1. Home
  2. Articles
  3. Viswajanani
  4. జిల్లెళ్ళమూడి అనసూయమ్మ

జిల్లెళ్ళమూడి అనసూయమ్మ

B Rukmini, Biruduraju Ramaraju
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 1
Month : January
Issue Number : 6
Year : 2002

ఇమామ్ అనే ముస్లిం యువకుడు అమ్మ సంకీర్తన నామం “జయహో మాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి రూపొందించినాడు. అన్ని నామాలతోనూ అమ్మను అర్చించేవారు భక్తులు పూర్వం అని చెప్పింది అమ్మ. అమ్మ మాట్లాడే ప్రతి మాటా ఎంతో అర్ధవంతంగా ఉంటుంది. నాకు ఎవరిని చూసినా నా బిడ్డే అనిపిస్తుంది. నా దృష్టిలో ఆత్మగా కనిపించటమే ఆత్మ సాక్షాత్కారం. అంతా దివ్యంగా కనబడటమే దివ్యదృష్టి అంటుంది అమ్మ.

బ్రహ్మజ్ఞానాన్ని అమ్మ జ్ఞానమే బ్రహ్మగా నిర్వచించింది. శక్తియే దైవమని, సంకల్పమే దైవమని, భక్తియే భగవంతుడని, రక్షణే తల్లి అని, దుష్ట సంహారమంటే దుష్టత్వాన్ని సంహరించట మనీ, రూపరహితుడంటే అన్ని రూపాలు తానైనవాడనీ, పని ఐనా కాకపోయినా అనుగ్రహమేననీ, మృత్యుంజయత్వ మంటే మృత్యుమగూర్చి భయం లేకపోవటమనీ, వైకల్యం లేనిది కైవల్య మనీ, సహించలేనిది హింస అనీ, సర్వాన్నీ స్వాధీనం చేసుకున్నది సాధ్వి, అనీ, దేవుడు – అనేకంగా తోచేవాడు జీవుడనీ, గుర్తు చూపించేవాడు గురువని, ఆ వేదనే ఆరాధననీ, దిగులే జిజ్ఞాసనీ, తపనే తపమనీ, తృప్తే ముక్తి అనీ, మనస్సే దయ్యము – దైవమనీ సందర్భాను సారంగా శబ్దచమత్కారాలు ప్రయో తీరు గమనిస్తే చేతనా చేతనములకే కాదు శబ్దార్థాలకు కూడా అమ్మ ఆమే. కొబ్బరికాయ కొట్టి కుళ్ళిపోయిందే అని బాధపడేవారిని చూసి ‘కుళ్ళు పోయింది’ అని సర్ది చెప్పింది. సమస్యల తోరణాన్ని సమస్యలతో రణం అని అవినాభావ సంబంధాన్ని అవి నా – భావ – సంబంధం అని, సవరణ అవసరంలేనిది వివరణమని, నిగ్రహం కొరకే విగ్రహారాధనమని, తప్పించుకోలేక మనిషి తప్పులు చేస్తాడనీ, తనకు భక్తులెవరూ లేరు అంతా బిడ్డలేననీ, తల్లి తరింప జేసేదనీ, అనుకున్నది జరుగదు తనకున్నది తప్పదనీ, నేను నేనైన నేను అనీ అమ్మ చెప్పిన నిర్వచనం ప్రతి మాటా ఆలోచింపజేస్తుంది. మార్గాన్ని సుగమం చేస్తుంది. గమ్యాన్ని చేరుస్తుంది.

“నాకు శాస్త్ర పరిచయం లేదు నాన్నా! నేను ఏది చెప్పినా నా అనుభవం లోనే చెప్పా. ఆలోచన మనస్సు కాదుగా ! మనస్సుకు ఆలోచనలు వస్తున్నాయి. అంటుంది. అమ్మ. సంప్రదాయాలపై తిరుగుబాటును బోధించటమే కాదు ఆచరింపజేసింది అమ్మ. లేని శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారికి ఆయన పుత్రిక గాయత్రి చేతనే కర్మకాండ జరిపించింది (1977) తన సన్నిధిలో. పూజకు ఆటంకం కలిగిందని బాధపడే భక్తురాలితో తనకు అంటు ముట్టువంటివి లేవన్నది. తనవారు మరణించినా -తనకోసం వచ్చిన వారికి ఇబ్బంది కలుగ కుండా సంతోషంగా వారి కార్యక్రమాలు జరిపించింది.

అవధూతలు యోగులు మానవాళికి చేయవలసిన మేలు, బోధించదలచిన నవ్వుతూ నన్ను పంపించండి” అని సందేశాలు ప్రచారం చేసి తాము వచ్చిన పని ఐపొగానే అవతారాలు చాలిస్తుంటారు నిర్ణయాన్ని తెలియజేసింది. ఆవరణంలో టారు. ఐతే సాధారణ మానవులకే వచ్చే జబ్బులు, కలిగే ఇబ్బందులు మహాత్ములకు కూడా తప్పవన్నట్లు అమ్మ కర్మానుభవాన్ని ప్రత్యక్షమగా ప్రదర్శించింది నడుచుకుంటున్నట్లు కనిపించే అమ్మ భావాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించింది.అమ్మ కు వచ్చిన కాన్సరు వ్యాధి అటువంటిదే.  అనుగ్రహ వీక్షణంతో, స్పర్శతో, శూన్యతిథి (12-6-1985) నా వాక్కుతో, సంకల్పంతో, ప్రసాదంతో తనువు చాలించింది.. ఎందరినో తరింపజేసిన ఆ తల్లి శరీరంలో చేరిన వ్యాధులను నిబ్బరంగా అనుభ వించింది. చివరికి డాక్టర్ల ప్రయత్నాలన్నీ విఫలమైనపుడు అమ్మ “శిథిలమయ్యే  ఈ శరీరానికి ఎన్నాళ్ళని పోటీలు పెట్టమంటారు? సహనం చచ్చిపోయిన పిమ్మట బతకకూడదు. నేను వచ్చిన పని ఐపోయింది ఇక నన్ను పో నివ్వండి నవ్వుతు నన్ను పంపించండి” అని తన నిర్ణయాన్ని తెలియచేసింది కాన్సర్ గడ్డ కూడా అమ్మకు బిడ్డే. ఆవరణలోని జనన్నీ అందరిని పిలిపించుకుని చూసింది. అందరి ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నట్లు కనిపించే అమ్మ తన ఇష్టాను సారంగా క్రోధన సంవత్సరం  జ్యేష్ఠ బహుళ నవమి – దశమి బుధవారం శున్యతిధి (12-6-1985) నాడు తనువూ చాలించింది . ఇప్పుడు అనసూయేశ్వరాలయం నుండే యధా విధి గా పనులన్నీ జరిపిస్తున్నది

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!