“మాతృశ్రీ మనసాస్మరామె మహేశ్వరి శిరసా నమామి తలవగతరమా తల్లీ లీల – తలవంచనిదెవరు మాతృత్వముమ్రోల
జయహోమాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి”
అనసూయామాత యైన అమ్మ సకల దేవతా స్వరూపిణి. ఎంతోమంది మహాత్ములు మానవ రూపంలో భూమి మీద అవతరిస్తూ ఉంటారు. అటువంటి వారిలో అనసూయ మాత ఒకరు. నిత్య సత్యాలు బోధించి – నిత్యాన్న దానంతో ఆకలి తీర్చిన అన్నదాత అమ్మ. నాన్న అన్న పిలుపుతో పేద- గొప్ప, పెద్ద, చిన్న, కుల మత బేధం లేక అందరూ నా బిడ్డలే నాన్నా అన్న అమృత మూర్తి అమ్మ. ఎంతటి బాధను సైతం మరపించే ప్రేమైక మూర్తి అమ్మ.
చూచిన కొలది చూడాలనిపించే ముగ్ధ మనోహర రూపం అమ్మది. “అనుకున్నది జరగదు తనకున్నదితప్పదు.
తిధులు విధిని మార్చలేవు – ధ్యాసే ధ్యానం ఎన్నో నగ్నసత్యాలు చెప్పిన దేవతా మూర్తి అమ్మ.
అమ్మమాట బంగారు బాట. అమ్మనామం వేదన తీర్చే జలం. అమ్మ ప్రాంగణం భూలోక వైకుంఠం. అమ్మ మనస్సు ప్రేమైక హృదయం.
ఈ ఆధ్యాత్మిక ప్రవాహంలో కెరటమై – క్షణ క్షణం నీ ధ్యాసలో గడపాలనీ – నీ నామాన్ని వినాలనీ – నీ కీర్తనలు- నీ పాటలు- నీ సహస్రాలు పాడాలనీ – నీ అర్చనలో నీ పూజలలో – నీ అభిషేకంలో పాల్గొనాలనీ – నీ నామం నిరంతరం నా గుండెలలో నింపుకోవాలనీ నా కోరిక. నెరవేర్చవమ్మా!