గుంటూరు కు సమీపంలోని, నల్లపాడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడిని గురించి, వివరించడానికి ఆ వూరి కరణంగారు అమ్మ చెంతకు వచ్చారట. వారు అమ్మ దగ్గరకు వస్తూంటారు. ఎవరూ పట్టించుకోని ప్రదేశం. కరణంగారికి నరసింహస్వామి వారు కలలో కన్పించి, నీవు బాగుచేయించి అభివృద్ధి చేయాలని చెప్పాడట. ఆ రోజుల్లో మడికి ధావళినీ ధరించేవారు. ఆయన ఆ ధావళిని కట్టుకొని అమ్మ వద్దకు వచ్చి, ఇలావుంది నేనేమి ధనవంతుడిని కాదు, అని చెప్పాడట. అదే ముందిలే నాయినా చేస్తూ వుండు అదే వస్తుందిలే అని అభయహస్తం ఇచ్చిందట అమ్మ.
ఇప్పుడు ఆ ప్రదేశం యొక్క ఔన్నత్యం మీకు నేనేమి విశదీకరింపవలసిన పనేలేదు. టివిలో ప్రకటనల ద్వారా మీకు తెలిసే వుంటుంది. 24,000 కలశ హోమాలను ఏర్పాటుగావించి మహా యజ్ఞాలను నిర్వర్తించారు.
1980లో అమ్మకు జబ్బుచేయడం. దాదాపు 20దినాలు ఎ.సి. లోనే ఆమెను వుంచేసి చేతనైన వైద్యం చేశామని భావించి ఎట్లాగో హైదరాబాద్ తరలించి అర్ధరాత్రి దాదాపు 6 కార్లలో జనం హుటా హుటీగా శ్రీ చారిగారింటికి వెళ్లాడం. శ్రీ యుతులు చారిగారు. వీరందరికీ ఘనంగా స్వాగత సుమాంజలులను కురిపించి తన చేతనైన సేవలను అందించడం జగ మెరిగిన సత్యమే. శ్రీ విజయనామ సంవత్సర శుభాకాంక్షలను అమ్మ తరఫున నివేదిస్తున్నాను. అమ్మ త్వరగా కోలుకున్నది. మరల ఈ కుగ్రామంలోకి అడుగిడిన అమ్మకు యధారాజా తధా ప్రజావలె అనారోగ్యం అలుముకొన్నది. శ్రీ చారిగారు ధన్యాత్ములు ఐనారు –
` ఒకసారి మా అమ్మగారు గోవాడనుండి జిల్లెళ్ళమూడికి వచ్చింది. మధ్యాహ్నం 2గం. ఐంది. అప్పట్లో ప్రయాణం చాలా చాలా క్లిష్టతరం. కాదు కాదు – నరకం. వంటింట్లోకి అడుగుపెట్టిన ఆమెను. ఎప్పుడుపడితే అప్పుడేనా
రావడం అని కిసుక్కున విసుక్కున్నారట. అక్కడ అమ్మకు కన్పించింది. అమ్మవారికి ఇచ్చిననివేదన పళ్ళెం. సరే భోజనం కొరతేలేని ఆ ప్రదేశంలో భోజనం చేసేసి అమ్మ చెంత కూర్చున్నదట. అమ్మ వారు వంటింటి వారిని పైకి పిలిచినారు. నా వద్దకు వచ్చే వారు నా కోసం వస్తున్నారు. అంతేకాని వాళ్ళకు భోజనం లేక కాదు. 10 రూపాయలు పెడ్తా, బాపట్ల హోటల్లో తినేసి రాగలరు. జాగ్రత్త అంటూ కేకలేసింది. మరి ఈ జరిగిన వంటింటి రామాయణం మాఅమ్మ- అమ్మ వారికి ఏమి చెప్పలేదని. అమ్మవారే గ్రహిస్తారు అనే విషయం పాఠకులు గ్రహించగలరని విన్నవిస్తున్నాను. అన్యధా ఆగ్రహించకండి.
ఈ విధంగా అమ్మ సన్నిధిలో ఆ పరిధిలో ఆ ప్రదేశంలో ఆ ఆవరణలో ఆ గ్రామంలో ఆమారు మూల కారడవిలో నల్లమడడ్రైన్ – దాన్ని చూస్తుంటేనే నాకు గుండె దడదడ- లబ్ధబ్ ఆగిపోతుందేమోననే feeling. ఈ చిట్టి వరహాల తల్లికి. ఆ పైవాడు వేసిన భూభారం ఎంత దయలేదు నీకు – ఓవిధి! ఈ పసికూనను ఆ తల్లిదండ్రులు., ఈ కారడవిలో ఎలా పడేశారా? అని అన్పిస్తోంది. ఆ చిదంబరరావు తాతగారి ఆశీర్వచనాల పరంపరవల్లే ఆమె ఈనాడు ఈవిధంగా దక్కిందని అనుకోవాలి. ఆ చూపుడు వ్రేలి సూచనలే ఈ జగత్తు నడవటానికి కారణం.
ఒకసాయం సమయం అమ్మ ఆరుబయట మంచం మీద ఆశీనురాలై యున్నది. శ్రీ నాన్నగారు కుర్చీలో కూర్చొని యున్నారు. షరా మాములే నేను పరిగెత్తి కెళ్ళడం Speed breaker వద్ద వాహనం ఆగిపోయినట్లుగా నా కాళ్ళు రెండు నిశ్శబ్దంగా నిలబడడం నాన్నగారు నన్ను చూసి చూడడంతోనే అమ్మను “ఏంటి రమాదేవి పెండ్లి ఎప్పుడు చేస్తావ”ని ప్రశ్నించారు. అమ్మ మౌనంగా వుంది. ఆ పరిస్థితి మనకు తెలీదు.
ఇంకోసారి ఈ విధంగానే వచ్చి ఆగిపోయాను. ఆ రోజు శ్రీరామక్రిష్ణ అన్నయ్యగారు వున్నారు “ఏంటమ్మా రమాదేవికి పెళ్ళి చేయవా? ఎప్పుడు చేస్తావ”ని ప్రశ్నించారు. మౌనంగానే వుంది అమ్మ. ఏమిటి రమాదేవిని సన్యాసిని చేస్తావా? అని మరోమారు ప్రశ్నించారు. అది ఇప్పుడు సన్యాసి కాకపోతే కదా అని అంటూ సమాధానం. అమ్మ వేసిన ఈ బాణం ప్రయోగం ఎలాంటిదంటే- గుండె ఝల్లుమంటుంది. ఆశ్చర్యం. మహా ఆశ్చర్యం. హిందూ దేశభవితే అంతా, అఖండ భారతావనికి ఎనలేని గౌరవ మర్యాదలను ఒసంగినది. ఈ మూడు అక్షరాలే – ఉపనిషత్, వేదాంతం, భారత రామాయణ ఇతిహాస కావ్యాలు, శ్రీశంకర భగవత్పాదుల వారు చేసిన అఖండ అద్వైత సిద్ధాంత ప్రతిష్ఠాపన, శంకరం లోకశంకరం, వేదాంత డిండిమం అంతా కూడా వున్నది – ఈ ‘3’ అక్షరాల సమాహారమే. ఏమిటి? అమ్మ అన్న సువర్ణాక్షరాలు – ఆలోచించాను.
ఆనాడు హైమను నేనే కన్నాను. లయం చేసు కొన్నానని అన్నదట. ఈ అపూర్వ పదజాలం అలాంటిదేనా – నాలో నాకే అంతర్మధనం ప్రారంభమైంది. అంతుచిక్కదు కదా ఒక సామాన్యమైన స్త్రీని. అందుకే ఆ చూపుడు వ్రేలితో అలరించిన కుంకుమ రేఖలు ఆ ప్రాణి యొక్క జీవనగమ్యం మారిపోతోంది. అమ్మలాంటి వ్యక్తి మనకు లభ్యం కావడం కోట్ల రూపాయలకే విలువలేనిది. ఈ 3 అక్షరాలకు – నేను అర్హురాలినా- ఎంతభారం వేసింది. దీన్ని ఎలా మోయగలను. మోయలేను. రూపమైన అమ్మే తెరవెనుకనే వుండి నడిపిస్తుంది. So, it, is- very Easy.
ఆ పాదాల చెంత వుంది- ముక్తి
ఆ పాదాల చెంత వుంది- ముక్తి
వానిని కడిగితే వుంది – భుక్తి
అందుకొంటే వుంది- భక్తి
తెలుసుకోగల్గితే వుంది- అనురక్తి
రాగలిగి చేరితే వుంది- సహపంక్తి
ఆ విధంగా మనందరం కూడి
ఉన్ననాడే వుంది- మనకు- ముక్తి