వారందరికీ నా హృదయపూర్వక ప్రణామములు. వారందరిపై అమ్మ దివ్యాశీస్సులు.
హరిద్వార్లో కుంభమేళ జరుగుతున్న సందర్భంగా 9-4-2021 నుండి 23-4-21 వరకు అక్కడ సాధువులకి, యాత్రికులకు, పేదలకు, పారిశుద్ధ్య పనివారికి అమ్మ అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. కొన్ని స్నానఘట్టాలు, కూడలులు, మురికివాడలు, కుష్టువ్యాధి పీడితుల కాలనీలు తదితర ప్రాంతాల్లో అమ్మ ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
అమ్మ ప్రసాదంతోపాటు 150 మందికి పదిరూపాయల చొప్పున అనుదినం దక్షిణకూడా ఇచ్చారు. హరిద్వార్ లోని ‘గౌతమి అన్న సత్రం’ వారు సరసమైన ధరలకే అన్న ప్రసాదాన్ని వండించి అందించారు. ప్రతిరోజూ జరిగిన అన్నవితరణ కార్యక్రమానికి ‘స్వామి దయానంద అనుగ్రహ ఆశ్రమం’ ఇన్ఛార్జి శ్రీ విష్ణుత్వానంద సరస్వతిగారి బృందం సహకరించారు.
మొత్తం సేవా కార్యక్రమానికి రూ.1,02,689/ – లు విరాళంగా అందింది. మాతృశ్రీ ప్రాచ్యకళాశాల, పాఠశాల పూర్వవిద్యార్థి సమితి తలపెట్టి నిర్వహించిన ఈ విశిష్ట సేవాకార్యక్రమానికి అమ్మబిడ్డలు, పూర్వవిద్యార్థులు ఎందరో సహకరించారు.