1. Home
  2. Articles
  3. Viswajanani
  4. నాన్నగారు ( బ్రహ్మాండం నాగేశ్వర రావు

నాన్నగారు ( బ్రహ్మాండం నాగేశ్వర రావు

Omkaranamda Giri Svami
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : November
Issue Number : 4
Year : 2021

కలువ వెన్నెల మొగ్గ కలలోని రారాజు

 మనసైన రూపునే మాటుగా గొనువాడు

 బ్రహ్మాండవంశాన శ్రీవత్సలాంఛనుడు 

అనసూయ మనములో మీనాంకుడతడే |

 నామచింతనచేత రూపతత్త్వమునొంది.

 మదిలోన మదియౌచు మరుగొందువాడు

 (మూలంపుటమ్మకే మూలసూత్రంబగుచు

కనురెప్పయొడిలోన శయనించువాడు. ॥కలువ||

అమ్మలో అమ్మగా గురువౌచు వెలుగొందు

మేరునగధీరుడౌ బ్రహ్మాండసముడూ. 

కర్తృత్వరహితుడై కరణమే తానౌచు

పరమయోగంబునే చూరగొనువాడూ 

జిల్లెళ్ళమూడిలో నాగేశ్వరుండౌచు 

తోడుగా నీడగా రక్షించువాడూ.

॥కలువ||

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!