ఎంత సేద తీరెనో నా మనసూ
మరెంత పరవశించెనో నా మనసూ
అందరిల్లు చేరగానే
అమ్మ రూపు చూడగానే
నన్ను నేను మరచిపోయి
అమ్మ ఒడిలో వాలాను..!!
వడి వడిగా అడుగు లేస్తూ
ఆలయము చేరాను
అమ్మ నామమే వింటిని
అమ్మను కనుగొంటిని
హైమక్కను కనులగాంచ
కారుణ్యమె వర్షించెను
ఆలయాల ముంగిట్లో
ప్రేమ గంగ ప్రవహించెను!!
ఓ వైపున కడుపు నింపు
అన్న యాగ శాలలు
మరో వైపు మహిమ తెలుపు
మహనీయుల వాక్యాలు
ఆరగించి చూడగానే
అన్నం అమృతమాయె
ఆలకించి వినగానే
అమ్మ మహిమ అర్థమాయె!!