చైత్రశుద్ధసప్తమి – కరుణామూర్తి హైమక్కయ్య విదేహగా అవతరించినరోజు. అమ్మ తన గర్భవాసాన జన్మించిన తనయను సమస్తమానవాళి సౌభాగ్యానికై త్యాగం చేసిన చిరస్మరణీయమైన రోజు.
ఏప్రియల్ 19, 2021 హైమాలయోత్సవ కార్యక్రమాలు సంప్రదాయ బద్ధంగా నిర్వహించటం జరిగింది. ఉదయం 7గం.లకు పంచామృతాలతో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, హైమవతీ వ్రతము, నామ
సంకీర్తన జరిగింది.
దయగల హృదయం దైవ నిలయం; అదే హైమ స్వస్వరూపం. కనుకనే హైమక్కయ్య శరీరత్యాగంతో మానవాళి కొండంత అండ విరిగిపోయింది. కానీ హైమ ఆలయప్రవేశం చేసిన తర్వాత కల్పవృక్షం, కామధేనువు కట్టెదుట సాక్షాత్కరించాయి. దైవోపహత సమస్త జీవకోటిపై జీవనామృతధారలు వర్షించాయి. హైమాలయం మహిమాన్విత దేవ్యాలయం.
అది కష్టాల కడలిలో కొట్టుకుపోయే వారికి తీరైన తీరం; ఇహపర సౌఖ్యాల ననుగ్రహంచే పవిత్ర తీర్థం; ప్రేమ, కరుణ, అనుగ్రహం అనే దివ్య విభూతుల త్రివేణీ సంగమం.L