1. Home
  2. Articles
  3. Viswajanani
  4. మా గురుదేవులు

మా గురుదేవులు

Pogula Srinivasarao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

ఎవరు మాకు గురుదేవ!

వెన్నంటి భుజంతట్టి

నడిపించే మమ్ములను!!

 

మీరు కాక

ఎవరు మాకు గురుదేవ!

కనము మేము ఇకమీదట

తండ్రి లాంటి మనసున్న

మీలాంటి మహనీయుని

కనము మేము గురుదేవ!!

 

కొలనులో కమలములకు

కమలాప్తుడు తోడుండే

కోవెలలో భక్తులకు

భగవంతుడు నీడనిచ్చె

మీరు చూపు మార్గంలో

పయనించే మాకు

చేయూత మీరు కాక

చేరదీయు వారెవరు?

 

కంటికి కన్నీళ్లు తోడు

కడలికి భూమాత తోడు

నింగికి జాబిల్లి తోడు

ముక్తికి పున్నెము తోడు

రేయికి వెన్నెల తోడు

లతకు వృక్షము తోడు

కరుణించే మీరు లేక

ఎవరు తోడు మాకు?

 

సందేహం కలుగు వేళ

సమాధానమై వత్తురు

అన్నయాగ మాచరించ

కనకధార కురిపింతురు

మీ రూపము గాంచబోవ

మా ఎదలో వెలిగేరు

దరహాసపు ధనువుతో

ప్రేమాస్త్రము వదిలేరు!

కడసారి వీడ్కోలు గురుదేవ! వందనం

—-

 

IMPRESSION

“Viswajanani, March 2024”

“In the series AMMA PRASADIMCHINA ANUBHAVAM,”

Aapadbandhavi AMMA on page 8, in March 2024 issue of Viswajanani is touching”

-Sri M.S.Saratchandra kumar

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!