(ఈ వ్యాసాంశం శ్రీ బుచ్చిరాజు శర్మగారు చెప్పినది)
మన్నవలో అమ్మ ప్రధమంగా రజస్వల అయిన పదకొండవ రోజున మన్నవ గ్రామంలో తూర్పు వైపున గల జమ్మిచెట్టు క్రింద వున్న (ఇది శివాలయంలో ఉన్నది కాదు) పెద్ద పుట్టకు 20 గజాల దూరంలో అమ్మ బాసింపట్టు వేసుకొని (పద్మాసనం కాదు) ప్రశాంతంగా కూర్చున్నారు. ఇంతలో ఆమె జననేంద్రియము నుండి రేగిపండు అంత పరిమాణంలో ఒక బుడగ బయటకు వచ్చి పెద్ద పనస పండంత పెద్దదిగా మారి పగిలిపోయింది. దానిలో నుంచి ఒకానొక ద్రవము చుట్టూ చిమ్మబడింది. దానివాసన మిక్కిలి ఎక్కువ పరిమళంతో నున్నది. ఆ తరువాత అమ్మ దేహం అలాగే గాలిలోకి లేచి నెమ్మదిగా శూన్యంలో పుట్టపై వరకు వెళ్ళింది. (అక్కడ ఏమి జరిగిందో అమ్మ చెప్పలేదు) కొద్దిసేపటికి పడగలతో నాగేంద్రుడు అమ్మకు ఎదురుగా వచ్చినట్లు, అమ్మను, మన్నవను తనలో కలుపుకున్నట్లు అమ్మ చెప్పింది. (ఈ సన్నివేశం జరిగిన సమయానికి శ్రీ బుచ్చిరాజు శర్మగారు అక్కడ లేరు) తరువాత కాలంలో ఆయన అమ్మతో అన్నారట, ‘అమ్మా! నేను అపుడు ఎక్కడ ఉన్నాను.”
అమ్మ : “నువ్వు నా ప్రక్కన ఉన్నావు” అన్నారు. అయితే అమ్మా మన ఊరిలోని వడ్రంగి వాని పెంకుటిల్లు ఎక్కడ ఉన్నది అన్నారు శర్మగారు. అది కూడా నాగేంద్రుని లోనే ఉన్నది. అదే కాదు సమస్త సృష్టి నాగేంద్రమయమై ఉన్నది అన్నారు. అమ్మ తర్వాత నెమ్మదిగా శూన్యంలో నుంచి అలాగే కూర్చొని తాను నేలపైకి వచ్చి పిమ్మట లేచి తన ఇంటికి వెళ్ళారు. మరల కాసేపటికి అమ్మ విహార ప్రదేశమగు చింతలతోపులోకి వచ్చారట అమ్మ ఇంటి చాకలివారు. మరునాడు ఈ సన్నివేశంలో అమ్మ కట్టుకున్న పసుపు పచ్చలంగా, తెల్లవోణి, జాకెట్టు (రంగు తెలియదు) తడిపి ఉతుకుతుంటే అంతకు ముందు తమకు తెలియని అపూర్వమైన సువాసన ఆ చాకళ్ళను ఆశ్చర్యపరిచింది. ఆనంద పరిచింది.
తర్వాత అమ్మ జీవితంలో కూడా అమ్మ కట్టుకొని విప్పిన బట్టలు సువాసన వెదజల్లేవని చాలా మంది చెబుతుండగా విన్నాను.
అమ్మ చరిత్ర అధ్యయనం చేస్తుంటే ఇతరుల యోగానుభూతులకు, అమ్మకు కలిగిన అనుభూతులకు సంబంధము కనపడదు. ఇతరులలో అనుభూతులు ప్రయత్న పూర్వకంగా ఉంటే అమ్మలో అవి అతి సహజంగా అప్రయత్నంగా వస్తున్నట్లు అనిపిస్తుంది.
పై స్థితికి ఆధారం ఏ గ్రంథంలోనైనా ఉన్నదా? అమ్మే ఆధారమా ? తెలియటం లేదు. (ఇది నా హృదయ స్పందన.