నలభై ఏభై, అరవై ఏళ్ళనుంచి జిల్లెళ్ళమూడి వస్తు సర్వాంతరాత్మ అమ్మ దర్శన, స్పర్శన, సంభాషణలు పొందిన అదృష్టవంతులు ఎందరో! మరి అమ్మ ఆలయ ప్రవేశానంతరం నుంచి అమ్మను గురించి తెలుసుకుని, అధ్యయనంచేసి, దర్శనం పొందే భాగ్యం కలిగిన మహనీయులూ ఉన్నారు.
అమ్మదర్శనం అంటే – మనం చూడటం కాదుకదా! అమ్మ మనల్ని చూడటం. అమ్మ స్పర్శనం అంటే – ఆత్మానుసంధానం, అమ్మ ఒడి చేరడం. అమ్మతో సంభాషణ అంటే అపౌరుషేయమైన అమ్మ పరావాక్యం గ్రహించడం. ఈ దృక్పధంతో పరికిస్తే వేదూ ఈ మనముందుకూడా ఎందరో అమ్మ దర్శన, స్పర్శన, సంభాషణా భాగ్యాన్ని పొందుతున్నారు, పొందుతారు.
అట్టి విశిష్టవ్యక్తులలో ప్రా ఎమ్.శివరామకృష్ణ గారు ఒకరు. వారు వృత్తిరీత్యా Osmania University. English Dept. Head. ప్రవృత్తిరీత్యా కశ్చిద్ధీరః ప్రత్యగాత్మాన మైక్షత్’ (కఠోపనిషత్) అని చెప్పినట్లు ద్రష్ట – ధీరుడు. ఒక విషయం ముందు స్పష్టం కావాలి – అమ్మను ఎవరూ చూడలేరు. “నేను కనపడితే మీరు చూస్తారు, మీరు చూస్తే నేను కనపడను” అన్నది అమ్మ.
కాగా కొందరు లౌకిక దృష్టికి తెరవేసి, తపఃఫలంగా ప్రాపించిన అంతర్దృష్టితో ప్రత్యగాత్మను చూస్తారు. ప్రత్యగాత్మ అంటే మూలానికి పోగా పోగా ఉన్న మూల ప్రకృతిని దర్శిస్తారు. అట్టి గట్టి వారే ప్రొ॥ శివరామకృష్ణ గారు, కనుకనే తత్త్వతః లోచూపుతో ‘అమ్మ’ దివ్యదర్శన భాగ్యాన్ని పొందారు.
అమ్మ దర్శన స్పర్శన సంభాషణ సాగు తరంగాలు అనంత విశ్వంలో అనంతకాలం ప్రకాశిస్తు చేసుకోగలిగిన ఉంటాయి. అందుకు పాత్రతగల ధీశాలురు frequency కి తమ మనోబుద్ధులను tune ఎప్పుడైనా ఎక్కడైనా విశ్వాంతరాత్మ అమ్మ అనుసంధానం కావచ్చు. ఆ భాగ్యాన్ని ప్రొ॥ శివరామకృష్ణ పొందారని ఎలా చెప్పగలం?
ఒక్క ఉదాహరణ – శ్రీ భాస్కరరావు ఉప్పుమ వ్రాసిన ‘అమ్మ జీవిత మహోదధి’ గ్రంధానికి వారు వ్రాసి ముందుమాట, “అమ్మ అనసూయాదేవి స్వయంగా చెప్పి కథని మనకు ప్రసాదించిన సమకాలీన దేవీ భాగవతం ఇది” అన్నారు. “వినటం ద్వారా వ్రాస్తే శాస్త్రం అన్నారు. అంటే శ్రుతులు, స్మృతులు అన్నమాట.
“వేదరూపిణి అమ్మ శ్రుతులలో సత్యాలకి చైతన్య దర్పణం” అన్నారు. అంటే ‘యస్య విశ్వసితం వేదాద వేదములు పరమాత్మ ఊపిరి – భగవత్రోక్తములు. వాటిని మహర్షులు జ్ఞానదృష్టితో దర్శించారు. మనకి అందించారు – అని.
అమ్మ వేదస్వరూపం. ఆమ్మ చరిత్ర వేదం: భాస్కరరావు అన్నయ్య మహర్షి. అమ్మ చెపుతుంటే భాస్కరరావు అన్నయ్యకి తప్ప, ప్రక్కనున్నవానికి ఒక్కమాటకాదుకదా, ఒక శబ్దము కూడా వినిపించేది. కాదు. కారణం – అమ్మది పరావాక్కు మానవ వైఖరీ వాక్కు కాదు.
అట్టి దర్శనాన్ని వివరిస్తూ శ్రీ శివరామకృష్ణ “అమ్మ జీవిత మహోదధి” శ్రుతి, స్మృతుల తరంగాలను సాగముగా మేళవించిన అఖండ అంతర్ముఖ చైతన్యసాగరం”అని అభివర్ణించారు.
మాన్య సో॥ శ్రీశివరామకృష్ణ అమ్మను భౌతికంగా దర్శించలేదు. రెండుదశాబ్దాల పూర్వం సోదరి శిష్టా శాంత ద్వారా ‘అమ్మ – అమ్మ వాక్యాలు’, ‘అమ్మ జీవితమహోదధి’ గ్రంథాలను చదివారు. అవి వారి మనస్సుపై చెరగని ముద్రవేశాయి. దరిమలా డా॥ టి.ఎస్. శాస్త్రి గారితో పరిచయం కలిగింది. అమ్మను గురించి ఇంకా తెలుసుకోవాలి, అనే ఒక జిజ్ఞాస, విచికిత్స కలిగాయి. శ్రీ శాస్త్రి అన్నయ్యగారు అందరింటి సోదరీసోదరుల అనుభవాలను వారికి వివరించారు. దానితో వారికి అమ్మయందు విశేషమైన భక్తి శ్రద్ధలు కలిగాయి.
‘అమ్మతో సంభాషణలు’ గ్రంథాన్ని తీసుకుని అందలి 20 30 భాగాలను ఆంగ్లభాషలోనికి – అనువదించారు. అవన్నీ ‘Mother of All’ త్రై మాసిక పత్రికలో Editorials గా ప్రచురితమైనాయి. వసుంధర అక్కయ్య తెలుగులో వ్రాసిన ‘మహోపదేశం’ గ్రంథాన్ని శ్రీ శివరామకృష్ణ ‘Divine Play of Amma – Initiation as Revelation’ అనే గ్రంథంగా ఆంగ్లంలోనికి అనువదించారు. ఆ గ్రంథాన్ని హైదరాబాద్లో ఒక సభలో డా॥ పొత్తూరి వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన శ్రీరామ్ సార్ ఆవిష్కరించారు; శ్రీ తత్త్వవిచానంద స్వామి గ్రంథ పరిచయం చేశారు. శ్రీ శివరామకృష్ణ ‘Meditation on the Mother’ అనే గ్రంథాన్ని రచించారు.
శ్రీ శివరామకృష్ణ జిల్లెళ్ళమూడి వచ్చారు. డా॥ పొత్తూరి వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన ఒక సభలో Timothy Conway Do ‘Women of Power and Grace’ అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు.
విశ్వవ్యాపిని, విశ్వారాధ్య అయిన అమ్మను తత్త్వతః ఎలా దర్శించాలో శ్రీ శివరామకృష్ణ గారి దృక్పథాన్ని చూసి తెలుసుకోవచ్చు. యథార్థమైన సాధకులు, తపస్వి అయిన శ్రీ శివరామకృష్ణ 12-10-2021న తుదిశ్వాస విడిచి అమ్మలో ఐక్యమైనారు. మాన్యసోదరులకిదే ఆత్మీయనివాళి.