1. Home
  2. Articles
  3. Viswajanani
  4. మాతృగీతి

మాతృగీతి

Dr. Komaravolu Venkata Subbarao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 1
Month : January
Issue Number : 6
Year : 2002

గీతను దానిలోని సంగ్రామాన్ని నేడు వ్యవహారంలో ఉన్న రాజనీతి దృష్టితో చూడగూడదు.

ఆధునిక రాజకీయ పద్ధతులకూ ఆర్య సంస్కృతిని దీపించిన మానవ ధర్మ =పద్ధతులకూ, హస్తిమశకాంతరం వార. నేటి -రాజకీయాలు స్వార్ధపరత్వంతో, అధికార మోహాంధతతో, అన్యాయ దౌర్జన్యాలతో అన్యోన్య కలహాలతో దురాక్రమణలతో, దురాచార దుర్గంధం తో, పుచ్చి పురుగు చోడుతూ ఉన్నాయి. మానవతకు అలంకార గుణాలైన సహజ దయా దాక్షిణ్యాలూ పరోపకారాబుద్దీ ర్య గాంభీర్యాలూ ఋజు వర్తనమూ, పాప చేతి, రాజకీయ వేత్తలలో కలికానికి కూడా కానరాకుండా పోయాయి. అదృశ్యమై

కపటం నయవంచన క్షుద్రోపాసన చేసే నాయకులు జాతిని బుడ్డ పుంజులు లా ట్టుకొని రక్తపానం చేస్తున్నారు. ప్రకృతి శక్తులతో సామరస్యం సాధించి, తద్వారా దగవత్తత్వాన్ని ధ్యానం చేస్తూ ఆత్మతత్వాన్ని చేరుకోవాలనే మానవ కీర్ష. హింసా లాలసలకూ మారణ కాండకూ గూండా నీతికీ, ఆత్మ వంచ -కూ ఆత్మ ప్రాభవ జిగీషకూ పరజాతి మాంసకూ దారి దీస్తున్నది. ‘సర్వేజనాః సుఖినో భవంతు” అనే షి మహావాణి యొక్క ఆశీర్వాద నంతో స్వకుక్షిం భరిత్వమూ, ష్కారణ పరహింసాప్రవృత్తి సుస్థా పితాలైనాయి.

ఏయే పద్ధతులు మన పురాణాలులో ధర్మ బద్ధాలైనవిగా ఉపదిష్టాలైనవో, అవన్నీ నేడు అనాగరికాలు గాను, ఆ సభ్యలు గానూ, అసమర్ధుని ప్రలాపాలు గానూ అప్రయోజకములుగానూ నిర్ణీతాలె పోయాయి. అనృతం, చౌర్యం, భ్రూణహత్య, సు రాపానం, గురునింద, స్త్రీలపై అత్యాచారం మొదలైన మహా పాతకాలు, నేడు సాంఘిక, రాజకీయ, గౌరవజీవన ఘన మర్యాదా లక్షణాలై కూర్చున్నాయి. అంతే కాదు అవి పాలక సాధనాలైనాయి కూడా. ఇటువంటి చిత్తవృత్తులతో నడిచే కలికాల రాజకీయాల దృష్టిలో భగవద్గీతలో వర్ణితమైన జీవన సంగ్రామము తత్సబంధమైన హిత బోధలు, కేవలం అనాగరిక జల్ప వాక్కు లుగా తోచడంలో ఆశ్చర్య మేమీ లేదు. సత్యం, ఋజువర్తనం, ప్రజా క్షేమం, ప్రజా వాక్యం మీద గౌరవం ఇటువంటి వన్నీ దౌర్బల్య లక్షణాలుగా భావించబడుతున్న నేటి కాలంలో భగవద్గీతా వాక్యాలను సదు పదేశాలు గా ఎవడు గౌరవిస్తాడు?

త్రికరణ శుద్ధి మానవ జీవితయాత్రకు చుక్కాని వంటిదని గీత చెప్పుతుంది. ఈ నాడో? మానవుడు కూడా, అనుకునే దొకటీ, బయటికి చెప్పేదొకటీ తరువాత చేసేదొకటి. ఇటువంటి కుటిల సభ్యతలను ్యసాధనకు ఉపయోగించుకుంటున్న సమాజము భగవద్గీతలోని సత్యసాధన, ‘ఆత్మ న్యోవాత్మనే బంధుః ఆత్మస్యరి పురాత్మనః అనే వాక్యాన్ని ఎలా గౌర విస్తుంది?

నరుల భావన లేల ఉన్నా, రాజుల వక్ర బుధులెన్ని వంకరలు తిరిగినా పంచభూతాల పరాక్రమానికి ఏ విధమైన లోటూ లేదు. గీతలోని సారాంశం ఏ ఒక్క విజేతకు గాని, జాతికి గాని, రాజ్యాంగ నేతకు గాని సంబంధించినది కాదు. ఐహికాతీత విషయాలను సాధించడానికి, పురుషుడుగా పుట్టినవాడు పురు షోత్తముడుగా పరిణ మించడానికి, వ్యక్తి శరీర యాత్రను ఏ విధంగా లక్షించి, రక్షించుకోవలసి ఉంటుందో ఆ ప్రత్యేక విషయాన్నే గీత వివరిస్తుంది. ఆ దృ స్థితోనే మనం గీతను అవగాహన చేసుకోవాలి. సేనయోరు భయోర్మధ్యే, అన్న మాటలలో అంతరార్ధ ములైన ధర్మా ధర్మములనే సేనలే కాని, కౌరవపాండవ సేనలు నిమిత్తార్ధ మాత్రములే అని మనము గుర్తించాలి. ఆ దృష్టితోనే గీత అంతటినీ పఠించాలి. గీతోపదేశాలు, ఏ ఒక్క జాతికీ, కాలానికీ చెందినవి కావనీ గీత దేశకాల పాత్రతీ తమైన విలువలు కల గ్రంథమనీ మనం గ్రహించాలి.

  1. ఆస్తిక బుద్ధితోనే మనం గీతాపఠనం చేయాలి – నాస్తిక బుద్ధితో చేయకూడదు.

గీతా పారాయణాన్ని దుష్ట కర్మగా భావించే వాళ్ళు కూడా లేకపోలేదు. వారు గీతను అభిచార క్రియా గ్రంథంగా విమర్శిస్తారు. కృష్ణ భగవానుడు ఏదో విధంగా కౌరవ వంశనాశనం చేయబూను కొన్నాడు. ఏవో యుక్తి వాదాలు చెప్పి అర్జునుడి చేత ఆ మారణకాండను చేయించ దలుచుకున్నాడు. బాంధవుల వధ పాపకృ త్యంగా అతడు తలపోసినా, ఆత్మ అవినాశి అనీ, శరీరం మాత్రమే నశిస్తుం దనీ, దైవం కౌరవులను అంతకు ముందే చంపి ఉంచా డనీ, అర్జునుడు కేవలం నిమిత్తమాత్రుడనీ, అతడు యుద్ధం చేసినా చేయకపోయినా, ప్రత్యర్ధి రాజలోకం బ్రతికి ఉండే మాట అబద్ధమనీ, ఇలాంటి మాటలతో లేదు.బుద్ధికి మత్తు మందెక్కించి, కౌరవ వధ అనే పోలేరమ్మ జాతరకు అతనిని పురిగొల్పి, కసాయి వాణ్ణిగా చేసి వదిలేశాడు, అని వారి మతం. దాని వలన జరిగిందేమిటి ? పితామహుడు లాంటి భీష్ముణ్ణి, సాక్షాత్తు గురుదేవుడైన ద్రోణుణ్ణి, ఇతర బంధువు లందఱిని తెగనరికి విడిచిపెట్టాడతడు.

“అహింసా పరమోధర్మ:” అని శ్రుతులు ఘోషిస్తాయి. మతమేదైనా సరే మానవనాశనానికి, ప్రోత్సాహమిచ్చేదిగా అది ఉండకూడదు. చేసిన దురంత వధలను సమర్ధించుకోవడానికి అల్లిన యుక్తివాద రూపమైన మరణతంత్ర గ్రంధమూ, హింసాత్మక కావ్యమూ కాక గీత జీవిత పరమార్ధాన్ని నిరూపించ గల ప్రమాణ గ్రంధం కాదు.మానవ కళ్యాణ సూచకమైన బోధకాని, మానవత్వాన్ని నిర్ధారించే వాక్యంగాని ఒక్కటి కూడా అందులో లేదు. మానవ జీవితానికి పవిత్రత నిచ్చే ఆశావాదం అందులో అసలే లేదు. నిక్కచ్చిగా కళ్లకు స్పష్టంగా కనిపించే సదేహజీవితాన్ని కాలదన్నుకొని, విదేహ జీవితాన్ని శ్లాఘించే ఇటువంటి కృత్రిమ మత గ్రంధాలు మానవులకు చెడుగే చేస్తాయి కాని శ్రేయస్సును చేకూర్చవు. కనుక గీతా పఠనాన్ని నిషేధించాలని ఈ అతి వాదుల మతం.

సామాజిక వాదుల మతంలో ఈ వాదానికి కొంతమటుకు పట్టున్నది. ఈ తరగతికి చెందినవారికి పుట్టుకతో వచ్చిన జీవితం చావుతో తీరిపోతుందనే కాని ఈ వ్యాపారాన్నంతటినీ సూత్రధారుడొకడు న్నాడనే విశ్వాసం ఉండదు. చావు కూడా జీవితంలో భాగమే అనే భావం అసలే ఉండదు. అణువిజ్ఞానాన్ని అవలోకించినా, ప్రాణ పరివర్తన విద్యను ఆలోకించినా, సిలికాది బ్రహ్మపర్యంతం కల జీవరాసు లలో జీవస్పందన లేని వస్తువు ప్రకృతిలోనే లేదు 

‘ఇది ధారావాహిక’

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!