2-3-2014 తేదీన లలితకళాతోరణం, నాంపల్లి, భాగ్యనగరంలో ‘దర్శనమ్’ ఆధ్యాత్మిక వార్తామాసపత్రిక, సంపాదకులు శ్రీ ఎమ్.వి.ఆర్. శర్మగారి ఆధ్వర్యంలో అన్యోన్య సహకారంతో ‘గురువందనమ్’ పేరిట మహోదయులు, సనాతనధర్మసారధి అయిన సద్గురు శ్రీ శివానందమూర్తిగారిని ఘనంగా సన్మానించారు.
అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ముఖ్య అతిధిగా హాజరైనారు, “పరహితమే పరమ సంకల్పంగా మార్చుకున్న ఆధునిక తథాగతుడు సద్గురు” అని అభివర్ణించారు. ఇందు సర్వశ్రీ తుమ్మల నరేంద్రచౌదరి, మల్లాది చందశేఖరశాస్త్రి, ఎమ్.వి.ఆర్. శాస్త్రి, పుల్లెల శ్రీరామచంద్రుడు, వి.యస్.ఆర్. మూర్తి, ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఐ.ఎ.యస్, సిరివెన్నెల సీతా రామశాస్త్రి, యల్లాప్రగడ ప్రభాకరశర్మ, వి.యల్.యస్. భీమశంకరం ప్రభృతులు పాల్గొన్నారు. శ్రీ విశ్వజననీ పరిషత్ తరపున కె.నరసింహ మూర్తి, శ్రీ ఎమ్. దినకర్ పాల్గొనటం విశేషం. వేలాది మంది హాజరై కన్నుల పండుగగా మనోజ్ఞమైన ఈ వేడుకని దర్శించి హర్షధ్వానాలు చేశారు, పరవశించారు.
ఈ సందర్భంగా పూజ్య సద్గురు శ్రీ శివానందమూర్తి గారి అనుగ్రహభాషణ సూర్యప్రభలలో కొన్ని జ్ఞానరోచిస్సులు వెదజల్లారు.