1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అర్కపురి విశేషాలు

అర్కపురి విశేషాలు

Mellacheruvu V R Sai Babu
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

16 ఫిబ్రవరి, 2024 : రథసప్తమి సందర్భంగా జిల్లెళ్ళమూడి హోమశాలలో సౌర, అరుణహోమాలు, సూర్య నమస్కారాలు జరిగాయి. దాదాపు 20 మందికి పైగా అక్కయ్యలు అన్నయ్యలు హెూమంలో పాల్గొన్నారు.

20 ఫిబ్రవరి 2024 : భీష్మ ఏకాదశి సందర్భంగా జిల్లెళ్ళమూడి హెూమశాలలో పురుషసూక్తం, సుదర్శనం, నారసింహ హెూమాలు జరిగాయి..

20 ఫిబ్రవరి 2024 : మాఘశుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీ అనసూయావ్రతం జరిగింది. శ్రీ అనసూయేశ్వరాలయంలో వ్రతాన్ని లక్ష్మీ పార్వతి గారు చేసుకున్నారు.

ఫిబ్రవరి 17, 2024 : నాన్నగారి ఆరాధనోత్సవం సందర్భంగా ఉదయమే మంగళ వాద్యాలు మారు మ్రోగుతుండగా రవి అన్నయ్య, వైదేహి అక్కయ్య గారలు అమ్మ నాన్న గార్లకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఏకాదశ రుద్రాభిషేక అనంతరం వసుంధర అక్కయ్య దగ్గర ఉన్న అర్చామూర్తులను మేళతాళాలతో ఊరేగిస్తూ అనసూయేశ్వరాలయానికి పల్లకీలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఊరేగింపు ప్రారంభం సందర్భంగా వసుంధర అక్కయ్యతో పాటు శ్రీ విశ్వజననీ పరిషత్ ఉభయట్రస్టుల వారు అమ్మకు కొబ్బరికాయలు కొట్టి నీరాజనం ఇచ్చి అమ్మ నామం నాన్నగారి నామం చేసుకుంటూ శ్రీ అనసూయేశ్వరాలయానికి తీసుకొని రావడం జరిగింది. శ్రీ అనసూయేశ్వరాలయంలోని ఉత్సవమూర్తులను ధాన్యాభిషేకం కోసం అంగరంగ వైభవంగా అలంకరించిన అన్నపూర్ణాలయం కళ్యాణ వేదిక మీదకి సోదరీసోదరులు ముందు రోజు రాత్రే తీసుకొనివచ్చి అలంకారం చేయడం జరిగింది. పలువురు యువ కార్యకర్తలు, కాలేజీ విద్యార్థులు, ట్రస్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉదయం 10 గంటలనుండి పరిసర గ్రామాల వారు, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగుళూరు వంటి సుదూర ప్రాంతాలనుండి అమ్మ బిడ్డలు వచ్చి అమ్మ నాన్నగార్లకు అనసూయేశ్వరాలయంలో బియ్యంతోనూ, అన్నపూర్ణాలయం కళ్యాణ వేదిక మీద ధాన్యంతోనూ వరుసక్రమంలో వచ్చి అభిషేకం చేసుకున్నారు. నాన్నగారి ఆరాధనోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ నవనాగ నాగేశ్వరాలయంలో గ్రామస్తులనే నాన్నగారి నామ ఏకాహం చేయడం జరిగింది, ధాన్యాభిషేకానికి వచ్చిన విరాళాలు, ధాన్యంతో అన్నపూర్ణాలయం నిరాటంకంగా, నిర్విరామంగా జరగడానికి ఇది మంచి ఆలోచన, ధాన్యాభిషేకం జిల్లెళ్ళమూడి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన భాగంగా అయింది. ఈ సంవత్సరం ధాన్యాభిషేకానికి దాదాపు 1500 మంది సోదరసోదరీమణులు వచ్చారు. అమ్మ భక్తులకు ధాన్యాభిషేకానికి ఉన్న భక్తి, ప్రాధాన్యత అలాంటిది. అన్నపూర్ణాలయం పాకశాస్త్ర ప్రవీణులు ప్రసాద వితరణగా చేసిన విందు భోజనం ఏర్పాటు ప్రశంసనీయం,

22 ఫిబ్రవరి, 2024 : గురు వుష్యయోగం సందర్భంగా జిల్లెళ్ళమూడి హెూమశాలలో విద్యారణ్యస్వామి ప్రోక్త శ్రీ మహలక్ష్మీ మూలమంత్ర హవనం ఆలయపురోహితులు నిర్వహించారు. హెూమం భానుప్రకాష్ శర్మగారు చేసుకున్నారు.

25 ఫిబ్రవరి 2024 : కాశీభట్ల శివనాగమణి గారు, పెర్వేల రమాకృష్ణమూర్తి, శ్రీమతి సుశీల దంపతులు, పెర్వేల సీతారామచక్రవర్తి శ్రీమతి స్వవ్నదంపతులు జిల్లెళ్ళమూడి గోశాలలో గోదానాలు చేసుకున్నారు.

28 ఫిబ్రవరి, 2024 : సంకష్టహర చతుర్థి సందర్భంగా జిల్లెళ్ళమూడి హోమశాలలో హోమం బాపట్ల నుండి వచ్చిన సోదరసోదరీమణులు చేసుకున్నారు.

27 ఫిబ్రవరి, 2024: జిల్లెళ్ళమూడి వీరాంజనేయస్వామి వారికి మంగళవారం వడమాల వేసి. తమలపాకులతో అష్టోత్తర శతనామ పూజ నిర్వహించారు.

1 మార్చి, 2024 : మాఘ బహుళ షష్టి సందర్భంగా శ్రీకాకుళవు పురుషోత్తం, శ్రీమతి అరుణ గారు హైమాలయంలో శ్రీ హైమవతీ వ్రతం చేసుకున్నారు. డాక్టర్ జ్ఞాన ప్రసూన గారు కూడా పాల్గొన్నారు.

8 మార్చి, 2024 : శివరాత్రి సందర్భంగా జిల్లెళ్ళమూడి ఆలయాలలో ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం, నిత్యపూజలు జరిగాయి. హెమశాలలో ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది.

శ్రీ వారణాసి ధర్మసూరి దంవతులు, అఖిలేష్, భాస్కరమూర్తి దంపతులు, బాపట్ల నుండి వచ్చిన భక్తులు. ఆవరణలోని అక్కయ్యలు బ్రహ్మండం శేషు, వర్ధని, సరళ ఇంకా అనేకమంది పాల్గొన్నారు. రాత్రి 11.00 ఏకాదశ రుద్రాభిషేకం అన్ని ఆలయాలలో జరిగాయి. లింగోద్భవకాలంలో అమ్మదర్శనం, శ్రీ నవనాగనాగేశ్వర స్వామి ఆలయంలో దర్శనం జరిగింది. ఈ కార్యక్రమాలలో ఆలయపురోహితులతో పాటు 22 మంది వేదవందితులు పాల్గొన్నారు. నవనాగనాగేశ్వరాలయంలోని కార్యక్రమాలు శ్రీ వారణాసి ధర్మసూరి శ్రీ రాచర్ల బంగారు, బి. అఖిలేష్ అత్యద్భుతంగా ఏర్పాటు చేశారు..

మార్చి 10, 2024 : సోమన శ్రీనివాసరావు గారు గోమాతలకు 3 రోజులు గోగ్రాసం విరాళం ఇచ్చి మాతృశ్రీ గోశాలలో లక్ష్మీప్రదమైన గోపూజ చేయించుకున్నారు.

10 మార్చి 2024 : జిల్లెళ్ళమూడిలో ప్రతినెలా రెండవ ఆదివారం జరిగే చండీ సప్తశతి పారాయణం. ఈనెల కూడా అనసూయేశ్వరాలయంలో జరిగింది. బాపట్లలో పేదలకు 30 కిలోల పులిహోర ప్రసాదం వితరణ చేయడం జరిగింది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!