ప్రధానకార్యదర్శి శ్రీ డి.వి.యన్. కామరాజు గారు నివేదిక సమర్పిస్తూ –
శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్, శ్రీ అంగర సూర్యనారాయణరావు, శ్రీమతి భాగ్యమ్మ మున్నగు సోదరీ సోదరులు అమ్మలో ఐక్యమైనందున వారి స్మృత్యర్యం ముందుగా రెండు నిముషాలు మౌనంగా అమ్మను ప్రార్థించారు.
నూతనంగా ఏర్పడిన ‘విశ్వజనని’ మాసపత్రిక సంపాదకులు, సంపాదక మండలిని పరిచయంచేసి, శుభాకాంక్షలు తెలిపారు.
అమ్మ శతజయంతి సందర్భంగా –
J.A.S.S. ఆధ్వర్యంలో హైదరాబాద్లో లో ప్రేమార్చనలు, జయప్రదంగా పార్వతీపురంలో అనుదినం సాగుతున్న అమ్మ అన్నప్రసాద వితరణ, శృంగవరపుకోటలో శ్రీ విన్నకోట భాస్కరశర్మ చేపట్టిన అన్నప్రసాద వితరణ, అమరావతిలో శ్రీచక్కా శ్రీమన్నారాయణగారి ఆధ్వర్యంలో అమ్మ పూజలు ప్రసాదాలు, కాకినాడలో శ్రీ అప్పారెడ్డిగారి కార్యక్రమాలను వివరించి కార్యనిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లెళ్ళమూడిలో 1 కోటి 60 లక్షల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో నిర్మించనున్న 20 గదుల అతిథి గృహాన్ని గురించి వివరించి తన్నిర్మాణ బాధ్యతను వహించిన శ్రీ గిరిధరకుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
మాతృశ్రీ ప్రాచ్య కళాశాల బాలికల వసతిగృహ నిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్నదని, ప్రస్తుతం 50 మంది విద్యార్థినులకు వసతి చేకూరిందని, త్వరలో ఇంకా 10, 11 గదులు అందుబాటులోకి వస్తాయని, ఇప్పటికి రెండు కోట్లు పైగా ఖర్చు అయిందని – అంతా అమ్మకృప అని అంజలి ఘటించారు.
అమ్మ నివసించిన పవిత్ర భవనం, అందరింటి మరమ్మత్తులకు ఇరవై లక్షలు ఖర్చు అయిందని, మరొక పది/పదిహేను లక్షలు ఖర్చు అగునని, అందుకు అందరూ సహకరించవలెనని విజ్ఞప్తి చేశారు.
– సుగతిపథం తొలి రూపకర్త శ్రీ ఐ. హనుమ బాబు గారు. ఇటీవల శ్రీ కుమ్మమూరు నరసింహమూర్తి గారు, శ్రీ కుమ్మమూరు కృష్ణగారల సహకారంతో భవన మరమ్మత్తులు పూర్తి అయినవి అని తెలిపి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ ఎమ్.వి.ఆర్.సాయిబాబు గారి కృషితో సాగుతున్న ‘అమ్మశతకోటి నామజప యజ్ఞం’, డా॥ బి.యల్.సుగుణ గారి ప్రోత్సాహంతో సాగుతున్న ‘అమ్మకు అక్షరార్చన’ కార్యక్రమం, చి||లు శ్రీకాంత్, ప్రేమజ్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న జిల్లెళ్ళమూడిలోని ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలు, శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం గారి నిర్వహణలో జయప్రదంగా 243 మంది దీక్షగా 9 సమూహములలో
‘మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు’ పారాయణలను వివరించి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.
అమ్మ శతజయంతి సంవత్సరంలో జిల్లెళ్ళమూడిలో అనుదినం నిర్వహించే కార్యక్రమాలు ఉదయం నగర సంకీర్తన, అమ్మ అఖండ నామ వేదిక వద్ద నిత్యనామ సంకీర్తన, ఉదయం గం. 10 లకు అంబికా సహస్రనామ పారాయణ, సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ, నెలకొకసారి శుద్ధ ఏకాదశి నాటి సాయంత్రం సహస్ర దీపాలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు మున్నగు వాటిని వివరించి అమ్మ బిడ్డలందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
రెండు ట్రస్టులు : శ్రీ విశ్వజననీ పరిషత్ – S.V.J.P. Trust, S.V.J.P. Temples Trust అనెడి రెండు ట్రస్టులుగా రూపాంతరం చెందబోతున్నదని తెలిపి అట్టి ఏర్పాటుకు కృషిచేస్తున్న సో॥ శ్రీ పొత్తూరి ప్రేమగోపాల్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.