‘అమ్మ’ శతజయంతి ఉత్సవాలు (2022-2023) ఎన్నిరోజులు చేద్దాం? 3/5/9 రోజుల్లో ఒక అద్భుత కార్యక్రమం ఉండాలి. న భూతో న భవిష్యతి – అన్నట్లు. అది ప్రజల్లోకి వెళ్ళాలి. జిల్లెళ్ళమూడిలోనే కాకుండా రాష్ట్రాలవారీగా జిల్లా వారీగా నిర్వహించాలి. అమ్మ చరిత్ర హోమం, చండీ హోమం, 108 మంది సువాసినుల పూజ, లక్షగాజులతో అర్చన, 1000 కిలోలు (సహస్ర కిలోలు) పుష్పాలతో పూజ, రోజున కొక్క సాంస్కృతిక కార్యక్రమము నిర్వహించాలి.
12 పుష్కర నదీ జలాలతో సుగంధ జలాలతో అభిషేకం చెయ్యాలి. ఇంకా ఇతర కార్యక్రమాల్ని నిర్ధారించుకుని వాటికి ఎంత ఖర్చవుతుంది అని అంచనా వేసుకోవాలి. ప్రజల్లోకి వెళ్ళి విరాళాలు అడిగితే బాగుంటుందని నా ఉద్దేశము. 2021 అమ్మ జన్మదినోత్సవం తర్వాత ఐతే బాగుంటుంది. కొంత మూలధనం (ఫండ్) ఇ.సి. సభ్యుల వద్దగాని, విదేశాల్లో ఉంటున్న సోదరుల వద్ద గాని తీసుకుంటే బాగుంటుంది.