అంతర్ముఖ సమారాధ్య – బహిర్ముఖసుదుర్లభ అయిన అమ్మని ప్రతిరాయిలోను, రప్పలోను, చెట్టులోను, మనిషి లోను- నిజానికి ప్రతి అణువు లోను చూసిన మహానుభావుడు సెయింట్ గోల్డెన్ (Saint Gordon),
అమ్మ వలెనే ఇవ్వటమే తప్ప తీసుకోవటం తెలియని మహానుభావుడు, అపర దాన కర్ణుడు సెయింట్ గోర్డన్, “తృప్రేముక్తి” అన్న అమ్మ పసిడి పలుకును మనసంతా నింపుకున్న మహానుభావుడు సెయింట్ గోర్డన్, కన్ను మూసినా, తెరిచినా అమ్మ తప్ప వేరొకటి తలవని, తెలియని మహానుభావుడు సెయింట్ గోర్డన్. అమ్మను శారీరకంగా చూడక పోయినా ప్రతిక్షణము చూస్తూ బ్రతికిన మహానుభావుడు సెయింట్ గోర్డన్.
Saint Gordon Westerlund మాటల్లో అమ్మ, చేతల్లో అమ్మ, అణువణువునా అమ్మ. తన హృదయ సింహాసనంపై అమ్మను నిండుగా ప్రతిష్ఠించుకున్న బ్రాహ్మీమయమూర్తి Westerlund. ***