నాహం కర్తాన కర్మాహం న భోక్తా న చ వై క్రియా ।
తవ పుత్రైవ నాన్యోహం రక్ష మాం జగదీశ్వరి
భావం: అమ్మా!… నేను అంత కోటి నామ మంత్రాన్ని రాసే, జయహో మాత నామం జపించే కర్తను కాను. నీ ఆశయాలను సాధించే కర్మనూ కాను. నీవు సంతోషించే ఏ క్రియలను నేను చేయలేను. పాప పుణ్యాలను అనుభవించే భోక్తను కాను. కానీ అమ్మా.. నేను మాత్రం ప్రతి రోజు నీ కుమారుడననే తృప్తితో జీవిస్తాను తల్లీ.
నాహం యథా చాంజనేయః రామకార్యధురంధరః
తథాపి తే నామ స్మర్తా రక్ష మాం జగదీశ్వరి! ॥
భావం: తల్లి! నేను రామ కార్యసాధకుడైన ఆంజనేయుని కాను. నేను నీ యొక్క నామమును జపించే బిడ్డను. నన్ను రక్షించుము తల్లి.
బహవశ్చ సుతా లోకే విస్మరన్తి స్వమాతరమ్!
నా హం భవేయం తాదృక్తః రక్ష మాం జగదీశ్వరీ!!
భావం: అమ్మా ! ఈ లోకములో చాలా మంది కుమారులు తమను కని, పెంచిన తల్లి ప్రేమను మరచి పోతున్నారు. వారిలో నేనొకని కాకుండా జీవించునట్లు నన్ను రక్షించు జగదీశ్వరీ.
అన్నపూర్ణేతి త్వాం మత్వా తవాంతికముపాగతః!
ప్రసాదం దేహి మే దేవి! రక్ష మాం జగదీశ్వరీ!!
భావం: అమ్మా నిన్ను అన్నపూర్ణా దేవిగా భావించి నీ సమీపమునకు చేరుకున్నాను. నాకు అన్న ప్రసాదం
అనుగ్రహించి నన్ను రక్షించు తల్లి.
మాతృవాత్సల్యసందీప్తా దీనావనకృతైకధీః |
ప్రేమామృతపయోదోగ్రీ రక్షమాం జగదీశ్వరీ!॥
భావం: అమ్మా! తల్లి యొక్క వాత్సల్యముతో ప్రకాశించెడి, దీసుల రక్షించుట మాత్రమే బుద్ధి యందుంచు కొనెడి, ప్రేమయను అమృతమైన క్షీరమునిచ్చు తల్లీ ! జగదీశ్వరి! నన్ను రక్షింపుము.
నాహం జానామి వైకుంఠం న వా కైలాస సద్గిరిమ్
అర్కపుర్యేవ జానామి రక్ష మాం జగదీశ్వరి!॥॥
భావం: అమ్మా! అల వైకుంఠ మేమిటో నాకు తెలియదు. అమోఘమైన కైలాస పర్వతం నాకు తెలియదు. కాని అమ్మా! అందరిల్లు అయిన అర్కపురి | మాత్రము నాకు తెలుసు. నన్ను రక్షించుము తల్లి.
నాహం జానామి కోపం తే శిక్షాం నైవ కదాచన ।
లాలనం సర్వదా జానే రక్ష మాం జగదీశ్వరి! |
భావం: అమ్మా! నీకు కోపము వస్తుందా! వస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు. నీవు విధించే శిక్ష కూడా తెలియదు. కానీ అమ్మా…. నీ యొక్క లాలన మాత్రము నాకు తెలుసు నన్ను రక్షించుము తల్లి…
చక్షుర్ధ్వయం న పర్యాప్తం త్వాం ద్రష్టుం భువనేశ్వరి |
అంతశ్చక్షుశ్చ మే దద్యాత్ రక్ష మాం జగదీశ్వరి ! ॥
భావం: అమ్మా! ఈ భువన భాండములను వ్యాపించిన నిన్ను చూడటానికి ఈ రెండు కళ్ళు సరి పోవుట లేదు. కావున తల్లి! నీవు నాకు మనోనేత్రాన్ని అనుగ్రహించి, నన్ను రక్షించుము.
బహవో నిర్జరాః సన్తి యే చాదృశ్యస్వరూపిణః ।
త్వాం తు ప్రత్యక్ష దేవీతి భజామి త్వాం మహేశ్వరి!|
భావం: అమ్మా! అదృశ్య రూపంలో ఎంతో మంది దేవతలు ఉన్నారు. కాని ప్రత్యక్ష దేవతవైన నీవు నన్ను రక్షించుము.
కాని అమ్మా! నా పిచ్చిగాని అంతటా వ్యాపించిన నీకోసం రావడ మేమిటి? నన్ను రక్షించే తల్లివి నీవే కదా.
యదక్షరం మయా ప్రాప్తం సర్వం త్వద్భిక్షయాగతమ్||
త్వం హి సరస్వతీ దేవి! రక్ష మాం జగదీశ్వరి ॥
భావం: అమ్మా! నేను నేర్చుకున్న ఏ విద్య అయినా అది నీ అనుగ్రహం వల్ల వచ్చింది. సరస్వతీ దేవతయగు నీవు నన్ను రక్షించుము.
కిం కర్తవ్యమకర్తవ్యం న జానామి జగస్థితే |
త్వద్ధ్యానమేవ నాన్యద్ధి, రక్ష మాం జగదీశ్వరి |
భావం: అమ్మా! ఏది చేయాలో ఏది చేయకూడదో నాకు తెలియదు. నీ జ్ఞానమే తప్ప వేరొకటి తెలియనే తెలియని నన్ను రక్షించుము.
చంద్రోదయేన కల్హారో ప్రఫుల్లతి యథా తథా |
యాం దృష్ట్వా మనఃఫుల్లం రక్ష మాం జగదీశ్వరి ||
భావం: అమ్మా! చంద్రోదయముతో కలువపువ్వు తల్లీ! ఏవిధంగా వికసించునో అలాగే ఆహ్లాదకరమైన నీ
వదనము చూచి నా మనస్సు విప్పారుచున్నది. నన్ను రక్షించుము తల్లీ.
మాతా మాతేతి జలపన్ జగామార్కపురీం తదా ।
సర్వతో వ్యాపితా దేవీ! రక్ష మాం జగదీశ్వరి॥
భావం: తల్లి! అమ్మా… అమ్మా… ఆర్తితో పలుకుచూ ఆనాడు నీకోసం జిల్లెళ్ళమూడికి వచ్చాను.
యువాహం శూన్యమస్తిష్కః జలహీనఘటో యథా |
త్వచ్చరణాశ్రితో దీనః రక్ష మాం జగదీశ్వరి
భావం: అమ్మా! నీరు లేని ఖాళీ కుండ వలే శూన్యమైన మస్తకం నాది. నేను దీనుడను. నీ చరణార విందములను ఆశ్రయించాను. నన్ను రక్షించుము తల్లి.
న మాతురన్యదేవీతి ప్రోచుశ్చ బహు పండితాః |
త్వమేవాభయదాత్రీతి రక్ష మాం జగదీశ్వరి
భావం: అమ్మా! తల్లిని మించిన దైవం లేదని చాలా మంది పండితులు చెప్పుచున్నారు. కావున ఎల్లవేళలా అభయమునిచ్చే తల్లివి నీవే కదా. నన్ను రక్షించుము
యావత్కాలం చ దేహాం స్త్రీ తావత్కాలం భజామ్యహమ్ ||
త్వం చ ముక్తి ప్రదాత్రీతి రక్ష మాం జగదీశ్వరి ||
భావం: అమ్మా ! వేయి యేల చెప్పుటకు? ఎంతకాలము నా శరీరము ఉండునో అంతకాలము నిన్ను ఆరాధిస్తూ ఉంటా. తల్లీ! నాకు ముక్తిని అను గ్రహించి నన్ను రక్షించుము తల్లీ!