‘అమ్మ శత జయంతి’ ఉత్సవాల సందర్భంగా 30-7-22 న జిల్లెళ్ళమూడిలో అన్నపూర్ణాలయంలో కల్యాణవేదికపై ‘మాతృ శివానంద కళాక్షేత్రం’ వారిచే ‘అమ్మ’కు నృత్య నీరాజనం సమర్పించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వవిద్యార్థి డాక్టర్ కృష్ణవాసు శ్రీకాంత్ వద్ద విద్యాభ్యాసం చేస్తున్న 22 మంది | నరసరావుపేట విద్యార్థులు ఇందు ప్రదర్శన ఇచ్చారు.
కుమారి, శ్రావణి, శర్వాణి, సరస్వతి, క్రాంతి, శిరీష, త్రిజా, మోక్షజ్ఞ, కీర్తిక, గీతిక, శ్రియ, సుమ, ప్రణవి, కోమలి, వైష్ణవి, ధన్వి, శుక్తి, జస్మిత్ విద్యార్థినులు ‘మాతృ వైభవం’ అనే నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. ప్రధానంగా ‘రాజుబావ’ పాటలు, ‘కొండముది రామకృష్ణ’ అన్నయ్య పాటలు, అన్నమాచార్య కీర్తనలు, జానపద గీతాలు ప్రదర్శించారు.
వీక్షించిన ఆబాలగోపాలము ఆనందపరవశులయ్యారు. కార్య నిర్వాహకులు శ్రీ శ్రీకాంతు, చిరంజీవులకు కూడా S.V.J.P. ట్రస్ట్వీరు అమ్మ ప్రసాదాన్నిచ్చి సత్కరించారు.