1. Home
  2. Articles
  3. Viswajanani
  4. శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణకు శ్రద్ధాంజలి

శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణకు శ్రద్ధాంజలి

Bharghava
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : June
Issue Number : 11
Year : 2014

లక్ష్మీనారాయణతో నాకేర్పరచిన సోదరప్రేమకు, మైత్రీ మాధుర్యానికి, ఆస్తతకు, ఆత్మీయభావానికి ముందుగా అమ్మకు నమస్కరిస్తున్నాను.

లక్ష్మీనారాయణోజీవో మాతృశ్రీ పదబంభరః

జీయా దాచంద్రతారార్కమ్ మాతృచైతన్యధారణైః

 

ఏనాడీ అనుబంధమేర్పరచెనో ఇంతై అమ్మ బంధమ్మిటుల్

తానానాకొక సోదరుండగుచు చిత్తంబందు స్థానంబిడెన్

ధ్యానంబందున మాతృదివ్యపదపద్మంబుల్ సదానిల్పు ల 

క్ష్మీనారాయణ కంజలించెదను ప్రేమించే గురుండంచెదన్

 

అమ్మకనుంగు బిడ్డడయి అమ్మను నాన్నను హైమతల్లినిన్

నెమ్మది నిల్పి విశ్వజననీపరిషత్తున కాలయాలకున్

దమ్మునుకూర్చి అమ్మ కనుదమ్ములలో విహరించినట్టి చి

త్తమ్ము గలట్టి పూజ్యుని సుధామధురోక్తుల నంజలించెదన్

 

అందరి యింటి సోదరుడు అందరికన్ననుమిత్రుడౌచు ము

న్ముందుగ కష్టనష్టముల మోదము భేదములందు అండయై

అందరి కమ్మగాధలు ప్రియాతి ప్రియమ్ముగ చెప్పుచుండు స

ద్బంధుని సంస్మరించెదను పావన అర్కపురీ మహీస్థలీన్

 

హైమాలయమ్మున అందచందములద్ది

ముఖమంటపమ్మును మురియజేసె

అమ్మ స్వర్ణోత్సవమ్మా ముఖద్వారము

నెలకొల్పి అమ్మను అలరజేసె

అమ్మ విగ్రహమును అలవోకగా చెక్కి

రూపురేఖల అమ్మ ప్రాపుదెచ్చె 

నాన్నగారే పూన నవనాగ నాగేశ్వ

రాలయ నిర్మాణరాజియయ్యె

అమ్మ ఆపాదమస్తక మాత్మకాగ

పాదుకాలయ నిర్మాణ భరతుడయ్యె

లక్ష్మి నారాయణుండు విలక్షణుండు

అమ్మ సాయుజ్యమందిన బమ్మ అతడు

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!