శ్రీ నాగేశు ప్రతిష్ట కాజ్ఞనిడుచున్ చేయించెలే అమ్మయే.
ఆనా కొంత కుటుంబ శ్రేయమును తా నందించే భావించెనో
ఈనా డిట్లు ప్రసాదు సంతసము నెంతేపొంది సేవారతిని
-హూనంగల్గెనో మెత్తు నమ్మదయ సంపూర్ణంబుగా పొందుటన్
ఒక లోకోత్తరమైన కార్యమును ఉద్యోగించి సాగించెలే
అకలంకాద్భుత మాతృతామహిమతో అత్యంత శ్రద్ధ్భాకువై
ప్రకటీభూత మహానుభూతులను రాబట్టంగ ప్రశ్నించుచున్
సకలాంధ్రావని భక్తకోటులు ప్రపంచంలందు హర్షించగా
సంగీత సాధన సాధించకుండనే
-అమ్మ మెచ్చెడి పాట లాలపించె
సాహిత్యవీక్షణ సాగించకుండనే
– కులపతిన్ మెప్పించు బలమునందె
నటనలో ఒక పటుతరశ్రమ లేఖ
రూపకాలందున లోతులెరిగె
అసలు ఛాయాచిత్ర బిన లెఱుంగనివాడె
వీడియో తీయుట వేదు నేర్చి
అమ్మ చల్లని చూపింత అందువాడు.
మూగవాడైన వాక్చియై మురియగలరు.
కుంటివాడైన కొండెక్కి కులుక గలదు.
రావురి ప్రసాదు అట్టులే రాటుదేలే.
గోలీలాడేడి బాల్యమందు చీకూచింతలేకుండ తా
నీ లీలా మహనీయభూమిపయి అమ్మే ధ్యేయమై నిల్వగా
“వాలీబాలు”లు “బాదు మింటను”లు రాపాడించి వస్తారుగా..
తేనె ద్రావురి సుప్రసాదుడు యశోధీరుండుగా నిల్చుచున్
ఆ రుషి నారాసింహుడన అతని తండ్రి సమస్త మమ్మపై
భారమువైచి నామజప పాఠగుడై తరియించి పోయె – పెం
పరగ అమ్మ అండనిలువన్ తన సోదర సోదరీతతిని
చేరగదీసి జీవనము చేకురజేసి ప్రసాదు బాధ్యత
తనను మెచ్చి ఉపాధిని తనకు కూర్చ
ముందుకురికిన సోదరముఖ్యల గని.
కూర్మి బావలు, తమ్ముని కొనగ జేసి
త్యాగమయుడు ప్రసాదుని తలతు నేను
మనసుమంచిది – మాటలో మార్దవమ్ము
కానుపించని ఒక కొంత కారణాన
పెడసరి యటంచు తలతురు పిన్న పెద్ద
అమ్మలీలలు చిత్రము లయలేము
కలుగు నొడిదుడ్కు లన్నిట కలతపడక
జీవనమునందు వృద్ధిని చేరుకొనిన
రావురి ప్రసాదు నెంతయు ప్రస్తుతింతు
మాతృవిశ్వాస ద్రధమ సమాదరింప
ఇది తెమ్ము అదితమ్ము ఇటులైన నెటులంచు
చెలగి యేమడుగని శేషు భార్య
బూటులేదే మాకు హాటులేదే అని
పీడించబోనట్టి పిల్లలనగ
ఆడుబిడ్డలు కూడ అల్లుళ్ళ మర్యాద.
లింతయేనా అని యెగసిపడరు.
తమ్ముని మనసది తల్సీలు చెందినన్
తగురీతి అన్నకు తలనువంచు
ఆరయ అనుకూలవతియైన అతివ భార్య
యోగ్యులైనట్టి బిడ్డలే భాగ్యవశత
ఉన్న ఉద్యోగమున్ వీడి – యెన్నుకొనియె
అమ్మసేవ ప్రసాదును అభినుతింతు
అన్ని తానైన అమ్మకు అంజలింతు
ఆయు రారోగ్య భాగ్యము లందుజేసీ
మహనీయ సేవలో నెదుగజేసి
మదికి యే మంటలోనట్టి మనిషి జేయ.
-ఆత్మీయబంధువు
పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్