1. Home
  2. Articles
  3. Viswajanani
  4. హనమత్ జయంతి

హనమత్ జయంతి

K B G Krishna Murty
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : February
Issue Number : 7
Year : 2013

15. 5. 2012 మంగళవారం హనుమత్ జయంతి దేశంలో అన్ని చోట్ల జరుగుచున్న విషయం విదితమే. ఈ మధ్య జిల్లెళ్ళమూడిలో కూడా హనుమంతుని విగ్రహ వాయు ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడకూడా కొంతమంది భక్తులు పూజలు పునస్కారాలు జరుపుకుంటున్నారు. వారిలో కొంతమందికి హైమే హనుమంతుడని, వినాయకుడని అమ్మ చెప్పినట్లు విశ్వసిస్తున్నారు. ఇంతవరకు వినాయకచవితికి, హనుమత్ జయంతికి హైమనే ఆయాదేవతలుగా భావించేవారు. ఇప్పుడు ప్రత్యేకంగా వినాయక ఆలయము, ఆంజనేయస్వామి ఆలయము వెలసియున్నవి. మరి పూజలు ఎక్కడ చెయ్యాలి అనేది మీమాంస. జిల్లెళ్ళమూడిలో అమ్మను దర్శించడానికి సోదరీ సోదరులు వచ్చినప్పుడు అమ్మ కొంతమందికి మీరు ముందర హైమను దర్శించి రమ్మనమని హైమాలయానికి పంపించేదట. దానిని బట్టి హైమ విఘ్నేశ్వరుడే అని అనుకుండేవారు. హైమను హనుమంతుడు అని చెప్పే ఉదంతం కూడా వున్నది. మరి హనుమంతుడెట్లా. హనుమంతుడు రామభక్తుడు. ఎప్పుడు రామ నామమే తన ఊపిరిగా వున్నవాడు. మరి హైమో. అమ్మ నామమే తన ఊపిరి అయి వుండాలి. కారణం హైమ చివరికోరికగా అమ్మను తను ఎప్పుడు అమ్మ నామం వినాలనేది. ఆమె మక్కువ అటువంటిది. కనుకనే అమ్మ ఆమెను హనుమంతుడు అంది. ఇప్పుడు ఇక్కడ మన్నవ సుబ్బలక్ష్మి మొదలగువారు ఈ హనుమత్ జయంతికి ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకాలు, హైమాలయంలో ఆకు పూజ మొదలగునవి జరిపించు కున్నారు. ఇందులో మౌలికమైన సందేశం హైమే హనుమంతుడు అని తెలియటమే. అట్లాగే దేవీ నవరాత్రులలో అమ్మను దేవదేవిగా అమ్మను అర్చించేవారు. వినాయక చవితికి వినాయకుడుగాను దీపావళికి మహలక్ష్మిగాను, నాగులచవితికి నాగేంద్రుడు గాను, క్రిష్టమస్కు మరియమ్మ గాను, ఏ పండుగకు ఆయా దేవతగా స్వరూపిణిగా అర్చించే వారు. ఈ దేవతలందరూ విడివిడిగా భాసిల్లుతున్నట్లు వున్నా వున్నది ఒక్కటే అన్నదే దీని భావం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!