ప్రేమకు ప్రతీక విశ్వజనని పత్రిక
అమ్మే అక్షరమై కనిపించు పీఠిక!!
అర్కపురీ విశేషాల సమాహార కరదీపిక
మనసులను కట్టివేయు అమ్మ చిత్ర మాలిక
అనుభవాల ప్రదర్శనకు అద్భుతమౌ వేదిక
కవి పండిత రచనలతో అలరు కవన మాలికా!!
అమ్మ మాటలె దివ్వెగా వెలిగేటి జ్యోతిక
అమ్మ తత్త్వము తెలిపే ఆహ్లాద చంద్రిక
అమ్మ అడుగుల నడుపు వాత్సల్య వీచిక
ఆనంద సాగరాల అనుభూతుల గీతిక!!