“అమ్మకు అక్షరార్చన 20” వ సంచిక ఆద్యంతం రమణీయంగా నిర్వహింపబడింది.
అన్నపూర్ణాలయం అమ్మ గుండెకాయ. అన్నావతారమైన అమ్మకు, అన్నపూర్ణాలయానికీ అభేదమన్న విషయాన్ని అనేక చక్కని ఉదాహరణలతో, హృద్యమైన సంఘటనలతో హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించిన సోదరి డా. మల్లాప్రగడ శ్రీవల్లి గారి ప్రసంగం వింటున్నంతసేపూ ఎన్నెన్నో భావాలు అలలు అలలుగా ఉప్పొంగి హృదయం అర్ధమై కరిగి పోయింది. –
సోదరి శ్రీవల్లి గారి ప్రతి పదంలో అమ్మ రూపం, అమ్మ సాన్నిధ్యం, అమ్మ తత్త్వం ప్రతిఫలించింది.