1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అవతారమూర్తి

అవతారమూర్తి

Sri Sri Sri Siddheswarananda Bharathi Swamy
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

తపోలబ్దేన దివ్యేన జ్ఞానాగ్నిమయ చక్షుషా

పశ్యామి త్వాం మహాదేవీం మాయాం మానుష విగ్రహాం !

తా|| నా తపస్సునేత లభించిన దివ్యమైన జ్ఞానమనెడు అగ్నితో నిండిన కన్నులతో నిన్ను మానవరూపమును ధరించిన మాయాస్వరూపిణిగా, మహాదేవిగా చూచుచున్నాను.

భాషయా మ్యద్య పూజ్యాం త్వాం అనంత ప్రేమవాహినీం

ఆశ్చర్యకర వాత్సల్యం అర్మగ్రామ నివాసినీం !

అనంతమయిన ప్రేమ ప్రవహింప జేయును, ఆశ్చర్యకరమయిన వాత్సల్యముతో జిల్లెళ్ళమూడి గ్రామములో నివసించుచున్న పూజ్యురాలుగా నిన్ను నేను భావించుచున్నాను.

దివ్యావేశ మహత్వాం త్వాం దేవీరూప సముజ్జ్వలాం

అనసూయాం జగద్దేయాం వందే మాతర మద్భుతం !

తా॥ దివ్యావేశము యొక్క గొప్పదనముతో అలరారుచు. దేవీ రూపముతో ప్రకాశించునూ అద్భుతమూర్తివని లోకమెల్ల కొనియాడు అనసూయా మాతవగు నీకు నమస్కరించుచున్నాను.

హృది స్ఫురతి దృష్ట్వా త్వాం లలితా సౌమ్యరూపిణీ

అపి చండీ మహాఘోరా లోక సంహార కారిణీ !

తా॥ నిన్ను చూచిన నా హృదయములో సౌమ్యరూపిణి అయిన లలిత స్ఫురించుచున్నది. చిత్రము ! మహాభయంకరమై లోకములు సంహరించు చండీమాతయును స్ఫురించుచున్నది.

మాత స్వయి సమీక్షే…హం నిరీహాం నిర్నిబంధనాం

ప్రజావంచక విన్యాసాం దివ్యాకర్షణ సంయుతాం!

తా॥ అమ్మా! నీలో ప్రజ్ఞలను వంచించు ఒక విన్యాసముతో, దివ్యమయిన ఆకర్షణతో సమన్వితమై, ఎట్టి కోరికలు లేని, ఎటువంటి నిబంధనలకు కట్టువడని ఒక మూర్తిని వీక్షించుచున్నాను.

అర్చయామి సదా దేవి ! మత్వా త్వాం మమ మాతరం

ధేనుం తాంత్రిక సంకేతే రేణుకాం ఛిన్నమస్తకాం ! తా॥ ఓ దేవీ! తాంత్రిక సంకేతములోని ధేనువుగా ఛిన్నమస్తకయైన రేణుకగా నా తల్లిగా నిన్ను తలంచి ఎల్లప్పుడును అర్చించుచున్నాను.

ప్రసన్నయా మృదులయా కరుణామృత వర్షయా

హస్త స్పర్శశ్రియాతే లబ! మే మనః పులకీకృతం

తా॥ అమ్మా ప్రసన్నమై, మృదులమై కరుణామృతమును వర్షించు నీ హస్త స్పర్శచే నా మనస్సు పులకించినది.

త్వ మనంత తపః పూర్ణా పరిపూర్ణా కృపామయి !

మన్యే మాం ధనృతాపూర్ణం తవ పాదాభివందనాత్.

తా॥ ఓ కృపామయీ ! పరిపూర్ణురాలవగు నీవు అంతులేని తపస్సుతో నిండిన దానవు. నీ పాదములకు నమస్కరించుటవలన నేనును ధన్యత్వముచే పరిపూర్ణుడ నైతినని భావించుచున్నాను.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!