1. Home
  2. Articles
  3. Viswajanani
  4. స్పందన

స్పందన

Tangirala Ramamohan Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : February
Issue Number : 7
Year : 2011

శ్రీ పి.యస్.ఆర్. అన్నయ్యకు,

తంగిరాల రాము నమస్కరించి వ్రాయునది. జనవరి నెల “విశ్వజనని” ముఖచిత్రం చాలా బాగుంది. 

శ్రీ విశ్వజననీపరిషత్ ప్రచురించిన శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారి “అంతా ఆమె దయే” శ్రీ కొండముది గోపాలకృష్ణమూర్తి అన్నయ్య యొక్క “అమ్మ సన్నిధిలో అనుభవాలు జ్ఞాపకాలు”, భవానీకుమారి యొక్క – “అర్కపురి లేఖలు” చాలా చాలా బాగున్నాయి.

ఎప్పటికప్పుడు “మాతృశ్రీ విశ్వజనని” పత్రికలలో చదివినవే అయినా, అన్నీ ఒక పుస్తకంలో వుండటం వల్ల చదువుకోవటానికి చాలా హాయిగా వుంది. ఈ విషయంలో మిమ్మల్ని శ్రీ విశ్వజననీపరిషత్ వారిని అభినందిస్తున్నాము.

త్వరలో శ్రీమతి మల్లాప్రగడ శ్రీవల్లిగారి వ్యాసాలు కూడా “అద్భుతచారిత్ర” పుస్తకంగా ఆవిష్కరించబోతున్నారని చదివి చాలా సంతోషించాము.

మీరు “Mother of All”లో వ్రాస్తున్న ధన్యజీవులు కూడా ప్రచురిస్తే బాగుంటుంది.

డిసెంబరు 2010 “విశ్వజనని”లో శ్రీ ఎ.వి.ఆర్. సుబ్రహ్మణ్యంగారి అర్కపురి లేఖలు – గ్రంథసమీక్ష చాలా బాగుంది.

ఒక సలహా మరియు కోరిక రాజుపాలెం శేషుగారు 1983లో వ్రాసిన “రాగబంధం” కవితాసంపుటి లోంచి కొన్ని కవితలు ప్రతినెలా “విశ్వజనని”లో ప్రచురించండి. ఈ పుస్తకం ఉన్నదని చాలామందికి తెలియదు. నేను కూడా 2010లో ఎగ్జిబిషన్ స్టాల్ హైద్రాబాద్) లో చూచి, చదివాను. “Mother of All”లో రాజుపాలెం రామచంద్రరావు అన్నయ్యగారి డైరీలోంచి కొన్ని విశేషాలు ప్రచురిస్తున్నట్లుగానే, “విశ్వజనని”లో కూడా మంచి కవితలుగాని, శీర్షికలు గాని గతంలో ప్రచురించిన “మాతృశ్రీ”లోనివి మళ్ళీ ప్రచురిస్తే పాతవాళ్ళమైన మనకు, “విశ్వజనని” పాఠకులకు గత మధుర స్మృతులుగా, అనుభవాలుగా చదువుకోవచ్చని నా భావన.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!