1. Home
  2. Articles
  3. Matrusri Telugu
  4. రంగుటద్దాలలో…. తల్లి యన తొలి

రంగుటద్దాలలో…. తల్లి యన తొలి

Ramachandra
Magazine : Matrusri Telugu
Language : Telugu
Volume Number : 1
Month : June
Issue Number : 1
Year : 1966

[ అమ్మ మాటలను ఎవరి అనుభవాన్నీ, సంస్కారాన్నీ బట్టి వారు అర్థం చేసుకుంటారు. ‘అక్షరదీపాలు’గా మేము యిస్తున్న అమ్మ సూక్తులు ఎవరికి ఎట్లా అవగాహన అయిందీ తమ ‘రంగుటద్దాలలో ‘ నుండే చూసి, చూసినట్లుగానే వ్రాసి పంపవలసినదిగా సోదర రచయితలను అభ్యర్థిస్తున్నాము — సం|॥ ]

తల్లి యన తొలి

  • రామచంద్ర

ఆదిలో నిరాకారుడు నిరంజనుడు నిర్వికారుడు అగు తానే ఉన్నాడు. ఇచట ఆది అంతములు లేవు. స్పందనము లేదు. పరమాత్మ తనయందే యిమిడియుండెను. ( Unknown depths of his own self) తనకై తాను బహిర్గతముడు బ్రహ్మన్ అగోచరమైన దానిని గుర్తుకు దెచ్చును (Brings in to manifestation) వృక్షములో వి త్తనముండు రీతి, చెట్టులోనీరు ఉండురీతి, ఆకాశములో శూన్యము న్నట్లు, ఆ శూన్యములో అనేక రూపాంతరములున్నట్లు ఇట్లు నిర్గుణాతీతమునుండి నిర్గుణమును బహిర్గత మొనర్చును. ఈ నిరాకారము నుండి సాకారము విస్తరిల్లును. ఇట్లు బ్రహ్మన్ జీవునిలోను, జీవుడు బ్రహ్మన్ లోను ఉందురు. వీ రనంతము నుండి అంతమువరకు ఎల్లప్పుడు వేర్వేరుగను ఏకముగను ఉందురు.

కావున అతడే బ్రహ్మము, జీవుడు, మాయ అగుదురు. అతడే ప్రాణము, అక్షరము, తదర్ధము అగుట. అతడే నానాత్వరూపము. అనంతమైన ఆకాశము. అతడే అనంతమగు దాని అంతమునగుట, అంతము అనంతమగు దాని కతీతుడు (Beyond). సత్యస్వరూపుడు (Pure Being). పరమాత్మ ఆత్మయందును, పరమాత్మయందు బిందు వుండును గాన ఈ బిందువులు ప్రతిబింబ దర్శన మగు నందురు.

తాను సాహంకార కార్యమైన మనస్సునందు, వృధివ్యాధి పంచభూత లయము, ఆవృత్తి విషయత్వాధికమైన మనస్సును, బుద్ధిని గూడ అహంకారమందు, అహంకారమును చిత్తమందు, చిత్తమును క్షేత్ర జ్ఞాని యందు, క్షేత్రజ్ఞుని పరమాత్మునియందు, పరమాత్ముని తుర్వ మందు, తుర్యమును తురీయాతీతమందు, అనామయము శివస్థానములో లయింపవలె నందురు. దీనినే ప్రణవములోని అ, ఉ, మ – యే గాక పైన గల రేఫబిందువు యగును. అంతగాని సర్వము ఆత్మస్వరూపము గాదట.

పరమాత్మయగు విశ్వచైతన్యము పరిణామములకు లోబడక, దేశకాలా తీతమగు అనంతముగా నుండను కాన తాను విశ్వములో ఎచట నేని, ఏ కేంద్రము నుండి గాని, అనంతమగు కాలము ఏకాలము సంజనను, తన సృష్టి నైపుణ్యముగాని, పరిణామముగాని వెడలింప సమర్థమై యుండును. సృష్టి పరిణామమను రెండున్నూ అది విధానము లోనివే కావున సృష్టి యను దానికి మొదలని కాని, ఆది యని గాని యుండనేరదు. భగవంతు డెంత అనాదియో సృష్టియు అంత అనాదియే యని తెలియుచున్నది.

జ్ఞానమయుడు తేజోమయమగు శివస్వరూపమును, శక్తి తత్వము ఆవిర్భవించిన తరి సృష్టి సాగింప నెంచు ప్రధమ స్పందనము వల్ల (విచికీర్ష) బిందు వేర్పడునట. ఈ బిందువు వ్యాకోచము చెంది బిందువు – నాద – బీజము లగునట. అప్పటికి బిందువు శివుడనియు బీజము శక్తి యనియు, నాదము ఈ రెంట గల సంబంధ సమన్వయములు గల్గు నది (Stimulator and stimulated)

ఈ బిందువు భేదింప బడినపుడు ధ్వని ఉత్పన్న మగునట. కావున సర్వశబ్దములు దీనియందే గలవు. కావున ఈ శబ్దము ఆకాశతత్వమే. దానంగల వాయుసంచలనమే గాలిగను క్రమతః సృష్టి క్రమమయ్యే నందుడు. ప్రస్తుతము భౌతిక శాస్త్రానుస్వారము బిందువు (Quantum) అయిన నాదము (Wave System) కు ప్రతి యగును.

ఈ ప్రపంచములో సహితము ఏ రెండును కలిసిననే గాని అనుభవ మొసంగ నేరవు, గాన చిత్తు సహితము సత్తు కలిసిననే గాని పర్యవసానమగు ఆనంద మొసంగ నేరవు. కావున ద్వంద్వములు తప్పనిసరి యగుటయు, వీని వెనుకగల ఏకత్వమే ఆనంద స్వరూప మగుటయు తెలియనగును.

ఇట్లే ప్రధమమునగల స్పందనములలో సహితము స్వరత్ X సంకుచిత్ అను ప్రస్పంద విస్పందమునలగు ద్వంద్వము లుండిన నేగాని ఈ ద్వంద్వాతీత స్థితి సనుభవించుట వలను పడమి పరమాతా మునకు సహితము విచికీర్ష యను సంకల్పరూపమగు ‘తొలి’ సృష్టి  కురుత్వాధారమగు ‘తల్లి’ యగుట విధితము. కాపులనే ‘తల్లి యన తొలి ‘

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!