మీ ప్రార్థన ఏమిటమ్మా ? అంటే ‘మీరంతా నేననుకోవటమే నా ప్రార్ధన” అన్నది. ఆస్తికులం అందరం ప్రార్థన చేస్తుంటాము. కోరికలేని వారెవరుంటారు ?” ఆశా పాశము తా కడు న్నిదుపు లేదంతంబు” అన్నారు. ప్రార్ధన ఎందుకు చేస్తాము అంటే మనం కోరే కోరికలు తీరటానికే. ప్రార్థన చేయగానే కోరికలు తీరతాయా ? చెప్పలేం. ఒక వేళ కోరిన కోరిక తీరింది అనుకుందాం. అంతమాత్రం చేత కోరికలు ఆగిపోతాయా ? లేదే ! ఇంకా పుట్టుకొస్తూనే ఉంటాయి గదా ! తీరినా తీరకపోయినా ప్రార్థిస్తూనే ఉంటాం. తీరుతుందనే ఆశ. నిజానికి మనసులోకి వచ్చే ప్రతి కోరికా ఫలించని ఒక ప్రార్థనే. కోరికలు భౌతికమైన కోరిక – ఆధ్యాత్మికమైన కోరిక అని రెండు రకాలు.
ఒకసారి ఒకరు అమ్మను ఒక దొంగ నిన్ను ఈ రోజు నాకు బాగా ధనం దొరకాలి. ఏ అడ్డంకీ రాకూడదు. నా భార్యపిల్లలకు తిండి దొరకాలి అని ప్రార్థించి వెళ్ళాడు. చేకూరుస్తుంది. అతడు ఏ యింటికి దొంగతనానికి వెళ్ళాడో, ఆ ధనవంతుడు కూడా నిన్ను ప్రార్థించాడు. నా ఇంట్లో ఏ రకమైన ఇబ్బంది కలగకూడదు, దొంగతనం జరగకూడదు. నా ధనం నాకే స్థిరంగా ఉండాలి అని. ఎవరి ప్రార్ధన మన్నిస్తావమ్మా నీవు? అని అడగ్గా, అమ్మ ఎవరికి అత్యంత అవసరమో వారి కోరిక మన్నిస్తానన్నది. అంటే ఇందులో అవసరమే విలువైనది. ఆ ప్రార్థనే మన్నింప బడుతుంది.
అయితే ఏ ప్రార్థన నెరవేరాలన్నా చిత్త శుద్ధికావాలి. అందుకే తపనే తపస్సు అన్నది అమ్మ. మన ప్రార్ధన నెరవేరాలంటే అమ్మను శరణు వేడాలి. ప్రార్ధనలో అమ్మను ఆ పని చేసిపెట్టు యీ పని చేసిపెట్టు అని యాచిస్తాం. పూజలో నివేదనలు అమ్మకు సమర్పిస్తాం. ప్రార్థనలో అమ్మ మన వద్దకు వస్తుంది. పూజలో అమ్మ వద్దకు మనం వెళ్ళుతాం. ఈ రెంటివల్ల అమ్మకు మనము దగ్గరవుతాం. ఈ దగ్గర కావడాన్ని ఉపాసన అంటారు.
ఇష్టదేవతను ప్రార్థించటం ఇవ్వాళ వచ్చిన కాదు. వేదకాలం నుండి ఉన్నదే. వేదాలలో ఉన్న మంత్రాలన్నీ ప్రార్థనలే – భగవత్కృపను, దివ్యశక్తిని కోరడమే ప్రార్ధనకు ప్రధాన లక్ష్యం. పారమార్థిక విజయానికి అమ్మ సహాయాన్ని అర్థించటమే, అన్వేషించటమే ప్రార్థన లక్ష్యం. సహాయం చేయమని హృదయం ద్రవించేలా ప్రార్థించాలి. అంతేకాదు తల్లితో, తండ్రికి, మిత్రునితో, ఒక గురువుతో తన కష్టాలను, బాధలస్క, సందేహాలను మనసు విప్పి చెప్పుకొన్నట్లే అముతో, నీ ఆరాధ్యదైవంతో మనస్సు విప్పి చెప్పుకోవటమే ఎదురుగా ఉన్నట్టే ప్రార్థించాలి. మన ప్రార్ధన. అమ్మ మన మాట వింటున్నది అనే విశ్వాసంతో ప్రార్థించాలి. నిజానికి విశ్వాసమే భగవంతుడు అన్నది అమ్మ. విశ్వాసమే ప్రార్థన. మన హృదయాంతరాళం నుండి ప్రవహించే ప్రవాహంలా ఉండాలి మన ప్రార్థన. ఆ ప్రార్థనే మనకు దారి చూపిస్తుంది. వెలుగుబాటలను వేస్తుంది. ఎందరో ఋషులు అలాంటి ప్రార్థనలు మనకు ప్రసాదించి ఉన్నారు. ‘అమంత్రమక్షరం నాస్తి’ అన్నట్లు అన్నిమాటలూ మంత్రాలే – అసలు మనస్సే మంత్రం అన్నది అమ్మ. మనస్సు ధారాపాతంగా ఆగకుండా దివ్య స్వరూపంవైపు పంపించే ప్రార్థనే నిజమైన ధ్యానసిద్ధిని చేకూరుస్తుంది.
ఒకసారి ఆకలి బాధతో బాధపడుతున్న ప్రజలకు ఆర్థికసాయం చేద్దామనే భావంతో ఒక ముల్లా (మహమ్మదీయ మతాప్రచారకుడు) అక్బరు వద్దకు వెళ్ళాడు. ధనం కోసం. ఆ సమయానికి అక్బరు భగవత్ ప్రార్థనలో ఉన్నాడు. అతడి భగవత్ ప్రార్థనలో కోరికల చిట్టా కనిపిస్తున్నది. అది చూచి ముల్లా వెనుదిరిగి వెళ్ళి పోతున్నాడు. అక్బరు చూచి, వెనక్కు పిలిచి, దేనికొచ్చారు. అని అడిగాడు. వచ్చిన విషయం చెప్పి ముల్లా అయ్యా ! మీరు భగవంతుని కోరిన కోరికల చిట్టా విన్న తర్వాత మిమల్ని కోరకుండానే వెళ్ళిపోతున్నాను. తృప్తి లేని మిమ్మల్ని కోరఓJ కంటే మీకు కూడా ప్రసాదించే ఆ భగవంతునే కోరవచ్చు కదా ! అన్నాడు. అక్బరు సిగ్గుపడ్డాడు. తృప్తి లేని జీవి తరించలేడు కదా ! అందువల్ల మనస్సుకు తృప్తిని ప్రసాదించేదే అసలైన ప్రార్థన.
భగవంతుని కోసం చేసే నిజమైన ప్రార్థన ప్రక్రియ యాచనకాదు. భౌతిక సుఖాలు ఇమ్మని కోరటమూ కాదు. లాభాన్ని పొందాలని చేసే వినతీ కాదు. ఒక ఆర్తుని అభ్యర్ధనా కాదు. భగవంతుని వద్ద ఏదైనా పౌరుషంగా సాధించుకోవాలి. ఒక పరిపక్వమైన ప్రయత్నంతో జీవాత్మ పరమాత్మల ఏకాత్మతానుభవం ప్రార్థన. మానవత్వాని కున్న ధ్యేయాన్ని గురించి ఒక స్పష్టమైన కల్పన ప్రార్థన.
చాల ఇబ్బందులో ఉన్న ఒక ఆర్తుడు తపస్సంపన్నుడైన రాఘవనారాయణశాస్త్రిగారి వద్దకు వెళ్ళి నన్ను యీ ఆపదల నుండి గట్టెక్కించండి అని ఆర్జించాడు. ఆ మహర్షి ‘నీవు ఏం జపం చేస్తున్నావు’ అని అడిగారు. గాయత్రి చేస్తున్నానన్నాడు ఆ అర్హుడు. అప్పుడు నీ ఆపద తీరటానికి తపస్సు చేయి. అమ్మవారిని నిలదీయి. ఎందుకు చేయదు? అమ్మ నీ పనిచేసేంతగా అమ్మను కదిలించేంతగా జపం చేయి. ఎవరి తపస్సో నీ కోసం ఎందుకు ఖర్చు చేస్తారు. నీవే చేయి అన్నాడు. అలా చేసి ఆ అర్హుడు ఫలితాన్ని పొందాడు. అది కావాలి.
అసలు ప్రార్ధన ఎందుకు చేయాలి ? మానవుని ఆధ్యాత్మిక వికాసానికి బాగా ఉపయోగపడుతుంది ప్రార్ధన. మా బుద్ధులను ప్రచోదింప చేయమని గాయత్రీ మంత్రంలో బహువచనమే వాడబడింది. సామూహిక ప్రార్థనలలో ఇంకా ఎక్కువ శక్తి ప్రబుద్ధమౌతుంది. మనది అందరిల్లు. మనది విశ్వకుటుంబం. ఇక్కడ అందరూ సుఖంగా, సంతోషంగా, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు. ఆ భావనతో కలసి మెలసి ప్రేమతో, నిస్వార్థంగా జీవించాలి అని మన భావన, సంకల్పం, ఆకాంక్ష. అలా అమ్మకు మనం చేసే ఆత్మనివేదన ప్రార్థన. మనం చేసే ప్రార్ధనలో ఒక్క శబ్దానికి సమ్యక్ జ్ఞానం లభించినా మన కోరిక నెరవేరినట్లే. ఎందుకంటే ‘ఏకుః శబ్దః సమ్యక్ జ్ఞాతపి స్వర్గలోకేచ కామధుక్ భవతి’ అని వండితులు చెపుతున్నారు. మన విశ్వకుటుంబంలో ప్రాంతం, కులం, పంధా, జాతి, భాష, ఆచారాలు అనే బాహ్యాలయిన అడ్డుగోడలను దాటి ప్రాచీనము, పవిత్రము, పరిపూర్ణమయిన విశ్వకుటుంబ సహజీవనాన్ని కన్నులకు కట్టించేది ప్రార్ధన. అమ్మ చేసి ఒక్కటే. చూపించిన యీ మార్గమే ఆ విశ్వవ్యాపక భావనే మన ప్రార్థనలో మనం దర్శిస్తాం. అసలు మన ప్రార్ధన ఏమిటి?
యశక్త్యా బ్రహ్మా కమలనయనః ఫలనయనః
జగత్తు సృష్టుమ్ పాతుం ప్రళయ ముపనేతుం చ కుశలాః
యయా వ్యాప్తం విశ్వం వస్త్మతి ఖలు యస్యాం జగదిదమ్
నమామ్య సాధ్యం దేవీం ముకుళితకరిస్తామ్ అభయదామ్.
ఏ శక్తి మహత్త్వం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టిని పోషణను లయమును చేయటంలో సమర్థులై ఉన్నారో, ఎవరు విశ్వాన్నంతా వ్యాపించి, తనలో ఈ జగత్తును భరిస్తున్నారో అటువంటి ఆదిదేవి యైన అమ్మకు చేతులు జోడించి అభయాన్ని ప్రసాదించవలసిందిగా నమస్కరిస్తున్నాను అని శ్లోకానికి అర్ధం.
ఈ శ్లోకం అర్ధం చూస్తే మనం చిన్నప్పటి నుండి ప్రార్థనగా చదువుకొనే పోతన భాగవతంలోని
“ఎప్పనిచే జనించు జగము – ఎవ్వనిలోపలనుండు లీనమై
ఎవ్వని యందుడిందు – పరమేశ్వరుడెప్పుడు- మూలకారణం
చెప్పడు అనాది మధ్య లయుడెవ్వడు – సర్వము తానయైనవా
డెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్”
అన్న పద్యం జ్ఞాపకం రావటం సహజం. కాకపోతే పోతన్న ఈశ్వరుడు అన్నాడు. ఈ శ్లోకంలో పన్నాలవారు. ఆదిదేవి అన్నారు. అంతేతేడా ?
ఇకపోతే పోతన్నది తెలుగు పద్యమైతే పన్నాలవారు. సంస్కృతంలో వ్రాశారు. సంస్కృతంలో ప్రార్ధన ఉండటం సముచితం. ఎందుకంటే ‘జనని సంస్కృతంబు సకల భాషలకును’ అన్నారు. సకలభాషలకు అమ్మ సంస్కృతం అయితే అసలు వ్రాస్తున్నది అమ్మను గూర్చి. గనుక ఈ దేశంలోని ప్రజలందరికీ ఉపయోగపడాలి గనుక అన్ని భాషలు మాట్లాడేవారికి ఉపయోగం కనుక సంస్కృత భాషలో ఉండటమే సమంజసం. అంతేకాదు సంస్కృతం దేవభాష, అమరభాష అంటే చావులేనిది దేవతలు మాట్లాడేది. అమ్మదేవత కనుక, అది అంతము లేనిది అంతా గనుక సంస్కృతంలో ప్రార్థనా శ్లోకం ఉండటం. ఔచిత్యవంతంగా ఉన్నది. ఈ శ్లోకంలోని భావానికి ఆ శ్లోక భావానికి ఆలంబనమైన శబ్దాలకూ అమ్మకూ తేడా లేదు గనుక ఇంకా బాగున్నది. ఆశ్లోకంలో శబ్దాలను భావ సౌందర్యాన్నీ వివరించటం మొదలు పెడితే అదే ఒక వ్యాసం అవుతుంది గనుక దాని జోలికిపోను, ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే అమ్మ, ప్రార్థన రెండూ
అమ్మ అన్నపూర్ణాలయాన్ని ఏర్పాటు చేసింది. మనందాని నిర్వహణకు ధాన్యాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ ధాన్య సేకరణలో ఎందరినో అర్ధించటానికి వెళుతున్నాం. మన అహంకారం అడ్డు వస్తుంటుంది. ఒక్కొక్కసారి. దాన్ని తొలగించటానికి అమ్మ చేసే ఒక విధానం ఈ సేకరణ శిక్షణా విధానం. స్వర్ణోత్సవాలలో ధనసేకరణకు వెళుతున్న రామకృష్ణన్నయ్య, గోపాలన్నయ్యకు గుడ్డలు పెట్టింది అమ్మ. గోపాలన్నయ్యకు ఉత్తరీయం వేసుకొనే అలవాటు లేదు. నాకెందుకమ్మా? ఈ ఉత్తరీయం. నేను వేసుకోను కదా! అన్నాడు. అందుకు అమ్మ సమాధానంగా మీ ప్రయాణంలో దూషణ భూషణలు ఏది వచ్చినా ఒడి పట్టటానికి ఈ ఉత్తరీయం అన్నది. మనలోని
అహంకారాన్ని తొలగించడమే దాని ధ్యేయం.
ప్రతి సంవత్సరం ధాన్యాభిషేకం కార్యక్రమంలో తిరుగుతుంటే చాలా స్పష్టంగా తెలుస్తున్నదేమిటంటే అమ్మే జాగృతమై ఉంటుంది. నిరంతరం చేయిస్తున్నది. కాకపోతే మనల్ని ఉపకరణాలుగా వాడుకుంటున్నది. ఎందుకంటే మనల్ని తరింపచేయటానికి అప్పుడప్పుడు మనలో నిరాశ ఎదరువుతుంది. కాని అమ్మను ప్రార్థిస్తే మనలో నూతనోత్సాహాన్ని ప్రసాదిస్తున్నది. బాహ్య విషయాలపైకి పోవటం మనస్సు యొక్క లక్షణం. అంతర్ముఖం చేయటం అంత సులభం కాదు అంటుంటారు. కాని అమ్మ “లౌకికం ఆధ్యాత్మికం అంటూ రెండు లేవు ఉన్నదంతా ఒకటే. ఏది చేసినా వాడు చేయిస్తున్నాడు . అనే భావంతో చేస్తే అదే సరియైన తరింపు” అని చెప్పింది. మామూలుగా పూలు, పండ్లు, హారతులు మన ఇష్టదైవానికి సమర్పిస్తాం. కాని జిల్లెళ్ళమూడిలో ఈ సందర్భంగా ధాన్యాన్ని సమర్పిస్తాం. తను మన ధనాలను సమర్పించటం అంటారు. శరీరం, మనస్సు సమర్పిస్తే ధనం ప్రత్యేకించి సమర్పించటం ఏమిటి ? అనిపిస్తుందితనువు కన్నా మనస్సు కన్నా ధనం ఎక్కువ కాదు కదా ! అయితే శరీరధనము మనోధనమును సమర్పించటం అనుకుందాం. అమ్మా! మమ్మల్ని నీ సేవకు ఉపయోగించుకో ! అని ప్రార్ధన చేస్తే మన హృదయకమలాలను వికసింప చేసి తన పాదాలపై సమర్పింప చేసుకొంటుంది. మన మనస్సు త్యాగభావనతో నిరంతరం అమ్మను అంటిపెట్టుకుని ఉండే ఆత్మీయతను ప్రసాదిస్తుంది. స్వార్ధద్వేషాలను, అసూయను పారద్రోలే అనసూయ చిత్తశుద్ధిని ప్రసాదించి ఈ ధాన్యాభిషేకం వంటి క్రతువు ద్వారా కర్మయోగాన్ని అనుష్ఠింప చేస్తుంది.
అందుకే మనకు సంసారం దాటలేని సాగరం కాదు. అమ్మ వాత్సల్యము, ప్రేమ అనే తెరచాప కట్టిన నావలో ప్రయాణిస్తున్న బిడ్డలం – అమ్మ మన జీవన నౌకను నాన్నా! మార్జాల కిశోరన్యాయంగా రక్షిస్తుంది, తరింప చేస్తుంది. ఒడ్డుకు చేరుస్తుంది.
అదృష్టవశాత్తూ తల్లీబిడ్డల బంధమే కరుణతో అమ్మ ప్రసాదించటం వల్ల మనం అదృష్టవంతులం. తల్లి తరింప చేసేది తనలో లీనం చేసుకొనేది కనుక మనచే ప్రార్థన చేయించుకోవటమూ. కష్టసుఖాలు రెంటినీ సమంగా చూడగల సమస్థితిని ఇవ్వటమూ తృప్తిని ముక్తిని. ప్రసాదించటమూ అమ్మ బాధ్యతే – అమ్మ మన ప్రార్థనను మన్నిస్తుంది. అమ్మ తలపులు పదే పదే నిరంతరం మనమనస్సులో నింపమని ప్రార్థించటమే.