నీ సన్నిధి సిరుల నిచ్చు పెన్నిది!
నీ రూపం కరుణ కురియు అంబుధి!!
నీ చల్లని నీడలో
నా మనసు సేద తీరె
నీ కమ్మని ఒడిలో
నా మనసు కునుకు తీసె
నీ చక్కని బాటలో
నా మనసు పరుగు పెట్టె
నీ తియ్యని మాటలో నా మనసు విచ్చు కొనె…!
నీ కన్నులు చూశాను.
వెన్నెల కురిపించేవ
నీ చేతులు పట్టినాను
చేయూత నిచ్చేవు
నీ వదములు చేరినాను
పరమాన్నం పెట్టేవు
నీ దారిలో నడిచి నాను
దరికి నన్ను చేర్చేవు!!