1. Home
  2. Articles
  3. Viswajanani
  4. హైమవతీ దర్శనము

హైమవతీ దర్శనము

Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : August
Issue Number : 1
Year : 2022

1943 – 1968 మధ్యలో జీవించిన హైమవతీ దేవి విశ్వజనని యైన బ్రహ్మాండం అనసూయాదేవి, నాగేశ్వరరావు దంపతులపుత్రిక. జగన్మాత, జగత్పితలుగా ప్రేమించే జిల్లెళ్ళమూడి అమ్మ (భక్తు లందరికీ) బిడ్డలందరికీ నిజమైన అక్క హైమవతీదేవి.

హైమవతీదేవి అమ్మ జిల్లెళ్ళమూడి వచ్చాక జన్మించారు. ఆమె అన్న బ్రహ్మాండం సుబ్బారావు, తమ్ముడు బ్రహ్మాండం రవీంద్రరావు.

అసలు ఎవరు ఈ హైమ? ఎందుకు అమ్మ కడుపున జన్మించారు? ఎందుకు ఇరవైయైదోయేట విశ్వజననికి గర్భశోకాన్ని, అందరింటికి మరవలేని స్మృతులను మిగిల్చి 06-04-1968 న ఆలయప్రవేశం చేశారు.

అమ్మ ఉపదేశము ఐన అమ్మ జీవితమ హెూదధి లోని అన్ని పాత్రలకన్న విశిష్టత కలది హైమవతీదేవి.

బ్రహ్మాండం వసుంధర ప్రచురించిన శ్రీవారి చరణ సన్నిధి మొదటి సంపుటం హైమవతీ దేవిని తెలియడానికి ప్రాథమిక ఆధారం. హైమవతీ దేవి కన్న రెండు నెలలు చిన్నదైన బ్రహ్మాండం వసుంధర, హైమను సకల వాంఛితార్థప్రదాయిని అన్నారు.

కొండముది బాలగోపాలకృష్ణమూర్తి ప్రచురించిన అమ్మతో అనుభవాలలో అమ్మ మాటలలోనే కన్యాకుమారికి హైమవతీదేవికి పోలికలున్నాయి. శ్రీవారి చరణ సన్నిధి ఆధారంగానే అమ్మ హైమక్కను ‘మనందరికీ దారి చూపిన మార్గదర్శి’ అన్నారు. హైమవతీదేవి ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఎక్కిరాల భరద్వాజ గారు. తన కన్న పెద్దవారైన భరద్వాజను హైమక్క తన బిడ్డగా చూసుకొన్నారు. అమ్మ మాటలలో ఇంత ప్రేమగా చూసుకొనే హైమక్కను పోగొట్టుకొన్న భరద్వాజ నిజంగా దురదృష్టవంతుడు. అసలు ఎవరీ హైమ?

అమ్మ సంతానంలో అమ్మపట్ల ప్రపత్తి, ప్రణి పాతము, ఆత్మసమర్పణ చేసిన వ్యక్తి హైమవతీదేవి. ఆమె అమ్మను సాక్షాత్తు దేవతగాను, తనను గమ్యం తెలియక ఏదో సాధన, జపం చేసుకొనే ఆధ్యాత్మిక బాటసారిగాను చూసుకొన్నారు. పన్నాల రాధాకృష్ణ శర్మ గారి పావకప్రభలో మాటమాటలోనూ హైమ తత్త్వమే కనబడుతుంది.

దుర్గమమైన లక్ష్యాన్ని చేరలేక, తపిస్తూ, అమ్మ తప్ప తారకమార్గం లేదనుకొనే సన్మార్గగామి హైమవతీదేవి. విష్ణుమూర్తి గోత్రమైన శ్రీవత్ససగోత్రంలో జన్మించిన విష్ణుమాయా తత్త్వమే, యోగమాయా విలాసమే హైమవతీ దేవి.

తనను అమ్మా అని స్మరిస్తేచాలు ఆదుకొనేది కానీ అమ్మా అనే పిలుపులో తపన ఉంటే అదే అమ్మ. తారకమౌతుందని ఋజువు చేయడానికి నిలువెత్తు ఉదాహరణ హైమవతీదేవి.

అమ్మ తన కుమార్తెగా కాక, ఆమెలోని తపనను, తన్మయతను గ్రహించి ఆ అర్హతతో దైవత్వాన్ని అనుగ్రహించారు. దైవత్వము ఇచ్చిన అమ్మ గొప్పదా? పొందిన హైమవతీదేవి గొప్పదా అంటే హైమవతీదేవి ఖచ్చితంగా గొప్పది అనాలి.

అక్కడే హైమలో క్రాంతదర్శనం కనబడుతుంది. అమ్మ నామానికి, రూపానికి, రక్తసంబంధానికీ ఏమాత్రం విలువ ఇవ్వకుండా, ఆబ్రహ్మకీటజనని ఐన అమ్మలో అమ్మను ఉపాసించిన హైమవతీదేవి, స్థితప్రజ్ఞత, శ్రద్ధ, ఆత్మ సంయమము ఉంటే అక్షర పరబ్రహ్మతత్త్వం అనుభవంలోకి వస్తుందనే సత్యానికి, గీతావాక్యానికి ఇరవయ్యవ శతాబ్దంలో రమణీయమైన ఉదాహరణ.

నిత్యనిర్మలపరిపూత

పారిజాత

సుమసుకుమారతన్వి మహామనీషి

బ్రహ్మాండవంశపరిపూజిత

దివ్యమూర్తి

నారీమణీ అతిసనాతన హైమవతియె….

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!