వేకువ జామున జగతిని
సాకెచు అమ్మను తలచుట సంస్తవనీయం
బా కరుణామయి దీవన
ప్రాకట శుభములకు నెల్ల ప్రారంభ మగున్.
నేలను నీటను నిప్పున
గాలిని మరి ఆకసమున గమనించంగా
పాలన అమ్మది కాదే?
కేలును జోడింతు నెపుడు కేవల భక్తిన్.
ఎల్లలు లేని మహత్త్వము
చల్లగ లోకములగాచు సామర్థ్యం బా
తల్లికి స్వభావ సిద్ధము
సల్లలితా గుణమహితకు సాష్టాంగ నతుల్.