1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ – జన్మలు

అమ్మ – జన్మలు

P S N Murthy
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 1
Month : January
Issue Number : 6
Year : 2002

అమ్మ అన్నది జన్మలు లేవు అనను, కాని రావటం, పోవటం అనేది నీ చేతులలో లేదు అని మాత్రము అంటాను. ఉన్నా యను కో అప్పుడైనా వాడిస్తేనే” మరొక సందర్భములో జరిగిన జన్మ నీకు తెలియదు రాబోయే జన్మ అసలే తెలియదు. మరు క్షణంలో ఏమి జరుగునో తెలియని సృ ష్టి రహస్యమది”. అందుచే జన్మలు జోలికి పోవద్దని చెప్పింది అమ్మ.

ఇప్పుడు జన్మ – కర్మ గురించి చెప్పిన మాటలలోని ఆంతర్యాన్ని నేను అం చేసుకున్నంతవరకు విశదీకరిస్తాను. మన పూర్వులు సంప్రదాయానుసారముగ కర్మ కాండకు విశేష ప్రాముఖ్యత యిచ్చి జన్మకు – కర్మను ముడివేసినారు. జన్మకు కారణము కర్మయని, దానిని ఆగామి, సంచిత, ప్రారబ్ధము అని మూడు భాగములుగా విభజించి, దానిలో జీవునికి కొంత స్వతంత్రము కల్పించి, తన చేతులతో తాను చేసుకొన్నట్లు తత్ఫలితాన్ని రాబోయే జన్మలలో అనుభవిస్తూ యుంటారని యిట్లా ఎన్నటికి వెలుగును (పర మాత్మను) చూచేదారి, తెన్ను కానక, జనన మరణ చక్రములో నలుగుతూ యుంటాడని, జన్మకు – కర్మకు తానే కర్తఅని చెప్పారు.

మన పూర్వులు ఆనాటి సమాజ శ్రేయస్సు కొరకు పాపపుణ్యముల రూప కల్పన చేసి, వాటిని, నిబంధనల చట్రములో గించి, వాటి సహాయముతో ఆయుగ ధర్మానుసారము ప్రవచనములు చేసినారు. ఆ మార్గము తప్పుకాదు. నాకో జన్మ సరిపోదా అంది అమ్మ. ఇప్పుడు వాటికి విలువ, విశ్వాసము తగ్గిన తరుణంలో యీ యుగము నకు సరిపడు నట్లు వెలుగు బాటను చూపింది. అమ్మ గుణం గానే పాపపుణ్యములు లేవని, చేతలు నీ చేతులలో లేవని నిర్ద్వందం చెప్పింది అమ్మ.

అమ్మ సాక్షాత్తు లలితాదేవి కనుక బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంధి విభేదిని కనుక పూర్వులు వేసిన బ్రహ్మముడిని విప్పి ఆధ్యాత్మిక | జగత్తుకు వెలుతురును ప్రసరింపచేసింది. పూర్వులు చూపిన అప్పటి మార్గము కఠిన తరము, యీ కాలానికి అనుగుణంగా లేదని. (ఆయమ, నియ మాదులు సాధ్యంకాదు. కనుక) యింతకంటే సులభోపాయము, ఆచరణ సాధ్యము చిత్తమునకు ప్రశాంతత చేకూర్చే మార్గము ను (యీ యుగమునకు సరిపడును) దైవ వాణి (తొలి వాణిని) వినిపించింది. అందుకే అమ్మ అన్నది. “మీకు తెలియని తెలియచెప్పడానికే నాయీ రాక అని 

అమ్మ చెప్పనా మూలమునకే తీసుకొని వెడుతుంది. మూల విరాట్టు కనుక అమ్మ తెరతీసి అనంత సత్యాన్ని వెల్లడి చేసింది. అంతా అదే, అంతా విధి నిర్ణయమే యీ జగత్తు, దానిలోని జీవ కోటి అంతయు పరమాత్మ నిర్ణయాను. సారమే (సంకల్పానుసారమే) నడుస్తున్నది. కాని మానవుడు మాయావశుడై, తాను స్వతంత్రుడవని భ్రమించి, జగత్తులో జరిగే ప్రతి సంఘటనకు, తనదైనందిన ప్రతి కార్యమునకు ముందు ”నేను’ అనే భావన కల్పించుకొని, దానికి మూలకారణమైన “పరమాత్మను విస్మరిస్తున్నాడు. మానవు నకు ఎంత వరకు స్వతంత్రమున్నదో అమ్మ మాటను గుర్తుచేస్తున్నాను. అమ్మను ఒక భక్తురాలు అడిగింది. “నాకు బాబా కనబడతారా అమ్మా! అమ్మ అన్నది. “ఏమో కనపడాలనుకుంటే కనపడ తారు నీచేత నామమే చేయించు కోవాలనుకుంటే చేయించుకుంటాడు’ అంటే భగవన్నామము స్మరించడానికి గాని, ముఖ్యముగా నామము జపించవలసినది కూడా విధి నిర్ణయమే కదా! అందుకనే కొందరిచేత రామ, కొందరిచే కృష్ణ, కొందరిచే శివ, మరికొందరిచే ఏసు క్రీస్తు యిట్లా అనేకమందినే, వారి వారి యిష్ట దేవతా నామము లను స్మరింపచేస్తాడు. మానవ స్వాతంత్ర్యము ఒక భ్రాంతి మనసుకు యీ భ్రమను, లేక తెరను తొలగించుట కొరకే అమ్మ వివిధ సందర్భాలలో అనేక విధములుగ జగత్తులో జరిగే కార్యకలాపములకు గాని, పాపపుణ్యములకు గాని, సుఖ, దుఃఖములన బడే ద్వంద్వాలకు, నీవు కర్తవు కావని, నీకు స్వతంత్రత లేదని, మూల కారణము అతనేనని తెలియ చెప్పింది. అంటే మనము తరచుగా వాడే “నేను” అనే పదమునకు మారుగా (వాడు) (పరమాత్మ) అనే భావన విస్తరింప జేయుటే అమ్మ మాట లోని అమృ తము. వాటిలో కొన్నింటిని జ్ఞాపకము చేస్తున్నాను. 1) భూమిమీదకు పంపేటప్పుడు మీ వంతు యిచ్చిన పాలే పాపాలు

2) ఎవరు ఎందుకు పుట్టారో వారదే చేస్తారు.

 3) నీకు ఏవితోస్తే అది చెయ్య మంటాను. నువ్వు చేసేది, చెయ్య గలిగేది ఏదివాడేగా!

 4) వాడే అన్నీ చేయిస్తున్నాడు అని ‘ తెలియకపోవడమే మాయ లేక ఆజ్ఞానము.

5) నీ తెలియని తనానికి (అజ్ఞానము నకు) కారణము నేను. పరమాత్మ నీచేత తెలియ బర్చుకోవలసింది నేను. నువ్వు చెయ్యి అనేది లేదు.

ఇట్లా అమ్మ ఎన్నో చెప్పింది. అంతా వాడే లేక అమ్మే చేస్తున్నదనే ఆలోచన అంకురించడమే జ్ఞానోదయము. ఈ భావన అమ్మ చెప్పినట్లు స్థిరవడి సర్వకాల సర్వావస్థల యందు కలిగి యుండువాడే జ్ఞాని. ఇదే భావోదయము కనుక ఇచ్చట రమణ భగవాన్ మాటలు గుర్తు చేసుకుందాము. “When mine is given up it is chitta suddhi (purified  mind) through which “god” so shines forth. When “T” is given up it is “Jnana. ” When the nature to give away is developed it results in Janana”.

“నాది వదిలితే చిత్త శుద్ధికలుగుతుంది. దాని ద్వారానే భగవంతుడు ప్రకాశిస్తాడు. “నేను’ వదిలితే జ్ఞానియగును.

తరించడానికి తనకు ఏదైనా మంత్రో పదేశము చేయమని అమ్మను ఒక భక్తుడు అడుగగా అమ్మ అన్నది. “నాన్నా! నీకు మంత్రోపదేశము చేశాననుకొ. అవి ఏమీ చేయలేవు. (జప తపాదులు చేయ లేవు) చేయలేదనే బాధ మిగులు తుంది. అందుచే నీవు ఏ పనిచేసినా, చేయించే పనివాడు (భగవంతుడు) చేయిస్తున్నాడు అనుకో అదే యోగము, తపస్సు! దీనిలో మనము గుర్తించవలసిన విషయములు మూడు ఉన్నాయి. 

  1. నాచే భగవంతుడు చేయిస్తున్నాడు. అంటే నీకు కర్తృత్వము లేదు. తద్వారా మనలోని అహంకారము నశిస్తోంది. అహంకారము ఎంత నశిస్తే మనము పరమాత్మ కు అంత దగ్గర అవుతాము. ఇందులోని నిష్కామ కర్మ, భక్తిజ్ఞానము మూడు లేదంటాను. తోపింప చేసేవాడు. యిమిడి యున్నాయి. ఇదే శరణా గతి మార్గమునకు సుగమమైంది.
  2. బరువు, బాధ్యతలు లేకుండా, నిర్మల చిత్తముతో ప్రశాంత జీవనము గడుపుకుంటే మంత్రము లేక మార్గము ఎంతగానో ఉపకరిస్తుంది.
  3. సదా భగవంతుని జ్ఞాపకము చేసుకోవడము (కొంత అభ్యాసము అయిన తర్వాత క్రీస్తు మరచినా నీకు ఆయనే తనను జ్ఞాపకము చేస్తాడు. యిక్కడ మాటలు జ్ఞాపకము చేస్తున్నాను.
  4. భగవంతుడు ఏది సంకల్పిస్తాడో అదే నీ సంకల్పముగా భావించడమే సరియైన జ్ఞానము.
  5. నీకు వచ్చే ప్రతి ఆలోచన భగవంతు డిచ్చినదే. అది మంచిది కాని లేక చెడ్డది కాని. (రమణనగవాన్)

అందుచే అత్యంత సులభమైన ఈ యుగానికి సరిపడు, యీ జన్మలోనే అను సరించి తరించుటకు అమ్మ (దైవము) చూపిన దివ్యమార్గమే శరణ్యము..

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!