1. Home
  2. Articles
  3. Viswajanani
  4. హైమవతీ జనయిత్రీ వ్రతాలు – రండి పాల్గొనండి

హైమవతీ జనయిత్రీ వ్రతాలు – రండి పాల్గొనండి

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 12
Month : November
Issue Number : 4
Year : 2012

అమ్మ హైమను దేవతను చేసిన సంవత్సరం నుండి “హైమవతీ జనయిత్రీ వ్రతాలు జరగటానికి, తద్వారా బిడ్డలను తరింపచేయటానికి ప్రోత్సహించింది. హైమకు 1000 కొబ్బరి కాయలు కొట్టుకోరా నీ పని నెరవేరుతుంది. మండలదీక్షలో రోజూ హైమకు 108 ప్రదక్షిణలు చేసుకో, హైమకు 11 రోజులు అభిషేకాలు చేసుకో ఈరకంగా ప్రోత్సహించి హైమద్వారా బిడ్డలందరికీ అభీష్టాలు నెరవేరే మార్గం చూపించింది అమ్మ.

లౌకికమైన అభీష్టాలకు హైమ, పారలౌకిక జ్ఞానానికి అమ్మ అని ఒకనానుడి లోకంలో ఉన్నది. ఏమైనా హైమవతీ జనయిత్రీ వ్రతాలలో అమ్మ కథా పారాయణము ఇటు హైమవతీ దేవికి ప్రదక్షిణలు, పూజలు, అభిషేకాలు ఒక సప్తాహదీక్షలో పాల్గొని ఎందరో అక్కయ్యలు చెల్లెళ్ళు తమ కోరికలు నెరవేర్చుకొని సర్వసుఖాలతో వర్ధిల్లుతున్నారు. హైమకు ఎన్ని సంవత్సరాలో అంతమంది పిల్లలకు కన్నె పూజలు, వాళ్ళందరికీ నూతనవస్త్ర ప్రదానాలు అబ్బో ఎంత వైభవోపేతంగా జరుగుతుందో

మీరూ అందులో ఎందుకు పాల్గొనకూడదు. రండి ఒకవారం రోజులు ఈ దీక్షాన్వితులై హైమ అనుగ్రహానికి తద్వారా అమ్మ ఆశీస్సులను పొంది తరించటానికి మంచి అవకాశం. వివాహం కావాలా? చదువులో అభివృద్ధి చెందాలా? ఆరోగ్యవంతులు కావాలా? ఉద్యోగం రావాలా? దేనినైనా అనుగ్రహించటానికి హైమ సిద్ధంగా ఉన్నది. మనమే కోరే సరియైన మార్గాన్ని ఎన్నుకోవటానికి సిద్ధం కావాలి. ఇదిగో ఇది మంచి అవకాశం. హైమవతీ జనయిత్రీ వ్రతాలలో పాల్కొనండి. అభీష్టవరాలు పొందండి. స్వయంగా రాలేని వారు కూడా తమ గోత్రనామాలతో పూజచేయించుకోవచ్చును. ప్రసాదము, హైమవతీదేవి శేష వస్త్రము పంపబడుతుంది.

వివరాలకు : జిల్లెళ్ళమూడి, శ్రీ విశ్వజననీపరిషత్, ఆఫీసులో సంప్రదించవచ్చును.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!