1. Home
  2. Articles
  3. Viswajanani
  4. వినుకొండలో ‘అమ్మ సందేశ సదస్సు’

వినుకొండలో ‘అమ్మ సందేశ సదస్సు’

Unknown
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : October
Issue Number : 3
Year : 2022

వినుకొండ పట్టణంలోని విష్ణుకుండినగర్ లోని తారకరామా కళ్యాణమండపం నందు గంగినేని ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాఘవ సహాయ సహకారాలతో జిల్లెళ్ళమూడి కళాశాల పూర్వ విద్యార్థులచే “అమ్మ సందేశ సదస్సు” ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా తెలుగు పండిట్ సివి కృష్ణయ్య హాజరై అమ్మ తత్వాన్ని భక్తులకు తెలియజేశారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన జిల్లెళ్ళమూడి సో. చక్కా శ్రీమన్నారాయణ అమ్మ సందేశంలో ఆంతర్యాన్ని వివరించారు. “నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అనే అమ్మ సందేశాన్ని వివరణాత్మకంగా వివరించారు. కార్యక్రమానికి విచ్చేసిన గంగినేని రాఘవ మాట్లాడుతూ వచ్చే కార్తిక మాసంలో జిల్లెళ్ళమూడి అమ్మవ్రతాలను నిర్వహించుకునేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కే శేషాద్రి, శేషయ్య, దుర్గారావు, వరప్రసాద్, ఏ.బి. సుబ్బారెడ్డి, వెంకటాచారి, శ్రీను, రంగనాథ్, మరియు భక్త బృందం పాల్గొన్నారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!