గత సంవత్సరం అక్టోబరు 19వ తేదీన అమ్మలో ఐక్యమైన సోదరులు శ్రీ ఎస్. వెంకటేశ మూర్తిగారికి నివాళులు. కర్ణాటక రాష్ట్రం గౌరీబిడనూరుకు చెందిన శ్రీ వెంకటేశమూర్తిగారు అమ్మకు అంకిత భక్తులు. తరచుగా జిల్లెళ్ళమూడి వచ్చి, అమ్మ సేవలో పాల్గొంటూ ఉండేవారు.
“అమ్మ” ఆంగ్ల గ్రంథాన్ని కన్నడంలోకి అనువదించి, అమ్మను కన్నడ రాష్ట్రానికి సన్నిహితం చేసినవారు. దక్షిణ జలియన్ వాలాబాగ్ గా విఖ్యాతి పొందిన “విదురశ్వత్థ”లో అక్టోబరు 8వ తేదీన వారి సాంవత్సరిక కార్యక్రమాల సందర్భంగా పలువురు ఆత్మీయులు వారిని వారి సేవలను స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులందరిపై అమ్మ కరుణ వర్షించాలని అమ్మను ప్రార్థిస్తూ
– శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్టు