1. Home
  2. Articles
  3. Viswajanani
  4. చండీ సప్తశతి – దివ్య చైతన్య తాండవం తంగిరాల కేశవశర్మ

చండీ సప్తశతి – దివ్య చైతన్య తాండవం తంగిరాల కేశవశర్మ

Tangirala Kesava Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 1
Month : January
Issue Number : 6
Year : 2002

ప్రళయ కాలంలో జగత్తంతా శూన్యమై జలమయమై ఉండగా, ఆ జల రాశిలో మహా విష్ణువు శేషతల్పశాయియై = యోగనిద్రాపరవశుడైనాడు. అప్పుడు విష్ణుకర్ణమలోద్భూతులయిన మధుకైటభు లను రాక్షసులు విష్ణునాభికమలంలో ఉన్న బ్రహ్మను చంపటానికి ఉద్యుక్తులవుతారు. ఒక వంక గాఢ నిద్రలో మునిగిన జనార్ధ నుని చూసి మరో ప్రక్క ఉగ్రులైన అసుర లను చూసే – బ్రహ్మ విష్ణువుని మేల్కొలుప దలచి మహావిష్ణువు నేత్రము లను నిలయంగా చేసుకున్న యోగ నిద్రను స్తోత్రం చేస్తాడు. అప్పుడా యోగమాయ మహావిష్ణువు నేత్రముల నుండి, నాసిక నుండి, బాహువుల నుండి, హృదయ వక్షస్థలముల నుండి వెలువడి బ్రహ్మకు దర్శనమిస్తుంది. అమెనే మహాకాళి అని కీర్తిస్తున్నారు. విష్ణువు మేల్కొని మధుకైట భులను సంహరించటం మరొక కథ.

మహిషాసురుడు దేవతలను జయించి ఇంద్ర పదవి నధిష్ఠించాడు. తమకు అసురులకు జరిగిన యుద్ధం గురించి, తమ ఓటమి గురించి, తమ తమ అధికారాలను వారు కైవసం చేసుకోవడం గురించి విష్ణు మూర్తి, శంకరుడు ఇరువురూ ఉన్న చోటికి సురప్రముఖులంతా బ్రహ్మను వెంట బెట్టుకుని వెళ్ళి వారికి విన్నవించారు. వారిద్దరికి విపరీతమైన కోపం వచ్చింది. అతికోప పూర్ణమైన వారి ముఖముల నుండి, బ్రహ్మ ముఖ కమలము నుండి ఒక దివ్యతేజస్సు బయటకు వచ్చింది. ఇంద్రాది. దేవతల శరీరముల నుండి కూడా మహా తేజస్సు ఆవిర్భవించి జ్వాలలు చిమ్ము తూన్న, దిగంతవ్యాప్తమైన ఆ తేజోరాశి ఒక స్త్రీ రూపం దాల్చింది. దేవతలందరూ వారి వారి ఆయుధాలు ఇవ్వటం, కానుకలు సమర్పించటం ఆ పరమేశ్వరి మహిషా సురుణ్ణి వధించటం వేరొక కథ. అమెను సమస్త సాధక లోకం మహాలక్ష్మిగా ఉపా సిస్తున్నది.

మళ్ళీ మరోసారి శుంభనిశుంభులనే రాక్షసులు త్రిభువనములను జయించి, సూర్యచంద్రులను దిక్పాలకులను నిర్వీర్యులను చేసి, వాళ్ళ అధికారాలను హస్తగతం చేసుకుని దేవతల నందరిని తరిమి కొట్టారు. అప్పుడు దేవతలంతా అమ్మ వారిచ్చిన అభయాన్ని స్మరించి, హిమా లయాలకు వెళ్ళి విష్ణుమాయను స్తుతం చారు. ఆ సమయంలో గంగా స్నానానికి అక్కడికి వచ్చిన పార్వతీదేవి ‘మీరెవరి గురించి స్తోత్రం చేస్తున్నారు’ అని అడుగు తుంది. అప్పుడామె శరీర కోశం నుంచి ఒక దేవతామూర్తి ఆవిర్భవించి “శుంభనిశుం భులతో పీడింపబడుతున్న వీరు నన్ను గురించి స్తుతిస్తూన్నారమ్మా” అని పలుకు తుంది. ఆమె తన తేజస్సుతో దిక్కులను ప్రకాశవంతం చేస్తోంది. ఆమె మనోహరం రూపం హిమాలయాలకు శోభ చేకూరుస్తు న్నది. ఆమెనే ‘కౌశికి’ అని మహా సరస్వతి అని కీర్తిస్తారు. కేవలం ‘హుం’ అని ధూమ్ర లోచనుణ్ణి, శుంభ నిశుంభులను హత మార్చటం ఇంకొక గాధ.

అమ్మవారు ధూమ్రలోచనుణ్ణి, వాడి పరివారాన్ని పరిమార్చటం విన్న శుంభుడు చండ ముండులనే సేనాధి పతులను పిలిపించి ‘కౌశికీ’ తో యుద్ధం చేసి అమ్మ వారిని బంధించి, తెమ్మని ఆజ్ఞాపిస్తాడు. వారు చతురంగ బలసమేతులై, సకలా యుధములతో సన్నద్ధులై బయలు దేరారు. ఆ సమయంలో హిమాలయా లలో ఒకానొక కాంచన గిరి శిఖరంపైన సింహ వాహనయై చిరునవ్వులు చిందిస్తూ ఉంది.

ఆ అసురసేనలో కొందరు అత్యు త్సాహంతో బాణాలూ చూపిస్తూ ముందు ముందుకు చొచ్చుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. అంతటి సౌందర్య రాశి అయిన అంబికకు కోపం వచ్చింది. ఆమె ముఖం నల్లబడింది. కనుబొమలు ముడివడినై. అప్పుడామె ఫాలభాగం నుండి ఘోరమైన ముఖంతో, పుజ్జెల పేరు ఆభరణంగా ధరించి, పుజ్జెతలబెత్తం చేతబూని అతిభయంకరాకారంతో కాలికాశక్తి ఉద్భవించి చండముండుల్ని తుదముట్టించింది. వెంట ఉన్న మావటీ వాడితో సహా, అధిరోహించిన యోధులతో సహా మత్తగజాన్ని ఒక చేత్తో అవలీలగా లాగి నోటిలోకి విసురు కోగలదామె. ఆమెనే చాముండా అని, చాముండేశ్వరి అని పిలుస్తారు.

ఈ రకంగా తన పరివారమంతా పరాజి తులుకావటం, నశించటం చూసిన శుంభుడు వేలాది మంది మహాసైన్యంతో తానే బయలుదేరాడు. అప్పుడు అమ్మ వారు తన ధనుష్టంకారంతో భూమ్యా కాశాలను నింపివేసింది. వాహనమైన సింహం ఘీంకరించింది. మిగిలిన శబ్దాలేవీ వినపడకుండా కాళికాదేవి హుంక ర్తించింది. అలా సమాయత్తమైన చండీ దేవిని కాళికాదేవిని అసురసైన్యం చుట్టు ముట్టింది. రాక్షస సంహారంకోరి, దేవ హితం కోరి వారిరివురి సేనల మధ్య – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, కుమార స్వామి, నృసింహస్వామి, ఇంద్రుడు, వరాహమూర్తి శరీరాల నుండి ఆయా దేవతల రూపు రేఖలతో, వారి వారి ఆయుధ విశేషాలతో వారి వారి శక్తులు ఉద్భవించాయి.

ఈ విధంగా దేవశక్తులంతా తనను పరివేష్టించి ఉండగా, శివుడు నా ప్రీతి కోసం అసురసంహారం చేయమని అంబికను అడుగుతాడు. అప్పుడు మహాసరస్వతి శరీరం నుండి మహోగ్రమైన, అతి భయంకరాకారంతో ఒక దేవి ఉద్భవించి -శుంభనిశుంభులదగ్గరకు శివుణ్ణి దూతగా పంపిస్తుంది. ఆమెనే శివదూతి అంటారు.

ఇంతమంది సహాయం తీసుకుని కదా నాతో యుద్ధం చేస్తున్నావు. అంత గర్వపడ నక్కరలేదంటాడు. “నేను ఒంటరి దాన్నే. ఇంకెవరున్నారు నేను కాక. వీరంతా నాశక్తులే. నాలోనే లీనమవు తున్నారు. చూడు” అని అనగానే బ్రహ్మాణి మొదలైన సప్తమాతృకలు అమ్మలో లయమైనారు. అమ్మ ఒక్కత్తే మిగిలి ఉంది.

ఈ రకంగా మనలను పరవశింప చేసే విధంగా పూర్ణాత్ పూర్ణమదం’ అన్నట్లుగా ఒక మహాచైతన్యం నుండి మరో చైతన్యం, ఓ కాంతి పుంజం నుండి మరొక కాంతి పుంజం, ఒక తేజోరాశి నుండి మరొక తేజోరాశి ఉదయించిందే తప్ప, ఎక్కడా జనసామాన్యమైన అర్ధంలో జననం లేదు. అందుకనే ఆమె నిత్య.

ఆ స్పందనే ఇన్ని రూపాలై కూర్చున్నది అని అమ్మ అన్నట్లు ఇదంతా ఒకే చైతన్యతాండవం, “ఒక అనంతమైన శక్తి మనకు అర్థం కాకుండా ఉండి నడి పిస్తోంది” అన్నది అమ్మ. అందుకే అదే అఖండ దృష్టితో, సాధకుల ఉపాసనా సౌలభ్యంకోరి శ్రీకల్యాణానందులు ఇందరు దేవతలు లేరనీ, మూడు చరిత్రలు కావనీ, అంతా ఒకే అమ్మ వారిని గురించి అనీ – ఆమెనే మహామాయా శివా – చండీ, అన్నారు. బ్రహ్మ విద్యా ప్రాప్త్యర్ధం అవతరించిన శక్తి స్వరూపమిది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!