1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అన్ని నేనులు నేనైన నేను .

అన్ని నేనులు నేనైన నేను .

Annapragada Lakshmi Narayana
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 1
Month : January
Issue Number : 6
Year : 2002

అమ్మ వాక్యాలలో ఒక మహావాక్యం, “అన్ని నేనులు నేనైన నేను ” సాధకులకిది. ఒక మహామంత్రం. మననం చేస్తున్న కొద్ది మకరందం జాలువారే మహోపనిషత్తు. అమ్మ ఇటువంటి వజ్ర వైఢూర్యాలు ఎన్నో ఉన్నా వీటన్నింటికి శిరోభూషణం ఈ వాక్యం. మాతృశ్రీవారి ఆత్మాను భూతికి మణిమయ దర్పణం.

ఒక మహా గ్రంథరచనకు సరిపోయి ఆధ్యాత్మిక సాహితీ సంపద ఈ ఒక్క వాక్యంలోనే నిబిడీకృతమై ఉంది.. శరీరంతో కలిసి ఉన్న “నేను” ఒకటి ఇంద్రియాలతో కలసి ఉన్న “నేను” ఒకటి. మనస్సుతో కలసి ఉన్న “నేను” మరొకటి. బుద్ధితో కలసి ఉన్న “నేను” కలసి ఉన్న ఇంకొకటి. ఇక అహంకారంతో ‘నేను’ సరేసరి. అయితే ఈ ‘నేను’ లన్నీ మనలో నిజంగా ఉన్నాయా ? మనలో అబద్ధపు ‘నేను’లు ఎన్నైనా ఉండవచ్చు. కాని నిజమైన నేను మాత్రం ఒక్కటే. అసలు ఇన్ని ‘నేను’లు ఎక్కడ ఉన్నాయి? ఉన్న ‘నేను’ ‘ఒక్కటే ఆ ఒక్క నేనే ఇన్ని నేనులుగా, నిన్ను భ్రమింపజేస్తున్నది. ఆ ఒక్క ‘నేను’ను గురించే ఎన్ని గ్రంథాలు!. ఎన్ని సిద్ధాంతాలు! ఎన్ని రాద్ధాంతాలు! ఎన్ని మతాలు! ఈ నిజమైన నేను ఏమిటో నీకు స్వయంగా అనుభవంలోకి వచ్చినరోజూ అబద్ధపు నేనులన్నీ చెప్పా పెట్టకుండా వాటికవే మాయమైపోతాయి. నేనుగా మిగలటమే. రమణ మహర్షి బోధనల సారాంశము గూడా ఇదే.

అంతేగాకుండా అన్ని జీవులలో నున్న పదార్ధము, నీలో నున్న ఆత్మపదార్ధము ఒక్కటే. అన్ని ‘నేనులు’

నేనే నేనుగా భావించేది నేనుగా భాసించేది గూడా నేనే నీలోని ‘నేను గొంతెత్తి ‘ఓ’ అనిపిలిస్తే అందరిలో ఉన్న ‘నేను’ లు ఊకుమ్మడిగా ‘ఓ’ అవి ప్రతిధ్వని స్తాయి. అన్ని జీవులలో అవిభాజ్యంగా నున్న ఆత్మయే సార్వజనీనమైన ‘నేను’ నీలోని ‘నేనే’ సర్వజగత్తు రూపంలో అల్లుకొని మరల భిన్నంగా ఉన్నట్లుగా గోచరిస్తున్నది. మాయంటే వేరే ఎక్కడా లేదు. ఇదే మాయ. అయితే నీవు ఈ ఇంద్రియాలకూ, ఈ మనసుకు, ఈ బుద్ధికి, పరిమితమై ఉన్నాననే భావన, నిన్ను వదలనంత వరకు నీకీ బంధమూ తప్పదు. భ్రమలు తప్పవు. మన బాహ్య దృష్టికి గోచరమయ్యే జగత్తంతా నీ యొక్క పరిస్పందనమేనని నీకు అనుభవంలోకి రావాలి. ఈ జగత్తంతా నేనే, ఇదంతా నేనే అనే అనుభూతి గల్గిననాడు “సర్వత్ర మయి పశ్యతి” అందుకే అమ్మ భ్రమ వీడితే బ్రహ్మమే అన్నది 

“అహం బ్రహ్మాస్మి” అనే మహా వాక్యానికి గూడా అంతరార్ధం ఇదే ‘అన్ని ‘నేనులు నేనైన నేను’ అనే మాటకు అమ్మ చెప్పిన వివరణ ఆమె మాటలలోనే

“చెవితో విన్నది నేనే, కంటితో చూచేది. నేనే “నా చెవి, నా ముక్కు అని వేరుగా అనుకుంటూ, అన్నీ నావేనని తెలుసు.

అన్ని రకాల సాధనలకు చరమస్థితి నేను కుంటున్న. నేను – శరీరభాగాలు నేను.. అనుకున్నది నేను. శరీరమూ, మనసూ కలిసిన నేన”.

“ఆయా వ్యక్తులను చూచినప్పుడు ”నేనే’ అనిపించే ‘నేను’ ‘నీ పైన నేను మరల వేరుగా కనపడుతూ అది నేను స్ఫురణకు వచ్చే నేను నీవైన నేను”.

అసలు ఉన్నది ఒకే ఆత్మ గనుక,శరీరము, మనసు కూడా ఆత్మే గనుకనే “ నేను నేనైనా నేను” 

అన్ని కుండలలో నీళ్లుపోసి చుట్టూ చుకొని కూర్చుంటే ఆ కుండలన్నిటి నేను నీ ప్రతి బింబాన్ని నీవు చూచు వచ్చు.

ఆ కుండలన్నింటిలోను కనిపించేది నీ తి బింబమే అయినా దేనికదే వేరుగా ఉన్నట్లు భ్రమ కల్పిస్తున్నాయి. ప్రతి బింబాలు ఎన్ని ఉన్నా బింబం మాత్రము ఒక్కటే. నిజానికి ఆ ప్రతి బింబాలన్నీ నీవేగా! ప్రతి బింబాలన్నీ నిజమైన నీవు మాత్రం గావు. నిజమైన నీవు నీవే.

అమ్మ “నేను కానిది మీరేమి కాదు -న్నా. అందుకే మీలో నేను దైవత్వాన్నే వాస్తాను. మీరు మాత్రం నాలో వానవత్వాన్ని చూస్తారు” అంటే నేను మాత్రం అందరిలో నన్నే చూచుకుంటాను మీ అందరిలో ఉన్న నేను లు కుడా నా ప్రతిబింబాలే గాని వేరు గావు “అన్ని నేనులు నేనే “ అంటుంది అమ్మ 

ఇదంతా దేన్నుండి వచ్చింది? అన్న ప్రశ్నకు అమ్మ జవాబు “అదే ఇన్ని రూపాలుగా వచ్చింది” అని.

”ఇదంతా నేనే’ అన్న అమ్మ వాక్యంలో గూఢార్ధం గూడా ఇదే.

అన్ని నేనులు నేనైన స్థితి, ఒక్కటే నిజమైన నిర్వికల్పస్థితి. ఇదే పునరావృత్తి రహితమైన బ్రహ్మీ భూత స్థితి. ఎన్ని పేర్లతో పిలచినా ఉన్నదొక్కటే ఊహాతీత స్థితి. అమ్మకు ఆస్థితి సహజమై పోయింది. మనతో మాట్లాడుతున్నప్పుడు గూడా తాను కేవలం అదే స్థితిలో నుండ గలిగిన మహిమాన్వితస్థితి. ఆ దివ్యస్థితికే “అన్ని నేనులు నేనైన నేను” అని నామాంతరం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!