1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

SVJP
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 7వ తేదీ గురువారం సాయంత్రం మహిళా దినోత్సవ సభా కార్యక్రమం జరిగింది. Dr. A. Bhuvaneswari, BHMS, M. D గారు ముఖ్యఅతిధిగా విచ్చేసి మహిళల ప్రాధాన్యత. వారికి తగిన గుర్తింపు అనే అంశంపై ప్రసంగించారు. సభకు అధ్యక్షత వహించిన సంస్కృత అధ్యాపకులు డాక్టర్ వి. పావని, సభా నిర్వహణ చేసిన శ్రీమతి ఎం కవిత గారు  E. Sandhya, R. Ramya, Matrusti Medical Centre నుండి Chamundeshwari గార్లు ప్రసంగించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నదానం హనుమత్ ప్రసాద్ గారు, త్ర్యంబకంగారు, వరప్రసాద్ గారు, సుందర రావు గారు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. ముఖ్య అతిథి శ్రీమతి Dr.A. Bhuvaneswari గారికి అమ్మ ప్రసాదాన్ని కళాశాల మహిళా అధ్యాపకులు అందించారు.

GUEST LECTURE ON ‘HEALTH EDUCATION’

29.02.2024 గురువారం Health Education పై Dr. గుర్రం వెంకట సుబ్బారావు గారిచే guest lecture ఇవ్వబడింది. సుప్రసిద్ధ Dr.J.జ్ఞాన ప్రసూన గారు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. చక్కని ఆరోగ్య సూత్రాలను విద్యార్థులకు అందజేశారు.

ప్రిన్సిపల్ డా. అన్నదానం హనుమత్ ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. కళాశాల సంస్కృత అధ్యాపకులు డా.వి.త్రయంబకం సభానిర్వహణ చేయగా వైస్ ప్రిన్సిపల్ డా. మృదుల వందన సమర్పణ చేశారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!