1. Home
  2. Articles
  3. Viswajanani
  4. దివ్యానుభూతి

దివ్యానుభూతి

Kondamudi Dattatreya Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 1
Month : January
Issue Number : 6
Year : 2002

“శరదిందు వికాస మందహాసాం

సుర దిందీవర లోచనాభిరామం

అరవింద సమాన సుందరాస్యాం

అరవిందాసన సుందరీ ముపాస్మే”

ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రం, శ్రీజ్ఞాన సరస్వతీ నివాసమైన “బాసర’. ఈ చదువుల తల్లి, సమక్షంలో వందలాది బాలలు అక్షరాభ్యాసం చేయించు కుంటారు. దసరా పర్వదినాల్లో మేము ‘బాసర’ సందర్శించాము. భైంసా మీదుగా రోడ్డు మార్గంలో “బాసర’” చేరుకుని అమ్మవారి దర్శనం చేసు కున్నాము. వ్యాసమహర్షి తపఃఫలంగా ఇసుక రూపంలో నిర్మతమైన ఆ పరదేవత విగ్రహం “కటాకే దయాం కరే జ్ఞాన ముద్రాం కళా నిర్వివాదాం కళా వై సుభద్రాం” గా కన్పిస్తున్నది. వ్యాస భగవానుడు తపస్సు చేసిన గుహ కూడా దర్శనీయంగా ఉన్నది. “మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్” సమకూర్చే ఆ సరస్వతీ! భగవతీ ! పూర్ణేందుబింబానన భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లు తున్నది. శ్రీ జ్ఞాన సర్వతీ ఆలయ ప్రదక్షిణ సమయంలో ప్రతి భక్తుడూ, భక్తురాలు నాణాలను దేవాలయ వెనుక కుడ్యానికి అంటించటం. వాటిని తిరిగి పదిల పర్చు కోవటం కన్పిస్తుంది. అక్కడ అంటించిన నాణెం క్రింద పడకపోతే ఆ నాణాన్ని అంటించిన దానికి ఇబ్బడి ముబ్బడిగా ధన కనక వస్తువాహనాలు లభిస్తాయని విశ్వాసం, ఆలయ ప్రాంగణంలోని కొండ గుట్టలను సస్యశ్యామలంగా, నేత్ర పర్వంగా తీర్చిదిద్దారు. శారదామాత నిలువెత్తు విగ్రహాన్ని కొండ గుట్టపై అమర్చారు. శ్రీ.శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో దేవాలయం సమీపంలో నడుస్తున్న బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం 8 గదులతో భక్త కోటికి చేతనైన సాయం చేస్తున్నది. అక్కడి వంటా, వడ్డనా బాపట్ల వారే చేస్తున్నారు. ఇదో విశేషం! బాసర క్షేత్రం ఇంత ఖ్యాతి పొందటానికి, భక్తులకు అందుబాటులోకి రావటానికి ప్రధాన కారకులు మన మాజీ ప్రధాన మంత్రి వర్యులు శ్రీ పి.వి. నరసింహారావు గారే! వారికి ఆ అమ్మపై అపారమైన విశ్వాసం. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల కృషి కారణంగా యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ నుండి బాసరకు రైళ్ఛు ఉన్నాయి. అలాగే వివిధ జిల్లాకేంద్రాల నుండి బస్సు సౌకర్యం ఏర్పడింది.

___

రహితమైన సంకల్పం అంటే. రెండు లేనిది (ద్వంద్వం తానైంది) రెండూ తోచినప్పుడు వికారాలు కలుగుతాయి. రెండు ఒకటిగా తోచినప్పుడు రాగరహితుడై, అనురాగ సహితుడై ఉంటాడు.

అమ్మ

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!