1. Home
  2. Articles
  3. Mother of All
  4. స్వచ్ఛత – దివ్యత

స్వచ్ఛత – దివ్యత

B.G.K Sastry
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 16
Month : January
Issue Number : 1
Year : 2017

“Cleanliness is next to Godliness

Leads to Happiness and fulfillment”

“Wash your hands with soap and water

Keep them neat and clean, 

clip your nails, brush your teeth 

to keep the germs away.

 Wear clothes clean 

Be keen to be fresh and clean”

 

అని స్వచ్ఛత గురించి, పిల్లలచే Rhymes పాడిస్తూ, చిన్నప్పటినించి పరిశుద్ధత, neatness, నిర్మలత్వము, పవిత్రత, purity గురించి ఉగ్గుపాలతో పాటే నేర్పిస్తున్నాము.

స్వామి అన్నారు – The core of spiritual sadhana is on the foundation of cleanliness. Bhagawan always stressed on the Principle “cleanliness is Godliness” 2035 dimensiones.

“Flush all evil thoughts, from your mind 

And gush it with Love, and even be kind

 Honesty and sincerity, goddess and cheerfulness

will make you bource, with happiness”

– Sai ideas Know thyself.

Man is the embodiment of divine consciousness, only when he is pure, he can experience that consciousness. Through attachment to worldly pleasures, man gets bound to the physical, and becomes oblivious to his essential divinity.

ఈ విధంగా, బాహ్య అభ్యంతర శుచి, ఎంత అవసరమో మనం మరొకసారి గుర్తుచేసుకొంటున్నాము.

స్వామి అన్నారు –

A person might be an expert, in any field of knowledge, or a master of many material skills and accomplishments. But without inner cleanliness his brain is a desert waste.

స్వామి శివానంద అన్నారు..

Be neat and clean. Cleanliness is next to Godliness. Be neat in your dress. Have a daily bath. Do not let your clothes and books lie everywhere. A cleanlife indicates or strong mind and good discipline. It shows that you are refined.

సత్యసాయి 10 రకాల స్వచ్ఛత గురించి ప్రస్తావించారు. 1) ఇంటి శుభ్రత, 2) ఇంట్లో సభ్యుల మధ్య అవగాహన, 3) పదార్థశుద్ధి, 4) జలశుద్ధి, 5) శుద్ధమైన ఆలోచనలు, 6) నిష్కల్మషమైన చూపులు, 7) చదవటం,

వ్రాయటంలో స్వచ్ఛత, 8) పవిత్రమైన సేవ, 9) స్వచ్ఛమైన ఆధ్యాత్మిక క్రమ శిక్షణ, 10) సత్కర్మ.

పదార్థాలు ఎంత శుద్ధమైనా, పాత్రశుద్ధిలేకపోతే వండిన వంట పాడైపోతుంది కదా! “పాత్రశుద్ధిలేని పాకమేల!”

మానవునికి తన హృదయమే వంట పాత్ర కనుక ఆ హృదయాన్ని ఎంత పరిశుభ్రంగా, పవిత్రంగా పెట్టుకోవాలో మనం గుర్తించాలి కదా!

యజ్ఞదాన తప: పూజాదిక్రియలు, బాహ్యంగా ఎన్ని చేసినా, మనస్సు పవిత్రంగా లేకపోతే, కళాయిపెట్టని గిన్నెలో వండితే, వంట పాడైపోయినట్లు, మన శ్రమ, effort, అంతా నిష్ఫలమైపోతుంది.

మనోవాక్కాయలను ఎలా శుద్ధిచేసుకోవాలి? మానవులు చేసే పనులు, వారికి కలిగే ప్రేరణ వలన జరుగుతున్నాయి. వాటిని బట్టి వారి మనస్తత్వం అర్థమౌతుంది. “Actions speak louder than voice” – మనసు కల్మషమైతే, కర్మఫలం శుద్ధంగా ఎలా వుంటుంది?

త్రికరణాలలో వాక్కు ప్రధానమైనది. స్వచ్ఛమైన వాక్కు ఎలా పొందాలి? “అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియహితం చ యత్ || స్వాధ్యాయాభ్యసనం చైవ, వాఙ్మయం తప ఉచ్యతే ॥ (భ.గీ. 17-15) మాట ప్రశాంతంగా వుండాలి. ఉద్యోగం కల్గించేట్లు వుండ కూడదు. 

సత్యము గాను, ప్రియముగాను, హితముగాను వుండాలి. “సత్యం బ్రూయాత్, ప్రియంబ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియమ్”. నాలుక మలిన మవటానికి 4 కారణాలు. 1) అబద్ధాలు చెప్పటం, 2) అతిగా మాట్లాడటం, 3) చాడీలు చెప్పటం, 4) పరనింద చేయటం.

నాలుక యొక్క ఈ Tendencies ని control చేసుకోవాలి.

Next comes the Mind:

మనసు తప్పు ఆలోచనలతో, చెడువాసనలతో కల్మషమైవున్నది. మనస్సును శుద్ధి చేయాలంటే, చెడు ఆలోచనలను, కట్టడి చేయాలి. వాటిని తరిమి తరిమి కొట్టాలి. అప్పుడే మనసు స్వచ్ఛమౌతుంది.అహంకారం వదలిపెట్టాలి. పవిత్రమైన సేవా కార్యక్రమాలు, నిరహంకారంగా నిస్వార్ధంగా, ప్రేమగా, దైవసేవగా, మన కర్తవ్య కర్మగా చేయాలి.

మనస్సు అంటే సంకల్ప వికల్పాలు. “సంకల్ప వికల్పాత్మకః మన:” ఒక సంకల్పం, రెండవ సంకల్పం మధ్య విరామంలో, ఏ చైతన్యాన్ని మనం అనుభవిస్తున్నామో, అదే ఆత్మానుభవం.

“మన: ప్రసాద సౌమ్యత్వం, మౌన మాత్మ వినిగ్రహః | 

భావ సంశుద్ధిరిత్యేతత్, తపోమానస ముచ్యతే ॥

నిర్మల జలమున సూర్యుడు దేదీప్య మానముగ ప్రకాశించునట్లు శుద్ధ హృదయమున ఆత్మ భాస్కరుడు చక్కగ భాసించును. చిల్లగింజ అరగదీసి, నీటిలో కలిపినచో, మురికి అంతయు క్రిందకు జని, నీరు తేటగా వుండునట్లు, భక్తి, జ్ఞాన, వైరాగ్యాదులచే మనో మాలిన్యమును రహితమొనర్చి, చిత్తమును, వినిర్మలముగా జేయవలెను.

స్వచ్ఛమైన అద్దంలో, ముఖం స్పష్టంగా, ప్రకాశించినట్లు స్వచ్ఛమైన బుద్ధిలో పరమాత్మ స్పష్టంగా ప్రతిబింబిస్తాడు.

తర్వాత శరీరాన్ని శుద్ధిచేయటం :

దేహాన్ని దుర్వినియోగం చేయకూడదు. “ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో” కష్టపడి, కోరుకొని, ఈ దేహం తెచ్చుకొన్నాము. అందుకని ఏం చేయాలి?

“శరీర మాద్యం ఖలు ధర్మసాధనం” 

“పరోపకారార్ధం మిదం శరీరం”  “పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం”

“Help ever Hurt never”

“దేవ ద్విజ గురు ప్రాజ్ఞ, పూజనం శౌచమార్జనమ్ ||

బ్రహ్మచర్య మహింసాచ, శారీరం తప ఉచ్యతే ॥ చూశారా! మనకు ఎన్ని guidelines వున్నాయో!

ఇలా Bodyని శుద్ది చేసుకోవాలి.

కనుక స్వచ్ఛత అంటే, Body, Mind, Speech ని cleanగా వుంచుకోవటం త్రికరణ శుద్ధి. Purity in Thought, Word and deed.

నీటిలో ఈదటానికి వెళ్తే, నీ ముందున్న నీటిని, వెనక్కి తోస్తూ నీవు ముందుకు వెళ్తావు. మనం అలా ప్రయత్నం చేయటట్లేదు. మళ్ళీ, మళ్ళీ, అదే అనుభవాలు, అనుభవిస్తూ, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు వుంటున్నాము.

ప్రకృతి ఒకవైపు, పురుషప్రయత్నం, మరొక వైపు వున్నాయి. ఈ రెండు కలసి మెలసి పనిచేయాలి. When there is such unity, you have purity. That purity leads to divinity. మానవుడు సేవలోని ఔన్నత్యాన్ని గుర్తించినప్పుడే అతనిలోని దివ్యత్వం ప్రకటిత మౌతుంది. He realises his oneness with all mankind. అప్పుడే, అతడు / ఆమె, మనం కోరే ఆ, శాశ్వతానందాన్ని, ఆత్మానందాన్ని, స్వాత్మానందాన్ని, అనుభవజ్ఞానంతో తెలిసికోగలదు.

జిల్లెళ్ళమూడి అమ్మ అన్నారు – ఎదుటివారిలో, దైవత్వాన్ని చూస్తున్నంత సేపూ, మనలో దైవత్వం కలుగుతుంది.

జయహో మాతా

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!