శ్రీ విశ్వజననీపరిషత్ నిర్వాహకులకు ప్రేమతో పి.ఎ.స్వామి వ్రాయులేఖ. పొన్నూరులోని 20వ వార్డు నందు అమ్మసేవాలయం 2001లో స్థాపించబడినది. అనాథ, పేద, పిల్లలు, వృద్ధులకు ఆశ్రయం కల్పించటం సంస్థయొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆ దిశగా ఆశ్రమం కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
ఆకలే అర్హతగా జాతి, కుల, మత, వర్గముల కతీతముగా జగన్మాత, జగజ్జనని జిల్లెళ్ళమూడి అమ్మ “అన్నపూర్ణాలయ స్వర్ణోత్సవాలు” సందర్భంగా కొందరు అమ్మసేవాలయానికి రావటం జరిగింది. అమ్మ దయవలన ఆశ్రమంలోని కొందరు వృద్ధులకు, పిల్లలకు, బట్టలు, పుస్తకాలు ఇచ్చియున్నారు. అదే విధంగా కొంతకాలం క్రితం అమ్మపేరుతో పట్టువస్త్రాలను పిల్లలకు ఇచ్చారు. వృద్ధులకు సహితం ఇచ్చారు. అందులకు అమ్మప్రేమకు కృతజ్ఞతులమై ఉంటాము. పూజ్యులు కేశవశర్మగారు రెండు పర్యాయములు వచ్చి యున్నారు. అన్నయ్యా అమ్మ పేరుతో మీలాంటి పెద్దలు చేస్తున్న సేవలు మాకు స్ఫూర్తిదాయకము అన్నాను. కేశవశర్మగారు అమ్మలో కలశారని తెలిసి దిగ్భ్రాంతులమైనాము. వారు సేవా హృదయులు. వారికి శ్రద్ధాంజలి.
పొన్నూరులో ఒక దయార్ద్రహృదయుడు కొంత భూమిని ఉచితముగా ఆశ్రమానికి ఇచ్చియున్నారు. అందు శాశ్వతమైన భవనము నిర్మించాలని పెద్దలందరు తలంచి యున్నారు. ఈ పని మంచిగా జరగాలని నిండు మనస్సుతో ఆశీర్వదించమని నా ప్రార్థన అమ్మ నిండు దీవెనలు ప్రతిక్షణం ఉంటాయని నమ్ముతూ…..