1. Home
  2. Articles
  3. Viswajanani
  4. డోర్నాలలో సామూహిక ‘అనసూయా వ్రతాలు’

డోర్నాలలో సామూహిక ‘అనసూయా వ్రతాలు’

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : September
Issue Number : 2
Year : 2022

ఆగష్టు 9, శ్రావణ మంగళవారం శ్రీశైలం క్రింద ఉన్న డోర్నాల గ్రామములో జిల్లెళ్ళమూడి అమ్మ శతజయంత్యుత్సవాల సందర్భంగా లలితా సహస్రనామపూర్వకంగా సామూహిక అనసూయా వ్రతాలు వైభవంగా జరిగినవి. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయ కమిటీ మెంబర్లు, మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ పూర్వ విద్యార్థినీ, ప్రస్తుతం డోర్నాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న శ్రీమతిప్రవల్లిక ఈ కార్యక్రమం ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించగా, శ్రీ విశ్వజననీ పరిషత్తు ట్రస్టు వారు పూజా ద్రవ్యములు, అమ్మ ప్రసాదాలు, అమ్మ ఫోటో, కుంకుమ మొదలైనవి ఉచితంగా అందించారు. దాదాపు 80 మంది సోదరసోదరీమణులు ఈ వ్రతంలో ఉత్సాహంగా పాల్గొని వ్రత కథలను ఆద్యంతం దాదాపు 3 గంటల పైగా శ్రద్ధా భక్తులతో ఆలకించి, లలితా పరమేశ్వరిని పూజించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ. ఎ.వి.ఆర్. సుబ్రహ్మణ్యం, యం.వి.ఆర్. సాయిబాబు, శ్రీ చక్కా శ్రీమన్నారాయణ అన్నయ్య గారు మరియు శ్రీ కాంత్ ప్రభృతులు పాల్గొన్నారు. అమ్మ నామం, అమ్మ సందేశాన్ని శ్రీ యం.వి.ఆర్. సాయిబాబు గారు వివరించగా శ్రీ శ్రీమన్నారాయణ గారు అనసూయా వ్రత కథలను, లలితా సహస్రనామాలతో పూజను శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం గారు మనోజ్ఞంగా చేయించారు. కార్యక్రమం అనంతరం అమ్మ ప్రసాదం, అమ్మ సాహిత్యం, కుంకుమ ప్రసాదం, అమ్మ ఫోటోలు మిగిలిన పూజా ద్రవ్యాలతో వారికి అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ సభ్యులను సన్మానించడం జరిగింది. కమిటీ సభ్యులు 400 మంది భక్తులతో కార్తీకమాసంలో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను సందర్శించుకుంటామని ప్రత్యేకంగా చెప్పటం జరిగింది. జయ హె మాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!