అంటూ పాంచభౌతిక శరీరాన్ని పరిత్యజించి, పరమేశ్వరి అమ్మ హృదయాలయంలోకి ప్రవేశించింది.
‘రోగముల్ కొప్పరమైనచో’ అని అన్నారు. వయసు మీరి పటుత్వం నశించి శరీరం వశం తప్పుతున్న వేళ మనస్సూ దుర్బలం అవుతుందేమో! డోలాయమాన మానసిక స్థితి కలుగుతుందో ఆ క్షణం ఎట్లా ఉంటుందో ఎవరికీ తెలియదు. మనిషి ఉండగా మరణం రాదు, మరణం వచ్చాక మనిషి ఉండడు. కనుక ‘నాటికిప్పుడే తప్పక చేతు నీ భజన’ అని అన్నారు శ్రీరామభక్తాగ్రేసరులు. రాబోవు వర్షాకాల ఇక్కట్లను గురైరిగి ముందు జాగ్రత్తగా పొయ్యిలోకి, పొయ్యి మీదికి వస్తు సముదాయాన్ని సమకూర్చుకుంటాం. ఇదీ అంతే.
అంతేకాదు. ‘బాంధవుల్ కప్పిన వేళ’ అన్నారు. వీలునామా వ్రాసి పొమ్మని కొందరు, ఆస్తి తనకే ఇచ్చి పొమ్మని కొందరు కోపతాపాన్ని ప్రదర్శిస్తారు. ఈ రహస్యం తెలియక ఆ రక్త సంబంధీకులను కడసారి చూసుకోవాలని గుండె లబలబలాడుతుంది. ఇక పరధ్యానం లేకుండా ప్రశాంతంగా సర్వేశ్వరి దివ్యపాదాబ్జములపై మనస్సును నిల్పి ఆ రూపాన్ని నామాన్ని స్మరించడం సాధ్యమా?
ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంగతి ఉన్నది. ‘ఆడుచు పాడుచు నీ కథ చాటుచు పయనించెదనే నోయమ్మా! ప్రాణము విడిచెదనోయమ్మా’ తన విజ్ఞప్తిని గానం చేశారు శ్రీరాజు బావ. అమ్మ పావన జీవిత చరిత్రని, దివ్యతత్వాన్ని గానం చేస్తూ కడ వరకు జీవిస్తానని, అదే తనకు ఆనందదాయకమని వారి వేడికోలు. – ‘ఆడుచుపాడుచు’ అనటంలో ఒక తత్త్వ విశేషం, అపూర్వ సార్వత్రిక సత్యం భాసిస్తున్నాయి. ఏ వ్యక్తికైనా ప్రాణోత్కమణం అనాయాసమేనని అమ్మ మాత్రమే చాటి చెప్పింది. శరీరం పడే యాతన రోగాలకి సంబంధించినదనీ, మరణయాతన అనేది లేనేలేదనే వాస్తవాన్ని దయార్ద్ర హృదయంతో విస్పష్టం చేసింది.
‘అంబా పదాబ్జ మధుపానరతేన రాధా
కృష్ణాఖ్య మత్త మధుపేన కృతం మనోజ్ఞమ్|
స్తోత్రం భవేదిదమనుత్తమ సౌఖ్యదాయి
తేషాం సదా సుకృతినా మిహయే పఠంతి॥ (28)
దీని అర్థం : అమ్మ పాద పద్మసేవా సంసకుడైన శ్రీరాధాకృష్ణ శర్మ ప్రణీతమైన ఈ హృద్యమైన మనోహరమైన స్తోత్రాన్ని పఠించడం పుణ్యప్రదం, సకల శ్రేయోదాయకం అని. ఈ శ్లోకంలో ‘మాతర్భవాని! మమదేహి కరావలంబమ్’ అనే మకుటం లేదు; ఫలశృతి ఉన్నది.
ఈ కరావలంబస్తోత్రం ‘అనుత్తమ సౌఖ్యదాయి’ అని అన్నారు. అంటే (న+ఉ) త్తమం అని కాదు) సర్వోత్కృష్టమైన స్తోత్రం కాబట్టి సర్వోన్నతమైన సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం. తెలిసి తెలియక ‘మరామరా’ అని జపం చేసినా మహర్షిగా ఎదిగిన శ్రీమద్రామాయణ కావ్యరచయిత వాల్మీకి, సరస్వతీ కటాక్షం మనందరికీ సువిదితమే. మనోజ్ఞమైన ఈ స్తోత్రంలో ఒక విశేషం ఉంది. ఎవరెవరు ఏ విధమైన క్లేశములు, కష్టనష్టములు, విశీర్ణ జీర్ణహృదయావస్థల వలన అతలాకుతులమై దిక్కుతోచక అలమటిస్తారో వారికి వాటికి సంబంధించిన ప్రార్థనలు స్పష్టీకరించబడినవి. నిర్దుష్టంగా ‘ఈ స్థితిలోనున్న ఈ అసహాయునికి నువ్వే దిక్కు. నీ చేయూతనివ్వమ్మా!’ అని వినతి చేయవీలవుతుంది.
ఇలా ప్రార్థించాల్సిన అవసరం ఉన్నదా అనిపించవచ్చు ఒక విధంగా ఆలోచిస్తే. ఆడగకుండా అవసరాన్ని గమనించి పెట్టే కొండంత అమ్మ అండ మనకి ఉన్నదనే వాస్తవాన్ని మనం మన రెండు కళ్ళతో దర్శించడం కోసం, ఒక ఎరుక, స్పృహ కలిగి ఉండటం కోసం, కృతజ్ఞతని ప్రకటించాల్సిన అవసరం ఉన్నదని. తెలుసుకోవటం కోసం ఈ ప్రార్థన చేయాలి. అమ్మ స్వర్ణోత్సవాల సందర్భంగా లక్షమందికి ఒకే పంకిన అన్నం పెట్టమని అమ్మ తన అపూర్వ అభిలాషను వ్యక్తం చేసింది. ఆ సందర్భంలో ‘ఇంటింటా నువ్వు కాదా మా అందరికీ అన్నం పెడుతున్నది? నీకీ వింత కోరిక ఏమిటి?’ అని అడిగారు ఒక సోదరులు. వెంటనే అమ్మ, ‘నేను పెడుతున్నానని నువ్వు చూడటం కోసం’ అని అన్నది. వాస్తవానికి తల్లి కోసం బిడ్డకంటె, బిడ్డకోసం తల్లే ఎక్కువ తపిస్తుంది, బెంగ పెట్టుకుంటుంది. అమ్మ అలౌకిక మహాశక్తి, పరతత్వం అయి ఉండీ ఒక సామాన్య వ్యక్తిలా కనిపిస్తుంది. అమ్మ సంతానం కోటానుకోట్లు. వారి సమస్యలు అసంఖ్యాకం, అనంతం. మరి ఎలా పరిష్కరిస్తుంది. ‘ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక’ – అన్నట్లు ఎవరి అమ్మవారిదే; అమ్మ హృదయంలో ఎవరి స్థానం వారిదే. అమ్మకీ మనకీ మద్య సంబంధం భగవంతునికి భాగవతునికి మధ్య అఖాతం కాదు; తల్లీబిడ్డల మధ్య సంబంధం, రక్త సంబంధం, అవినా భావ సంబంధం, అద్వైత తత్వం.
జాతీయ వస్తు ప్రదర్శనశాల, ఢిల్లీలో ఒక వర్ణచిత్రం ఉన్నది. అందు బుద్ధభగవానుడు 10 అడుగుల ఎత్తు ఉంటే అతని భార్య, కుమారుడు, మంత్రులు ఒక అడుగు ఎత్తున ఉన్నారు: సింహాసనాన్ని అధిష్టించి రాజ్యాన్ని పరిపాలించమని, తమను ఏలుకొమ్మని అభ్యర్థిస్తున్నారు. కానీ గౌతమబుద్ధుడు భిక్షాపాత్రని వారివైపు చూపుతూ తాను ఎటువైపో చూస్తున్నాడు. ఏమిటో ఈ చిత్రం యొక్క అర్థం? అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. ఆ చిత్రం క్రింద వ్రాసి ఉన్నది – బుద్ధుడు ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఆయన దృష్టి ఉన్నతమైనది, అలౌకికమైనది. మిగిలిన వారంతా సంకుచిత భావాలతో, పరిమితులతో సతమతమౌతున్నారు – అని.
సారాంశము ఏమంటే మనలోని అల్పత్వమే అమ్మలోని అనల్పత్వాన్ని దర్శింపజేస్తుంది; మహదానందాన్ని చేకూరుస్తుంది. అదే ఈ స్తోత్రపాఠ పఠన, మనన రహస్యం. ఉదా: కోట్లాది ప్రాణుల్ని అమ్మ తన ఒడిలో వేసుకుని లాలించే, పాలించే దృశ్యము మనోజ్ఞము, మహోన్నతము, మానవాతీతము. అమ్మ ఒడిలో ఉన్న ఏ వ్యక్తికైనా స్వర్గసుఖాలు తృణప్రాయములే, ‘ఓం స్వోత్సంగాశ్రయ హృష్టాత్మధిక్కృత స్వర్ణవైభవాయై నమః .
ఆపదలని కలిగించేదీ, ఆపదల నుంచి రక్షించేదీ ఒకే శక్తి అని అంటుంది. అమ్మ. ఏమో! తరింపజేసే తల్లిగా భావిస్తూ అమ్మ పాదాల చుట్టూ పసివానిగా పారాడటమే నాకు ఆనందం, ఐశ్వర్యం, మోక్షం ఈ జన్మకు. ఏ జన్మకైనా.