(జననం 23.05.1912 మరణం 26.12.1970)
శ్రీమతి ప్రయాగమ్మ శ్రీ కృష్ణారావు పుణ్యదంపతుల మూడవ సంతానం. గాంధీగారిని | దైవంగా భావించి దేశములోనే మొదటిసారి పొన్నూరులో 1955లోనే గుడి కట్టించిన పూజ్యుడు.
280 ఎకరముల మాగాణి భూమిని దేశవిముక్తి కొరకు ధారపోసిన కుటుంబము వారిది.
తన 17వ యేటనే చదువుకు స్వస్తి చెప్పి 1929లో విదేశీ వస్త్రబహిష్కరణలో పాల్గొన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, స్వర్ణపురి, స్వర్ణాభరణం
18వ యేట 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు కాబడి తిరుచినాపల్లి జైలుకు వెళ్లారు.
1931 రాయవెల్లూరు జైలుకు పంపారు.
1932లో ఆంధ్రప్రొవిన్షియల్ సభలో అరెస్టు కాబడి రాజమండ్రి జైలుకు వెళ్ళారు.
1942లో భూదానోద్యమ నాయకుడు శ్రీ వినోబాభావే వీరింటికి వచ్చి వీరి త్యాగశీలతను కొనియాడారు.
1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని గుంటూరు జైలుకు వెళ్ళారు. ఆ రోజుల్లో ఎందరు ఉద్యమకారులు పొన్నూరు వచ్చినా వారింట అందరికీ భోజన ఏర్పాట్లు జరిగేవి.
కుల, మత, విచక్షణ పాటించని కుటుంబ వారిది.
1945లో మంగళగిరి, పొన్నపల్లి, గూడవల్లి, రేపల్లె దేవాలయములలో హరిజన ప్రవేశము జరిపించారు.
బస్సులు జాతీయం చేసేవరకూ రాష్ట్ర మోటారు వర్కర్సు యూనియన్ ప్రెసిడెంట్గా సేవలను అందించారు.
1950లో రాష్ట్ర ఆదిమజాతి సేవాసమితి స్థాపన నెల్లూరులో ఏర్పాటు చేసినవారిలో ముఖ్యులు. ఈ సంస్థకు ప్రెసిడెంటుగా వరుసగా శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు, శ్రీ కొండా వెంకటప్పయ్య, శ్రీ స్వామి శీతారాం తర్వాత వీరే పని చేశారు.
1955లో లోకాయక్ జయప్రకాష్ నారాయణ పొన్నూరు వచ్చి వీరి సేవలను, త్యాగాలను కొనియాడారు.
పొన్నూరు అభివృద్ధి కొరకు యెనలేని కృషి :
1953 నుండి 1959 వరకు పొన్నూరు పంచాయితీ ప్రెసిడెంటుగా పనిచేశారు.
శ్రీ ప్రకాశం పంతులుగారి ‘ఫిర్కాడెవలప్మెంట్ స్కీమ్’ అమలు జరిపారు.
1964లో పొన్నూరులో ఆర్టీసీ డిపో, కరెంట్ సబ్జెస్టేషన్ ఏర్పాటు చేశారు. 1965లో పొన్నూరును మున్సిపాలిటీగా మార్పించారు.
భావనగర్ కాలనీ ఏర్పాటు, అర్బన్ డెవలెప్మెంట్ సొసైటీలు ఏర్పాటు చేశారు. విద్యాసంస్థల ఏర్పాటుకు వారు ఎంతో కృషి చేశారు.
ఆధ్యాత్మిక రంగం :
1958 జిల్లెళ్ళమూడి మాతృశ్రీ అమ్మకు శిష్యులైనారు.
కాలిబాట మాత్రమే వున్న జిల్లెళ్ళమూడిలోని ఆశ్రమానికి రోడ్డు సౌకర్యము కల్పించారు. ఆశ్రమానికి వసతి భవనములు, భోజనశాల మరియు 1967లో కరెంటు, 1968లో టెలీఫోను సౌకర్యము ఏర్పాటు చేయించారు.
మాతృశ్రీ అమ్మ మాసపత్రిక నిర్వహించారు.
1970లో హోమియో వైద్యశాల, సంస్కృత కళాశాలలకు అనుమతులను ప్రభుత్వం నుండి తెచ్చారు.
అమ్మ మహిమను నలుదిశల వ్యాప్తి చేయడంలో, యాత్రాస్థలంగా రూపుదిద్దటంలో అవిశ్రాంత కృషిసల్పిన శిష్య పరమాణువు.