ఒక భక్తి భావనాత్మకవైఖరికి మోద
మున దేలి చేసిన పుణ్యపూజ
ఒక వినిర్మల పవిత్రోక్తికి పొంగి సా
ధన జేయగాబూనుకొనిన తలపు;
ఒక దైవికస్వరూప కృపావలోకనా
ప్రాప్తికై మనసార పడిన బాధ;
ఒక మనోహర సముత్సుకత గుండెలలోన
వెలుగ- కల్గిన మహోజ్జ్వలబలమ్ము;
గలసి యేకముఖమ్ముగా లలితమైన
“స్తోత్రమాల” గ నిలిచె – నిస్తులవిశుద్ధ
మాతృచరణ సరోజాల – మాలయగుచు
విమలకాంతుల జిలుకుచు వెలయుగాక.