24.1.01న విశ్వజననీపరిషత్ జిల్లెళ్ళమూడి ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గుంటూరు జిల్లా ఓపెన్ ఛెస్ పోటీలను ఉదయం మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి ఆవరణలో శ్రీ విశ్వజననీపరిషత్ ఛీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాలేజీ ఇన్ ఛార్జి ప్రిన్సిపల్ శ్రీ బూదరాజు శాంతారాంగారు అధ్యక్షత వహించారు. సభలో వక్తలు ప్రసంగిస్తూ మారుమూల గ్రామాలలో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యముతో నాన్నగారు క్రీడాకారుడు క్రీడాభిమాని అయినందున ఈ పోటీని నిర్వహించుచున్నామని శ్రీ ఎల్. సత్యనారాయణ (లాలా) తెలియచేసారు.
ఈ పోటీలలో 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో 5 సంవత్సరముల నుండి 60 సంవత్సరముల గలవారు, చిన్న, చిన్న బాల బాలికలు కూడా పాల్గొని ఉత్సాహం చూపించారు. వారికి శ్రీ విశ్వజనీ పరిషత్ వారు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు.
ఈ పోటీలను శ్రీ సుబ్రహ్మణ్యం జాయింట్ సెక్రటరీ ఎ.పి. ఛెస్ అసోసియేషన్ పర్యవేక్షణలో మన కాలేజీ వార్డన్ అయిన మురళి, లాలా సహకారముతో జరిగినవి.
25.1.10న సాయంత్రం 5 గంటలకు జరిగిన ముగింపుసభకు ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్రహ్మణ్యశాస్త్రి, అధ్యక్షులు | గాను, శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు సెక్రటరీ మాతృశ్రీ విద్యాపరిషత్ ముఖ్య అతిథిగా, సోదరులు శ్రీ మధుసూదనరావు విశిష్ట అథితి గాను విజేతలకు నగదు బహుమతి రూ.5,000/- తో పాటు ప్రశంసాపత్రాలను, జ్ఞాపికలను బహూకరించారు. శ్రీ జె. సుబ్రహ్మణ్యం వందన సమర్పణ చేశారు. ఈ మొత్తం క్యాష్ ప్రైజ్ను మన సోదరులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు స్పాన్సర్ చేసారు. ఈ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు, వారి తల్లి దండ్రులు కోచ్లు శ్రీ విశ్వజనని పరిషత్ వారిని బాగా నిర్వర్తించినందుకు అభినందించుతూ రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో కూడా పోటీలను జరపాలని ఆకాంక్షను తెలియజేశారు. పోటీలలో మొదటి స్థానాన్ని టి. పురుషోత్తమన్ గుంటూరు, రెండవ స్థానాన్ని టి. గౌతమ్ గుంటూరు, మూడవస్థానాన్ని ఎన్. రామమోహనరావు, మంగళగిరి కైవసం చేసుకున్నారు.
ఈ పోటీలకు చీరాల, బాపట్ల, పొన్నూరు, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, సత్తెనపల్లి, నర్సరావుపేట, మంగళగిరి, క్రోసూరు మొదలగు ప్రాంతాల వారు పాల్గొన్నారు.
మనం పదిమంది చెప్పింది వినగలం కానీ ఒక్కరు చెప్పినట్లు మాత్రమే చెయ్యగలం.