1. Home
  2. Articles
  3. Mother of All
  4. స్పందన

స్పందన

Tangirala Ramamohan Rao
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 20
Month : April
Issue Number : 2
Year : 2021

అన్నయ్యగారు నమస్కారం !

ముందుగా “మదర్ ఆఫ్ ఆల్’ సంపాదకీయ వర్గ సభ్యులు అందరికీ నా హృదయ పూర్వక అభివందనలు. ప్రతి సంచిక ముఖచిత్రం ఎంపిక, ముద్రణా నాణ్యత చాలా చాలా బాగుంటోంది.

ప్రస్తుతం గత మూడు సంచికలు (జులై-సెప్టెంబర్ 2020, అక్టోబర్-డిసెంబర్ 2020, జనవరి-మార్చి 2021) గురించి నా ఆనందాన్ని అనివార్య కారణాల వల్ల ఇంత ఆలస్యంగా నా అభిప్రాయం తెలియజేస్తున్నందుకు అన్యధా భావించక సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను (బెటర్ లేట్ దాన్ నెవ్వర్)

“జులై- సెప్టెంబర్ 2020″

పర్సా హరగోపాల్ గారి “Amma is Allah”, ఎ.వి.ఆర్. సుబ్రహ్మణ్యం గారి “అన్నమయ్య అంతరంగంలో అమ్మ” వ్యాసాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

‘Amma is Allah వ్యాసాన్ని తెలుగులోకి అనువదించి, పై రెండు వ్యాసాలని

“విశ్వజననీ”లో కూడా ప్రచురించమని నేను సోదరులు ఎ.వి.ఆర్. సుబ్రహ్మణ్యం గారిని కోరాను. ఎక్కువమంది పాఠకులకు ఆ వ్యాసాలు చదివే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం.

డా.టి. రాజగోపాలాచారి గారి “THE ONE HAS BECOME MANY” వ్యాసం క్వాంటమ్ మెకానిక్స్ వివరణతో మొదలైంది – “There is no such thing as empty space… even the most perfect vacuum is a sea of microscopic activity”.

అమ్మ జీవిత మహోదధిలో అమ్మ సందర్భానుసారంగా చెప్పిన వివరాలు ఉటంకిస్తూ సాగిన ఈ వ్యాసం నాకు బాగా నచ్చింది.

గత కొన్ని సంవ్సరాలుగా ప్రతి సంచికలో ధారావాహికంగా మీరు ప్రచురిస్తున్న “ధన్యజీవులు” శీర్షికలో ఈసారి ఎవరి గురించి పి.ఎస్.ఆర్. అన్నయ్య ప్రస్తావిస్తారా, అని ఆసక్తిగా ఎదురు చూసేలా ఉంచుతోంది. ఎవరి గురించి వ్రాసినా ఆ విశిష్ట వ్యక్తికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుపుతారు.

అక్టోబర్-డిసెంబర్ 2020

ఈ సంచికలో నన్ను ఆకట్టుకున్న వ్యాసాలు “అదే జ్ఞానయోగం… ఆత్మనిష్ఠ” (శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి) ‘డా. పొట్లూరి సుబ్బారావుగారు” (శ్రీ ప్రసాదవర్మ కామఋషి). ‘అమ్మ ఆర్తత్రాణ పరాయణత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా (శ్రీ.ఎ.వి.ఆర్. సుబ్రహ్మణ్యం) వ్యాసం చివరిలో గెలీలియా చెప్పిన ‘THE SUN, WITH ALL THOSE PLANETS REVOLVING AROUND IT AND DEPENDENT ON IT, CAN STILL RIPEN A BUNCH OF GRAPES AS IF IT HAD NOTHING ELSE IN THE UNIVERSE అని సమాప్తి చేయడం బాగుంది.

జనవరి – మార్చి 2021 సోదరుడు శ్రీ గార్డన్ వెస్టర్లండ్ గారి “THOUGHTS” కవిత బాగుంది. ఆయన కవిత నేను చదవడం ఇదే మొదటిసారి. There is no form that Amma is not within. All in all, is SHE (DIVINE

MOTHER).

డా.టి. రాజగోపాలాచారి గారి THE FORCES OF NATURE THAT OPERATE ON HUMAN SYSTEM వ్యాసం ఒక పరిశోధనా వ్యాసంలా అనిపించింది. Martin Research Technology of Difficult Disease (Ltd) Company 8 పరిశోధనలు, James Redfield వారు చెప్పిన జరిగే వ్యాధికారక, వ్యాధి నిరోధక శక్తుల చర్యలు గురించిన వివరాలు చాలా ఆసక్తి రేకెత్తించాయి. See the beauty of creation} There is a defence organization, educative, friendly cells with attachment ఈ వాక్యమే చాలా ఆసక్తికరంగా ఉంది! నిజం చెప్పాలంటే నాకు వేదాంతపరమైన, ఆధ్యాత్మిక పరమైన వ్యాసాలు తెలుగులో చదివితే ఉన్న ఆనందం ఇంగ్లీషులో చదివితే ఉండదు. కానీ, రాజగోపాలాచారి గారి వ్యాసాలు కొంత చదివి చూద్దాం అనుకుని మొదలు పెట్టిన నేను ఈ సంచికలోని ఈ వ్యాసం చదివాలని ఆసక్తి, అభిరుచి నెలకొంది. శ్రీ.ఎ.వి.ఆర్. సుబ్రహ్మణ్యం గారి “అమ్మ మహిమల కదంబం” లో వివరించిన కొన్ని సంఘటనలు నేను మునుపెన్నడూ చదివి ఉండలేదు. కామరాజు అన్నయ్యగారు అందిస్తున్న “మాతృశ్రీ జీవిత మహోదధిలో మణిరత్నాలు” అమ్మ జీవిత పారాయణ చేసినవారికి కలిగే ప్రయోజనం ప్రాప్తిస్తుంది.

// “జయ హెూమాతా”//

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!